తనియన్లు

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

srisailesa-thanian-small

తనియన్ అనునది ఒక శిష్యునిచే తన గురువు  వైభవమును కీర్తించు మంగళ శ్లోకము. కూరత్తాళ్వాన్  మన గురు పరంపరని విశదపరుస్తూ ఒక అందమయిన శ్లోకమును ప్రసాదించారు ( ఈ శ్లోకము మన నిత్యానుసంధానములలో  భాగము )

లక్ష్మీ:  నాధ సమారంభామ్ నాధ యామున మధ్యమామ్
అస్మదాచార్య పర్యంతామ్ వందే గురు పరంపరాం

lakshmInAtha samArambAm nAtha yAmuna madhyamAm
asmadhAchArya paryanthAm vandhE guru paramparAm

லக்ஷ்மீநாத ஸமாரம்பாம் நாத யாமுந மத்யமாம்
அஸ்மதாசார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம்

అనువాదము:

శ్రియఃపతి ( లక్ష్మీనాథుడు) తో ప్రారంభమయి నాథమునులు మరియు యామునాచార్యులు మధ్యముగా స్వాచార్యులు చివరిగా గల గురు పరంపరని నేను నమస్కరిస్తున్నాను .కూరత్తాళ్వాన్ ,ఎమ్పెరుమానార్ల(భగవద్రామానుజులు) శిష్యులు. కావున “అస్మదాచార్య” అనగా ఎమ్పెరుమానార్లు. కాని సాధారణముగ అస్మదాచార్య అనగా ఈ శ్లోకమును పఠించువారు తమ తమ స్వా చార్యులను“అస్మదాచార్యు”  లుగా భావించవలెను.

acharya haaram

  • క్రమంగా పూర్వాచార్యుల తనియనులను తెలుసుకుందాము. మనం ‘ఓరాణ్ వళి'(మణవాళ మామునులు తమ ఉపదేశరత్న మాల లో తెలిపిన ఆచార్య పరంపర) గురుపరంపర(పెరియపెరుమాళ్ నుండి ఆరంభమయి మణవాళ మామునులతో ముగియును)నుండి ఆరంభిస్తాము. అలాగే మన సత్ సాంప్రదాయములోని  ఆళ్వారుల మరియు  పూర్వాచార్యుల తనియనులను కూడా తెలుసుకుందాము.

 

శ్రీ స్తనాభరణమ్ తేజః శ్రీరంగేశయమాశ్రయే |
చింతామణి మివో ద్భాన్తం ఉత్సంగే అనంతభోగినః ||

srI sthanAbharaNam thEja: srIrangEsayam AsrayE
chinthAmaNi mivOthvAntham uthsangE ananthabhOgina:

శ్రీమహాల క్ష్మిని వక్షస్థలమున  ఆభరణముగా కలిగిన, స్వయంప్రకాశత్వం కలిగిన, శ్రీరంగములో నిత్య నివాసుడు, ఆదిశేషుని ఒడిలో మకుటముగా ఉన్న వానిని ఆశ్రయుస్తున్నాను.

నమః శ్రీరంగ నాయక్యై యద్ర్భూ విభ్రమ భేదతః
ఈశేశితవ్య వైషమ్య నిమ్నోన్నత మిదమ్ జగత్

nama: sriranga nAyakyai yath brO vibhrama bhEthatha:
IsEsithavya vaishamya nimnOnnatham itham jagath

ఎవరి కనుబొమ్మల(తన కోరిక మరియు కృప వలన) కదలికల వలన అన్ని జీవాత్మల( ఒకడు ధనవంతుడిగా మరొకడు ధనహీనుడిగా, ఒకడు విద్యావంతుడిగా మరొకడు విద్యాహీనుడిగా) భాగ్యము నిర్ణయించబడునో ఆ శ్రీరంగనాయకిని ఆశ్రయిస్తున్నాను.

శ్రీరంగచంద్రమసం ఇందిరయా విహర్త్తుం
విన్యస్య విశ్వచిద చిన్నయనాధికారం |
యో నిర్వహత్య నిశమఙ్కుళి ముద్రయైవ 
సేనాన్యం అన్య విముఖా  స్తమిహాశ్రయామ: ||

srIrangachandhramasam indhirayA  viharthum
vinyasya visvachidha chinnayanAdhikAram
yO nirvahathya nisamanguLi mudhrayaiva
sEnAnyam anya vimukAs thamasi sriyAma

భగవంతుడు అనుగ్రహించిన  శక్తి వలన, జీవాత్మ మరియు అచేతనములను నియంత్రించే అధికారం కలిగిన, శ్రీరంగనాయకితో  కాలక్షేపము చేయు అందమయిన చంద్రౌణి వలెనున్న శ్రీరంగనాథుడను వైభవమును తెలియచేయు  శ్రీ విష్వక్సేనులను ఆశ్రయిస్తున్నాను.

మాతా పితా యువతయ: తనయా విభూతి:
సర్వం యదేవ నియమేన మదన్వయానాం |
ఆద్యస్య న: కులపతే: వకుళాభిరామం
శ్రీమత్ తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా ||

mAthA pithA yuvadhayas thanayA vibhUthi:
sarvam ya dhEva niyamEna madh anvayAnAm
Adhyasyana: kulapathEr vakuLAbhirAmam
srimath thadhangri yugaLam praNamAmi mUrdhnA
ప్రపన్న కులమునకు ఆద్యుడైన, వకుళ పుష్పములతో అలంకరించ బడి న, శ్రీవైష్ణవశ్రీ (దివ్య సంపద) చే అలంకరింప బడిన శ్రీపాదములు కలిగిన, నా  వారసులకు తల్లి, తండ్రి,భార్య, పుత్రులు, సంపద మరియు సర్వముగా గల శ్రీశఠకోపుల దివ్య చరణారవిందముల యందు శిరస్సును వంచి నమస్కరిస్తున్నాను.

నమః అచిన్త్య అద్భుత అక్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే
నాథాయ  మునయేగాధ భగవత్ భక్తి సింధవే

nama: achinthya adhbudha aklishta jnAna vairAgya rAsayE
nAthAya munayE agAdha bhagavadh bhakthi sindhavE

ఇతర ప్రాపంచిక విషయములందు వైరాగ్యము ,  అసాథారణ మైన అపరిణామాణాత్మక భగవద్విషయములు యందే  లోతైన ఙ్ఞానము కలిగి నిరంతరము భగవంతున్ని ధ్యానముచేయు, భగవంతుని యందు సముద్రము వంటి లోతైన ఙ్ఞానము కలిగిన శ్రీ మన్నాథమునులకు నమస్కరిస్తున్నాను.

నమః పంకజ నేత్రాయ నాథ శ్రీ పాద పంకజే |
న్యస్త సర్వ భరాయాస్మత్ కుల నాథాయ ధీమతే ||

nama: pankaja nEthrAya nAtha: sri pAdha pankajE
nyastha sarva bharAya asmath kula nAthAya dhImathE

శ్రీమన్నాథమునుల పాదపంకజములను సర్వముగా తలచి ఆశ్రయించిన ఙ్ఞానప్రపూర్ణులు, ప్రపన్న కులమునకు అధికారియైన శ్రీ పుండరీకాక్షులకు  నమస్కరిస్తున్నాను.

అయత్నతో యామునం ఆత్మ దాసం అలర్క్క పత్రార్పణ నిష్క్రయేణ |
యః క్రీతవా నాస్థిత యౌవరాజ్యం నమామి తం రామ మేయ సత్త్వం ||

ayathnathO yAmunam Athma dhAsam alarkka pathrArppaNa nishkrayENa
ya: krIthvAnAsthitha yauvarAjyam namAmitham rAmamEya sathvam

రాచరికములో మునిగిన   శ్రీ యామునాచర్యులను అలర్కపత్రములచే(ముండ్లముస్తెకూర/తూతువీలక్కీలై)భగ వద్విషయము వైపు మరల్చిన శ్రీరామమిశ్రులను ఆశ్రయుస్తున్నాను.

యత్ పదాం భోరుహ ధ్యాన విధ్వస్తాశేషకల్మషః |
వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం ||

yath padhAmbhOruhadhyAna vidhvasthAsEsha kalmasha:
vasthuthAmupayA dhOham yAmunEyam namAmitham

ఎవరి దివ్యకృపతో నా కల్మషములన్నీ నాశనము చెందినవో మరియు ఒక వస్తువుగా గుర్తించబడ్డానో పూర్వము అసత్ (అచేతనము)గా ఉండి యామునాచార్యుల పాదముల ధ్యానముతో ప్రస్తుతం సత్(ఆత్మ/ చేతనము) గా భావిస్తున్నానో ఆ శ్రీయామునాచార్యులకు  నమస్కరిస్తున్నాను.

కమలాపతి కల్యాణ గుణామృత నిషేవయా |
కామాయ సతతం పూర్ణాయ మహతే నమః ||

kamalApathi kalyANa guNAmrutha nishEvayA
pUrNa kAmAya sathatham pUrNAya mahathE nama:

నిరంతరం శ్రీమన్నారాయణుని కళ్యాణ గుణములను అనుసంధిస్తు ఆనందిస్తున   శ్రీ మహాపుర్ణులకు నమస్కరిస్తున్నాను.

యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ
వ్యామోహత: తదితరాణి   తృణాయ మేనే |
అస్మద్ గురో: భగవతోస్స్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||

yOnithyam achyutha padhAmbuja yugma rukma
vyAmOhathas thathitharANi thruNAya mEnE
asmadhgurOr bhagavathOsya dhayaikasindhO:
rAmAnujasya charaNau sharaNam prapadhyE

ఇతరములను గడ్డిపరక(విలువలేని)గా భావిస్తు నిరంతరము అచ్యుతుని దివ్య/బంగారు పాదయుగ్మముల యందు వ్యామోహపడి,   దివ్య లక్షణములను కలిగిన కరుణా సముద్రులు మా ఆచార్యులైన శ్రీరామానుజుల దివ్య చరణారవిందములను రక్షకములుగా  ఆశ్రయుస్తున్నాను.

రామానుజ పదచ్ఛాయా గోవిందాహ్వ అనపాయినీ | 
తదా యత్త స్వరూపా సా జీయాన్ మద్ విశ్రమస్థలీ ||

rAmAnuja padha chAyA gOvindhAhva anapAyinI
thadhA yaththa svarUpA sA jIyAn madh visramasthalee

శ్రీరామానుజులను పాదపద్మములకు చ్ఛాయవలే సదా విడవకుండా ఆశ్రయించిన  ఉండే గోవిందభట్టర్ ను నా దుఖములనుండి ఉపశమనం పొందుటకు ఆశ్రయిస్తున్నాను.

శ్రీ పరాశర భట్టార్య శ్రీ రంగేశ పురోహితః |
శ్రీవత్సాంక సుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ||

srI parAsara bhattArya srIrangEsa purOhitha:
srIvathsAnga sutha: srImAn shrEyasE mEsthu bhUyasE

శ్రీవత్సాంకుల కుమారుడు, శ్రీరంగనాథుని పురోహితులు  కైంకర్య శ్రీ(దాస్య సంపద) ను కలిగిన  శ్రీ పరాశర భట్టర్ నాకు అన్నీ శుభములను అనుగ్రహించుగాక.

నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే| 
యస్య వాగామృతాసార పూరితం భువన త్రయం ||

namO vEdhAntha vEdhyAya jagan mangaLa hEthavE
yasya vAgAmruthAsAra bhUritham bhuvana thrayam

జగత్తునకు మంగళములు కగించునట్టి, భువన త్రయములను తన అమృతమైన వాక్కులచే పూరించి నారో ఆ  శ్రీ వేదంతికి నమస్కరిస్తున్నాను.

వేదన్త వేద్య అమృత వారిరాశే: 
వేదార్థ సారామృత పూరమగ్ర్యం |
ఆదాయ వర్షం తమహం ప్రపద్యే
కారుణ్య పూర్ణం కలివైరిదాసం ||

vEdhAntha vEdhya amrutha vArirAsEr
vEdhArtha sAra amrutha pUramagryam
AdhAya varshantham aham prapadhyE
kAruNya pUrNam kalivairidhAsam

అమృతము వంటి వేదార్థసారమున సంపూర్ణ ఙ్ఞానముకలిగి ఆ అమృత ధారలను కురియు  పరిపూర్ణ కరుణను కలిగిన శ్రీ కలివైరి దాసులు  (నంపిళ్ళై) ఆశ్రయుస్తున్నాను.

శ్రీ కృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా |
యత్ ప్రసాద ప్రభావేన సర్వ సిద్ధిరభూన్మయ ||

sri krishna pAdha pAdhAbjE namAmi sirasA sadhA
yath prasAdha prabhAvEna sarva sidhdhirabhUnmama

ఎవరి ప్రసాద ప్రభావముచేత సర్వములై ఙ్ఞాన వైరాగ్య, భక్తులు సిద్ధించునో ఆ శ్రీ కృష్ణులు (వడక్కు తిరువీధి పిళ్ళై)  పాదములయందు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే |
సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః ||

OkAchArya guravE krishNa pAdhasya sUnavE
samsAra bhOgi santhashta jIva jIvAthavE nama:

సంసార మనే విష నాగుచే కాటువేయబడ్డ జీవాత్మలకు దివ్యౌషధమైన,  శ్రీ కృష్ణుల (వడక్కు తిరువీధి పిళ్ళై) పుత్రులైన, ఆచార్యత్వమున పూర్ణులైన   శ్రీ లోకాచార్యుల (పిళ్ళై లోకాచార్యులు) కు నమస్కరిస్తున్నాను

నమ శ్రీశైలనాథాయ కున్తీ నగర జన్మనే |
ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్య శాలినే ||

nama srIsailanAthAya kunthI nagara janmanE
prasAdhalabdha parama prApya kainkaryasAlinE

కుంతీనగరమున(ఆళ్వార్ తిరునగరి) జన్నన్మించినట్టి, ప్రసాదముగా పొందిన(ఆచార్యుల నుండి అనుగ్రహిపబడిన) కైంకర్యమును కలిగిన  శ్రీ శైలేశులకు నమస్కరిస్తున్నాను (తిరువాయ్ మొళి పిళ్ళై)

శ్రీశైలేశ  దయా పాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం |
యతీంద్ర ప్రవణం వన్దే రమ్య జామాతరం మునిం ||

srIsailEsa dhayA pAthram dhIbhakthyAdhi guNArNavam
yathIndhra pravaNam vandhE ramya jAmAtharam munim

శ్రీ శైలేశులు (తిరువాయ్ మొళి పిళ్ళై) దయకు పాత్రులైన, యతీంద్రుల ప్రవణులనబడు, ఙ్ఞానము భక్తి మొదలైన కల్యాణ గుణములను కలిగిన రమ్య జామాతృలకు  ( శ్రీ వరవరమునులకు) నమస్కరిస్తున్నాను.

ఆళ్వార్లు మరియు ఇతర ఆచార్యులు కొందరిని కూడ మన శ్రీ వైష్ణవ గురుపరంపరలో భాగముగ స్వీకరిస్తాము.

ఆళ్వార్లు (క్రమానుసారంగా)

kAnchyAm sarasi hEmAbjE jAtham kAsAra yOgiNam
kalayE ya: sriya:pathi ravim dhIpam akalpayath

కాంచ్యాం సరసి హేమాబ్జే జాతం కాసార యోగినం | 
కలయే యః శ్రియఃపతి రవిమ్ దీపం అకల్పయత్ ||

కాంచీపురములోని తిరువె:కా అనేదివ్యదేశములో అవతరించి,  సూర్యుణ్ణి ప్రకాశముగా చేసి  వెలిగించిన దీపముతో  శ్రీమన్నారాయణుని దర్శించిన కాసారయోగిని ఆశ్రయిస్తున్నాను.

mallApura varAdhIsam mAdhavI kusumOdhbhavam
bhUtham namAmi yO vishNOr gYAnadhIpam akalpayath

మల్లాపుర వరాధీశం మాధవీ కుసుమోద్భవం |
భూతం నమామి యో విష్ణో: జ్ఞానదీపం అకల్పయత్ || 

తిరుక్కడల్ మల్లై నాయకుడై (మామల్లాపురం) మాధవి పుష్పము(వసంత)లో అవతరించి, ఙ్ఞానమనే దీపమును వెలిగెంచి శ్రీమన్నారాయణుని దర్శించిన భూతయోగికి నమస్కరిస్తున్నాను.

dhrushtvA hrushtam thadhA vishNum ramayA mayilAdhipam
kUpE rakthOthpalE jAtham mahathAhvayam AsrayE

దృష్ట్వా హృష్టం తదా విష్ణుం రమయా మయిలాధిపం |
కూపే రక్తోత్పలే జాతం మహదాహ్వయం ఆశ్రయే ||

బావిలో( మైలాపురం) ఎర్రని తామరలో అవతరించిన మైలాపుర నాయకుడైన  లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణునను దర్శించిన  మహదాహ్వయులను ఆశ్రయిస్తున్నాను.

 

sakthi panchamaya vigrahAthmanE sUkthikArajatha chiththa hAriNE
mukthidhAyaka murAri pAdhayOr bhakthisAra munayE namO nama:

శక్తి పంచమయ విగ్రహాత్మనే సూక్తిహారజిత చిత్తహారిణే |
ముక్తిదాయక మురారి పాదయో: భక్తిసార మునయే నమో నమః ||

మనకు మోక్షమునిచ్చు భక్తి యొక్క సారమును మురారి(మురుణ్ణి సంహరించిన వాడు)పాదములయందు సమర్పించి భక్తి సారులకు నమస్కరిస్తున్నాను

  •   మధుర కవి  ఆళ్వార్ (మేష  మాసము – చిత్తా నక్షత్రము)

avidhitha vishayAntharas chatArEr upanishadhAm upagAna mAthra bOga:
api cha guNa vachAth thadhEka sEshi madhurakavir hrudhayE mamAvirasthu

అవిదిత విషయాన్తర శఠారే: ఉపనిషదాముప గానమాత్ర భోగ: |
అపి చ గుణవశాత్త దేకశేషీ మధురకవిర్హృదయే మమావిరస్తు ||

నమాళ్వార్ తప్ప ఇతరములు ఎరుగక నిరంతరము వారి పాశుర అనుసంధానముతో  ఆనందమును అనుభవిస్తూ, నమాళ్వారే తమ దైవముగా మనస్సులో స్థాపించిన మధురకవిఆళ్వార్ ను ఆశ్రయిస్తున్నాను.

  • నమ్మాళ్వార్ (పరాంకుశులు)(వృషభ  మాసమువిశాఖా నక్షత్రము)

mAthA pithA yuvadhayas thanayA vibhUthi:
sarvam ya dhEva niyamEna madh anvayAnAm
Adhyasyana: kulapathEr vakuLAbhirAmam
srimath thadhangri yugaLam praNamAmi mUrdhnA

మాతా పితా యువతయ: తనయా విభూతి:
సర్వం యదేవ నియమేన మదన్వయానాం |
ఆద్యస్య న: కులపతే: వకుళాభిరామం
శ్రీమత్ తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా ||

ప్రపన్న కులమునకు ఆద్యుడైన, వకుళ పుష్పములతో అలంకరించ బడి న, శ్రీవైష్ణవశ్రీ (దివ్య సంపద) చే అలంకరింప బడిన శ్రీపాదములు కలిగిన, నా  వారసులకు తల్లి, తండ్రి,భార్య, పుత్రులు, సంపద మరియు సర్వముగా గల శ్రీశఠకోపుల దివ్య చరణారవిందముల యందు శిరస్సును వంచి నమస్కరిస్తున్నాను.

 

gushyathE yasya nagarE rangayAthrA dhinE dhinE
thamaham sirasA vandhE rAjAnam kulasEkaram

ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే |
తమహం శిరసా వందే రాజానం కులశేఖరం ||

ఎవరి నగరములో ప్రతి దినం శ్రీ రంగయాత్రకై చాటింపు వేయబడునో ఆ నగర రాజైన శ్రీకులశేఖరాళ్వార్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

  •  పెరియాళ్వార్ (విష్ణుచిత్తులు / భట్టనాథులు) (మిథున  మాసము – స్వాతి నక్షత్రము)

gurumukam anadhIthya prAhavE thAn asEshAn
narapathi parikluptham sulkamAdhAthu kAma:
svasuram amara vandhyam ranganAthasya sAkshAth
dhvija kula thilakam vishNuchiththam namAmi

గురుముఖ మనధీత్య ప్రాహ వేదానశేషాన్
నరపతి పరిక్లుప్తం శుల్కమాధాతుకామ: |
శ్వశురమమరవంధ్యం రంగనాథస్య సాక్షాత్
ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి ||

గురువువద్ద విద్యను అభసించకను పాండ్యరాజు సభలో  వేదసారమైన విష్ణుపర్వతమును స్థాపించి శుల్కమును( ధనమును కలిగిన మూట)  గైకొనిన, స్వయంగా శ్రీరంగనాథునకు మామగారై( ఆండాళ్ కు తండ్రిగారగుటచే) ద్విజకులమున విశిష్టుడైన   శ్రీవిష్ణుచిత్తులకు నమస్కరిస్తున్నాను.

  • ఆణ్డాల్ (గోద / ఆముక్త మాల్యద/ శూడికొడుత్తనాచ్చియార్  ) (కర్కాటక  మాసము – పూర్వ ఫల్గునీ నక్షత్రము)

nILA thunga sthanagiri thatI suptham uthpOdhya krishNam
pArArthyam svam shruthi shatha shiras sidhdham adhyApayanthI
svOchishtAyAm srajinikaLitham yAbalAth kruthya bhungthE
gOdhA thasyai nama itham itham bhUya EvAsthu bhUya:

నీళా తుఙ్గ స్తనగిరి తటీ సుప్తం ఉద్భోద్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిరసిద్ధం అధ్యాపయన్తీ |
స్వోఛి ష్ఠాయాం స్రజినిగళితం యా బలాత్ కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదం మిదం భూయ ఏవాస్తు భూయః ||

నీళా దేవి యొక్క శిఖరముల వంటి ఉన్నత స్తనములయందు వ్యామోహముతో సమస్తం మరచి నిద్రించిన కృష్ణున్ని లేపి అతనికి తమ  పారతంత్రమును ( వేదములో చెప్పబడ్డ అతి ప్రధాన ముఖ్యమైన   సూత్రము/ విషయము) తెలిపి, తాను విడిచిన మాలలచే బంధించి అతనిని అనుభవించిన గోదాదేవికి నమస్కరిస్తున్నాను.

  • తొండరడిపొడి ఆళ్వార్ (భక్తాంఘ్రిరేణులు / విప్రనారాయణులు)(ధనుర్మాసము – జేష్ట్టానక్షత్రము)

thamEva mathvA paravAsudhEvam rangEsayam rAjavadharhaNiyam
prAbhOdhikIm yOkrutha sUkthimAlAm bhakthAngrirENum bhagavanthamIdE

తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయమ్ |
ప్రాబోధికీం యోకృత సూక్తిమాలాం భక్తాంఘ్రిరేణుం భగవంతమీడే ||

శ్రీరంగనాథున్ని పరవాసుదేవునిగా భావించి తిరుపళ్ళియొళుచ్చి అనే మేలుకొలుపు పాడిన శ్రీవిప్రనారాయణులను కీర్తిస్తున్నాను.

  •  తిరుప్పాణాళ్వార్(మునివాహనులు) (వృశ్చిక  మాసము – రోహిణి నక్షత్రము)

ApAtha chUdam anubhUya harim chayAnam
madhyE kavEra hithur mudhithAnthrAthmA
adhrashtruthAm nayanayOr vishayANtharANAm
yO nischikAya manavai munivAhananm tham

ఆపాద చూడం అనుభూయ హరిం శయానం
మధ్యే కవేర దుహితుర్ ముదితాన్తరాత్మా |
అద్రష్టృతాం నయనయో: విషయాన్తరాణాం
యో నిశ్చికాయ మనవై మునివాహనం తం ||

ఉభయ కావేరి(కావేరి మరియు కొల్లడం) మధ్యన ఆదిశేషునిపై శయనించి ఉన్న శ్రీరంగనాథున్ని ఆపాద మస్తకం సేవించి అవధి రహిత ఆనందమును అనుభవించి శ్రీరంగనాధున్ని తప్ప మరే ఇతర విషయములను  సేవించనని తెలిపిన శ్రీ మునివాహనుల( శ్రీరంగనాథున్ని ఆఙ్ఞానుసారం లోకసారంగ  మునుల భుజములను అధిరోహించిన) ను కీర్తిస్తున్నాను.

  • తిరుమంగై ఆళ్వార్ (పరకాలన్) (వృశ్చికం  మాసము – కృతికా నక్షత్రము)

kalayAmi kalidhvamsam kavim lOka dhivAkAram
yasya gObi: prakAsAbir Avidhyam nihatham thama:

కలయామి కలిధ్వంసం కవిం లోక దివాకరం | 
యస్య గోభిః ప్రకాశాభి: ఆవిద్యం నిహతం తమః ||

కలి నాశకులు, కవి లోకమునకు సూర్యుని వంటి వారు, ఎవరి వాక్కులచే అఙ్ఞానము నశించి ఙ్ఞానోదయమగునో  ఆ కలివైరిని (పరకాలునను)   ఆశ్రయిస్తున్నాను.

ఆచార్యులు  పరంపరగా వస్తున్న ఓరాణ్ వళి (ఉపదేశరత్నమాల) గురుపరంపరరలో లేనివారు. (పరిమితి లేకుండ)

  • కురుగై కావలప్పన్ (మకర  మాసమువిశాఖ నక్షత్రము)

nAthamauni padhAsaktham gyAnayOgAthi sampadham
kurugAthipa yOghIndhram namAmi sirasA sadhA

నాథమౌని పదాశక్తం జ్ఞానయోగాది సంపదం |
కురుగాదిప యోగీంద్రం నమామి శిరసా సదా ||

యోగశాస్త్ర నిపుణులు, ఙ్ఞానభక్తి యోగములలో గొప్ప సంపన్నులై  శ్రీమన్నాథమునుల శ్రీపాదారవిందములను ఆశ్రయించిన కురుగై నివాసకులైన కురుగై కావలప్పన్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

  • తిరువరంగపెరుమాళ్ అరయర్ (వృషభ  మాసము – జ్యేష్ఠ నక్షత్రము)

srIrAmamisra padha pankaja sancharIkam
srIyAmunArya vara puthram aham guNAdyam

స్రీరన్గరాజ కరుణా పరిణామ దత్తమ్ శ్రీభాశ్యకార శరణమ్ వరరన్గమీడె |
శ్రీ రంగరాజ కరుణా పరిణామదత్తం శ్రీ భాష్యకార శరణం వరరంగమీడే||

శ్రీరామమిశ్రుల (శ్రీమణక్కాల్ నంబి) శ్రీపాదతామరలయందు తుమ్మెదవలె సంచరించే, , శ్రీరంగనాథుని కరుణచే జన్మించి, శ్రీయామునాచార్యుల సత్పుత్రులై, కల్యాణ గుణములను కలిగి శ్రీ రామానుజులకు ఆచార్యులైన  తిరువరంగపెరుమాళ్ అరయర్  ను ఆశ్రయుస్తున్నాను.

  • తిరుకోష్టియూర్ నంబి / గోష్టీపూర్ణులు (వృషభ  మాసము –  రోహిణీ నక్షత్రము)

srIvallabha padhAmbhOja dhIbhakthyamrutha sAgaram
srImadhgOshtIpurIpUrNam dhEsikEndhram bhajAmahE

శ్రీవల్లభ పదాంభోజ ధీభక్త్యమృత సాగరం |
శ్రీమద్గో ష్టీ పురీపూర్ణం దేశికేంద్రం భజామహే ||

శ్రీమహాలక్ష్మి వల్లభుడైన శ్రీమన్నారాయణుని పాదములనెడి అమృతసాగరభక్తిలో మునిగిన  ఆచార్యవరేణ్యులైన శ్రీగోష్టీపూర్ణులను ఆశ్రయుస్తున్నాను

  • పెరియ తిరుమల నంబి (వృషభ  మాసము, స్వాతి నక్షత్రము)

srImallakshmaNa yOgIndhra srIrAmAyaNa dhEsikam
srIsailapUrNam vrushabha svAthi sanjAthamAsrayE

శ్రీమల్లక్ష్మణ యోగీంద్ర శ్రీరామాయణ దేశికం |
శ్రీశైలపూర్ణం వృషభ స్వాతి సఞ్జాత మాశ్రయే ||

పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసదేశ ఫలప్రదాయ |
శ్రీ భాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తే ||

సృష్ఠి కర్తయైన  బ్రహ్మ కు తాతగారైన  (శ్రీ శ్రీనివాసుడు నంబి గారి ని తాత(తండ్రి) అని సంభోధించినారు)  శ్రీ భాష్యకారులకు శ్రీమద్రామాయణమును ఉపదేశించిన ఆచార్యవర్యులైన  శ్రీశైలపూర్ణులకు  నమస్కారములు.

  • తిరుమాలై ఆన్డాన్ (కుంభ  మాసము – మఖ నక్షత్రము)

rAmAnuja munIndhrAya dhrAmidI samhithArththadham
mAlAdhara gurum vandhE vAvadhUkam vipaschitham

రామానుజ మునీంద్రాయ ద్రామిడీ సంహితార్థదం |
మాలాధర గురుం వందే వావదూకం విపశ్చితం ||

శ్రీరామానుజులవారికి ద్రావిడ వేదమును(ప్రబంధములను) నేర్పుగా ఉపదేశించిన మాలాధరులని నామాంతరము కలిగిన  ఆచార్యవర్యులలైన  తిరుమాలై ఆన్డాన్ కు వందనములు.

  • తిరుకచ్చి నంబి (కుంభ  మాసము –  మృగశిరా నక్షత్రము)

dhEvarAja dhayApAthram srI kAnchi pUrNam uththamam
rAmAnuja munEr mAnyam vandhEham sajjanAsrayam

దేవరాజ దయాపాత్రం  శ్రీ కాంచచీ పూర్ణం ఉత్తమం |
రామానుజ మునే: మాన్యం వందేహం సజ్జనాశ్రయం ||

వరదరాజస్వామి దయకు పాత్రులై(దేవరాజ పెరుమాళ్ కు చామరకైంకర్యము చేయుచు వారితో ప్రత్యక్షముగా మాట్లాడే వారు) వైష్ణవాగ్రేసరులై స్వయంగా శ్రీరామానుజులచేత గౌరవింపబడే వైష్ణవసన్నిహితులైన  తిరుకచ్చి నంబి గారికి వందనములు.

  • మాఱనేరి నంబి (మిధున  మాసము, ఆశ్లేష నక్షత్రము)

yAmunAchArya sachchishyam rangasthalanivAsinam
gyAnabhakthyAdhijaladhim mARanErigurum bhajE

యామునాచార్య సచ్శిష్యం రంగస్థలనివాసినం |
జ్ఞానభక్త్యాదిజలదిం మాఱనేరిగురుం భజే ||

శ్రీరంగ నివాసితులై శ్రీయామునాచార్యుల ప్రియశిష్యులై సముద్రము వంటి జ్ఞానభక్తిలు కలిగిన మాఱనేరి నంబిని భజిస్తున్నాను.

  • కూరత్తాళ్వాన్ (కుంభ  మాసము – హస్తా నక్షత్రము )

srIvathsa chinna misrEbyO nama ukthima dhImahE:
yadhukthayas thrayi gaNtE yaanthi mangaLa sUthradhAm:

శ్రీవత్స చిహ్న మిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహీ : |
యదుక్తయ: త్రయి క ణ్ఠే  యాన్తి మంగళ సూత్రతామ్ ||

వేదమున సూత్రము(మంగళ సూత్రమువలె) వలె కంఠము నందు ధరించి , శ్రీమన్నారాయణుని వైభవమును విశదపరచిన శ్రీవత్సాంకులకు వందనములు.

  • ముదలియాన్డాన్ / దాశరథి (మేష  మాసము – పునర్వసు నక్షత్రము)

pAdhukE yathirAjasya kathayaNthi yadhAkyayA
thasya dhAsarathE: pAdhau chirasA dhArayAmyaham

పాదుకే యతిరాజస్య కథయన్తి యదాఖ్యయా |
తస్య దాశరధే: పాదౌ శిరసా ధారయామ్యహం ||

శ్రీరామానుజుల పాదుకలుగా కీర్తించబడు దాశరథి యొక్క శ్రీ పాదములను నా శిరస్సుపై సదా ధరించెదను.

  • అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ / వరదగురువు (వృశ్చిక  మాసము – భరణీ నక్షత్రము )

rAmAnujArya sachchishyam vEdhasAsthrArtha sampadham
chathurthAsrama sampannam dhEvarAja munim bhajE

రామానుజార్య సచ్ఛిష్యం వేదశాస్త్రార్థ సంపదం |
చతుర్థాశ్రమ సంపన్నం దేవరాజ మునిం భజే ||

శ్రీరామానుజుల ప్రియ శిష్యులై వేదశాస్త్రములయందు అపార ఙ్ఞానమును కలిగి  సన్యాసాశ్రమ సంపన్నులైన దేవరాజమునులను ( వరదగురువు) భజిస్తున్నాను.

  • కోయిల్ కొమణ్డూర్ ఇళయవిల్లి ఆచార్యులు (మేష  మాసము – ఆశ్లేష నక్షత్రము)

srI kausikAnvaya mahAmbhuthi pUrNachandhram
srI bhAshyakAra jananI sahajA thanujam
srIsailapUrNa padha pankaja saktha chiththam
srIbAladhanvi guruvaryam aham bhajAmi

శ్రీ కౌశికాన్వయ మహామ్భుతి పూర్ణచంద్రం
శ్రీ భాష్యకార జననీ సహజ తనూజం | 
శ్రీశైలపూర్ణ పద పంకజ శక్త చిత్తం
శ్రీబాలధన్వి గురువర్యం అహం భజామి ||

సముద్రమున పూర్ణ చంద్రుని వలే  కౌశిక కులమున వెలుగొందుచున్న శ్రీశైలపూర్ణుల పాదారవిందములను ఆశ్రయించిన, శ్రీరామానుజుల తల్లి సహోదరి కుమారులైన శ్రీబాలధన్వి గురువర్యులను భజిస్తున్నాను.

  • కిడామ్బి ఆచ్ఛాన్ (మేష  మాసము – హస్తా నక్షత్రము)

rAmAnuja padhAmbhOjayugaLI yasya dhImatha:
prApyam cha prApakam vaNdhE pranNathArththiharam gurum

రామానుజ పదామ్భోజ యుగళీ యస్య ధీమతః |
ప్రాప్యం చ ప్రాపకం వందే ప్రణతార్త హరం గురుం ||

శ్రీరామానుజుల శ్రీపాదములను తమ లక్ష్యముగా భావించు ఙ్ఞాన సంపన్నులైన ప్రణతార్తి హరులకు వందనం సమర్పించెదను

  • వడుగ నంబి (మేష  మాసము – అశ్విని)

rAmAnujArya sachchishyam sALagrAma nivAsinam
panchamOpAya sampannam sALagrAmAryam AsrayE

రామానుజార్య సచ్ఛిష్యం సాలగ్రామ నివాసినమ్ | 
పంచమోపాయ సంపన్నం సాలగ్రామార్యం ఆశ్రయే ||

పంచమోపాయములో (ఆచార్యనిష్ఠలో) నిపుణతను కలిగిన, శ్రీరామానుజలు ప్రియశిష్యులైన శ్రీసాలగ్రామ నివాసితులగు వడుగునంబిని ఆశ్రయించదెను.

  • వంగీపురత్తు నంబి

bhArathvAja kulOthbhUtham lakshmaNArya padhAsritham
vandhE vangipurAdhIsam sampUrNAyam krupAnidhim

భారద్వాజ కులో ద్భూతం లక్ష్మణార్య పదాశ్రితం |
వందే వంగిపురాధీశం సంపూర్ణార్యం కృపానిధిం ||

వంగీపురమున భరద్వాజ కులమున  జన్మించి  శ్రీరామానుజుల శ్రీపాదములను ఆశ్రయించిన సంపూర్ణ కరుణానిధియైన శ్రీ  వంగీపుర నంబికి వందనము సమర్పించెదను.

  • సోమాజి ఆణ్డాన్ (మేష  మాసము – ఆర్ద నక్షత్రము)

naumi lakshmaNa yOgIndhra pAdhasEvaika dhArakam
srIrAmakrathunAthAryam srIbhAshyAmrutha sAgaram

నౌమి లక్ష్మణ యోగీంద్ర పాదసేవైక ధారకం |
శ్రీరామక్రతునాథార్యం శ్రీభాష్యామృత సాగరం ||

‘శ్రీరామ’ అను నామాంతరము కలిగి శ్రీభాష్యమునందు అత్యంత నిపుణులైన , శ్రీరామానుజులకు సేవలు చెసినటువంటి సోమాజి ఆండాన్ కు నమస్కరించెదను.

  • పిళ్ళై ఉఱన్గావిల్లి దాసర్/ ధనుర్ధాసు  (కుంభ మాసము – ఆశ్లేష)

jAgarUga dhanushpANim pANau katgasamanvidham
rAmAnujasparsavEdhim rAdhdhAnthArththa prakAsakam
bhAginEyadhvayayutham bhAshyakAra bharamvaham
rangEsamangaLakaram dhanurdhAsam aham bhajE

జాగరూగ ధనుష్పాణిం పాణౌ  ఖఢ్గసమన్విదం
రామానుజ స్పర్శవేదిం  గ్రంద్ధార్థ ప్రకాశకం |
భాగినేయద్వయ యుతం భాష్యకార భరామ్యహం 
రంగేశ మంగళకరం ధనుర్దాసం అహం భజే ||

ఎవరైతే నిత్యము జాగరూకుడై ఒక చేతిలో ధనుస్సును, మరొక చేతిలో కత్తిని మరియు మాయదండము( ఇనుమును  తాకిస్తే బంగారముగా మార్చునది) తమ జీవిత నడవడిక ద్వారా గొప్పవిషయములను చూపిన , ఇద్దరు మేనల్లులను (మహా భక్తశిఖామణులు) కలిగి, శ్రీరామానుజుల మఠమును నడిపిస్తూ సదా శ్రీరంగనథునకు మంగళాశాసనము చేయు ధనుర్దాసులను నేను భజిస్తున్నాను.

  • తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్ళాన్ (తులాం  మాసము – పూర్వాశాడ నక్షత్రము)

dhrAvidAgama sAragyam rAmAnuja padhAsritham
ruchiram (sarvagyam) kurugEsAryam namAmi sirasAnhavam

ద్రావిడాగమ సారఙ్ఞం రామానుజ పదాశ్రితం |
సుధియం కురుకేశార్యం నమామి శిరసాన్వహం ||

ద్రావిడవేదములో లోతైన ఙ్ఞానము కలిగి శ్రీరామానుజులు పాదారవిందములను ఆశ్రయించి ధీమంతులైన కురుకేశులను నమస్కరిస్తున్నాను.

  • ఎన్గళాళ్వాన్ (మేష  మాసము – రోహిణి)

srIvishNuchiththa padha pankaja samsrayAya chEthO mama spruhayathE kimatha: parENa
nOchEn mamApi yathisEkarabhArathInAm bhAva: katham bhavithumarhathi vAgvidhEya:

శ్రీవిష్ణుచిత్త పద పంకజ సంశ్రయాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ |
నోచేత్ మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విధేయం ||

శ్రీవిష్ణుచిత్తుల  పాదములను ఆశ్రయించిన మనస్సు కలిగిన, శ్రీరామానుజ వాక్కులను సరిచేయుటకు నేను ఎన్గళాళ్వాన్ శ్రీ చరణారవిందములను ఆశ్రయించకపోతే ఏమి లాభం.

  • అనంతాళ్వాన్ (మేష  మాసము – చిత్ర)

akilAthma guNAvAsam agyAna thimirApaham
AsrithAnAm susaraNam vandhE ananthArya dhEsikam

అఖిలాత్మ గుణావాసం అఙ్ఞాన తిమిరాపహం |
ఆశ్రితానాం సుశరణం వందే అనంతార్య దేశికం ||

 అఙ్ఞానమను చీకటులను పారదోలు , సమస్త సుగుణములను కలిగిన, ఆశ్రయించిన వారికి శరణాగతి ఇచ్చే శ్రీ  అనంతాళ్వాన్ కు వందనము చేస్తున్నాను

  • తిరువరంగత్త అముదనార్ / శ్రీరంగామృతకవి (మీన  మాసము – హస్తా)

mInE hasthasamudhbhUtham srIrangAmrutham AsrayE
kavim prapannagAyathryA: kUrEsa padha samsritham

మీనే హస్తే సముద్భూతం శ్రీరంగామృతం ఆశ్రయే |
కవిం ప్రపన్నగాయత్ర్యాః కూరేశ పద సంశ్రితం ||

మీన మాసం(చైత్రం) ఫల్గుణి నక్షత్ర్రాన శ్రీ రంగార్యులకు అవతరించి, ప్రపన్న గాయత్రి(ఇరామానుశ నూత్తందాది)ని అనుగ్రహించిన , శ్రీకూరేశుల శ్రీపాదములను ఆశ్రయించిన శ్రీ   తిరువరంగత్త అముదనార్ / శ్రీరంగామృతకవి ని ఆశ్రయిస్తున్నాను.

  • నడాదూర్ అమ్మాళ్ /వరదాచార్యులు (మేష  మాసము – చిత్ర)

vandhE aham varadhAryam tham vathsAbi janabhUshaNam
bhAshyAmrutha pradhAnAdhya sanjIvayathi mAmapi

వందే అహం వరదార్యం తం వత్సాభి జనభూషణం |
భాష్యామృత ప్రదానాద్య సంజీవయతి మామపి ||

శ్రీవత్స కులమున కాంతిని విరజిమ్ము మణివలె అవతరించిన ,అమృతము వంటి శ్రీభాష్య ఉపదేశము వలన నా స్పూర్తిని జాగృతం చేసిన నడాదూర్ అమ్మాళ్ /వరదాచార్యులు గారికి వందన చేస్తున్నాను.

  • వేదవ్యాస భట్టర్ (వృషభ  మాసము, అనూరాధ)

pauthram srIrAmamisrasya srIvathsAngasya nandhanam
rAmasUrim bhajE bhattaparAsAravarAnujam

పౌత్రం శ్రీరామమిశ్రస్య శ్రీవత్సాంకస్య నందనం |
రామసూరిం భజే భట్టపరాశర వరానుజం ||

శ్రీరామమిశ్రుల(కూరేశమిశ్రులు తండ్రి గారు, మణక్కాల్ నంబి కాదు)  పౌత్రులున్ను శ్రీవత్సాంకుల (కూరేశమిశ్రులు) కుమారులున్ను శ్రీ పరాశరభట్టర్ సోదరులైన వేదవ్యాస భట్టర్ ను భజిస్తున్నాను.

  • కూరనారాయణ జీయర్ (మార్గశీర్షము – ధనిష్ఠా నక్ష్త్రము)

srIparAsarabhattArya sishyam srIrangapAlakam
nArAyaNamunim vandhE gyAnAdhiguNasAgaram

శ్రీపరాశరభట్టార్య శిష్యం శ్రీరంగపాలకమ్ |
నారాయణమునిం వందేఙ్ఞానాధి గుణసాగరం ||

సముద్రము వంటి విశాలమైన  ఙ్ఞాన  భక్తి  వైరాగ్యముల కలిగి శ్రీరంగపాలకులై, శ్రీపరాశరభట్టరుల శిష్యులైన కూరనారాయణ జీయర్ కు వందనము చేయు చున్నాను.

  • శ్రుత ప్రకాశికాభట్టర్ (సుదర్శన సూరి)

yathIndhra krutha bhAshyArthA yadh vyAkyAnEna dharsithA:
varam sudharsanAryam tham vandhE kUra kulAdhipam

యతీంద్ర కృత భాష్యార్థా యద్ వ్యాఖ్యానేన దర్శితాః |
వరం సుదర్శనార్యం తం వందే కూర కులాధిపం ||

కూరత్తాళ్వాన్ పరంపరలో ఒక ఆచార్యునిలా వెలుగొంది శ్రీరామానుజుల ‘ శ్రీభాష్యమునకు ‘  ‘శ్రుతప్రకాశికా’ అను వాఖ్యానమును అనుగ్రహించిన  శ్రీసుదర్శన భట్టర్/ శ్రుత ప్రకాశికాభట్టర్ కు వందనము చేస్తున్నాను.

  •  పెరియవాచ్ఛాన్ పిళ్ళై ( సింహ మాసము, రోహిణీ నక్షత్రము)

srImath krishNa samAhvAya namO yAmuna sUnavE
yath katAkshaika lakshyANam sulabha: srIdharas sadhA

శ్రీమత్ కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే |
యత్ కటాక్షైక లక్ష్యాణం సులభః శ్రీధర: సదా ||

ఎవరి కటాక్షము వలన శ్రీధరున్ని(శ్రీమన్నారాయణున్ని) సులభంగా చేరు కుంటామో అలాంటి యామునాచార్యుల పుత్రులైన ఆ శ్రీ కృష్ణులకు / పెరియవాచ్ఛాన్ పిళ్ళై కు నమస్కరిస్తున్నాను.

  • ఈయుణ్ణి మాధవ పెరుమాళ్  (వృశ్చికం  మాసము – రోహిణీ నక్షత్రము)

lOkAchArya padhAmbhOja samsrayam karuNAmbhudhim
vEdhAntha dhvaya sampannam mAdhavAryam aham bhajE

లోకాచార్య పదాంభోజ సంశ్రయం కరుణాంభుధిం |
వేదాంత ద్వయ సంపన్నం మాధవార్యం అహం భజే ||

లోకాచార్యుల(నంప్పిళ్ళై) శ్రీ పాదపద్మములను ఆశ్రయించి కరుణాసాగరులై,  ఉభయ వేదాంతములలో నిష్ణాతులైన శ్రీ (ఈయుణ్ణి) మాధవాచార్యులను భజిస్తున్నాను.

  • ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ (స్వాతి)

mAdhavAchArya sathputhram thathpAdhakamalAsritham
vAthsalyAdhi guNair yuktham padhmanAbha gurum bhajE

మాధవాచార్య సత్పుత్రం తత్పాదకమలాశ్రితం ||
వాత్సల్యాది గుణై: యుక్తం పద్మనాభ గురుం భజే || 

శ్రీమాధవాచార్యుల సత్పుత్రులై వారి శ్రీపాదకమలములను ఆశ్రయించి, వాత్సల్యము(తల్లి  దయాగుణం/ ఓర్పు) మొదలైన  పవిత్ర లక్షణములకు ఆవాసయోగ్యులైన శ్రీ  (ఈయుణ్ణి) పద్మనాభ ఆచార్యుల( పెరుమాళ్)ను భజిస్తున్నాను.

  • నాలూరాన్ పిళ్ళై (పుష్యమి)

chathurgrAma kulOdhbhUtham dhrAvida bhrahma vEdhinam
yagyArya vamsathilakam srIvarAhamaham bhajE

చతుర్గ్రామ కులోద్భూతం ద్రావిడ బ్రహ్మ వేదినం |
యఙ్ఞార్య వంశతిలకం శ్రీవరాహమహం భజే ||

నాలూరాన్ (కూరత్తాళ్వాన్ శిష్యులు) వారుసులై, ఎచ్ఛాన్ ఆచార్యుల(శ్రీరామానుజుల శిష్యులు)వంశ భూషణుడై, ద్రావిడ వేద సారనిష్ణాతులైన శ్రీ వరాహ గురువులను (నాలూరాన్ పిళ్ళై) భజిస్తున్నాను.

 

  • నాలూరాచ్ఛాన్ పిళ్ళై (ధనుర్మాసము – భరణి)

namOsthu dhEvarAjAya chathurgrAma nivAsinE
rAmAnujArya dhAsasya suthAya guNasAlinE

నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే |
రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే ||

చతుర్గ్రామ(నాలూర్) నివాసుకులై, శ్రీరామానుజుల( నాలూర్ పిళ్ళై కి నామాంతరం) పుత్రులై, కల్యాణ గుణములను కలిగిన దేవరాజ గురువులకు నమస్కరిస్తున్నాను.

  • నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ (తులా   మాసము – ధనిష్ఠా  నక్షత్రము)

lOkAchArya padhAsaktham madhyavIdhi nivAsinam
srIvathsachihnavamsAbdhisOmam bhattAryamAsrayE

లోకాచార్య పదాశక్తం మధ్యవీధి నివాసినం |
శ్రీవత్సచిహ్నవంశాబ్ది సోమం భట్టార్యమాశ్రయే ||

నంప్పిళ్ళై శ్రీ పాదపద్మములను ఆశ్రయించి, నడువిళ్ తిరు వీధి(శ్రీరంగములోని ఒక వీధి)నివాసకులై, సముద్రమునకు చంద్రుని వలె శ్రీ కూరత్తాళ్వాన్ వంశమున వెలుగొందు  సోమభట్టార్యుల /  నడువిళ్ తిరు వీధిపిళ్ళై భట్టర్ ను ఆశ్రయుస్తున్నాను.

  •  పిన్బఅళగియ పెరుమాళ్ జీయర్ (తులా మాసము – శతభిషా నక్షత్రము)

gyAna vairAgya sampUrNam paschAth sundhara dhEsikamm
dhravidOpanishadh bhAshyathAyinam madh gurum bhajE

ఙ్ఞాన వైరాగ్య సంపూర్ణం పశ్చాత్ సుందర దేశికం |
ద్రవిడోపనిషద్ భాష్యతాయినం మద్ గురుం భజే ||

సంపూర్ణ  ఙ్ఞాన వైరాగ్యములను కలిగి , ద్రావిడ వేదంబగు తిరువాయ్ మొళి కి సూత్ర భాష్యమును తెలియపరచిన  పశ్చాత్ సుందర దేశికులను భజిస్తున్నాను.

 

  • అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ (ధనుర్మాసము –  ధనిష్ఠా నక్షత్రము)

dhrAvidAmnAya hrudhayam guruparvakramAgatham
ramyajAmAthrudhEvEna dharsitham krishNasUnunA

ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వక్రమాగతం |
రమ్యజామాతృ దేవేన దర్శితం కృష్ణసూనునా ||

తిరువాయ్ మొళి( నమ్మాళ్వార్ దివ్య హృదయం) కి ఆచార్య పరంపరగా వస్తున్న  దివ్యార్థములను కృపచేసిన  శ్రీకృష్ణసూనుల ( అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్) ను దర్శిస్తున్నాను.

  • నాయనారాచ్ఛాన్ పిళ్ళై ( సింహ మాసము, రోహిణీ నక్షత్రము)

sruthyarthasArajanakam smruthibAlamithram
padhmOllasadh bhagavadhangri purANabhandhum
gyAnAdhirAjam abhayapradharAja sUnum
asmath gurum paramakAruNikam namAmi

సృత్యర్తసారజనకం స్మృతిబాలమిత్రం
పద్మోల్లసద్ భగవదన్ఘ్రి పురాణబందుం |
ఙ్ఞానాదిరాజం అభయప్రదరాజ సూనుం
అస్మత్ గురుం పరమకారుణికం నమామి ||

సకలవేద సారమున  నిష్ణాతులైన, ‘స్మృతి’ కి కమల బాంధవుడి వలె , ఙ్ఞానములో చక్రవర్తి వలె, భగవానుని చరణ బంధువువలె, అభయప్రద రాజు(పెరియవాచ్ఛాన్ పిళ్ళై) కుమారులై, పరమకారుణికులైన    నాయనారాచ్ఛాన్ పిళ్ళై(బాలగురువు) కి నమస్కరిస్తున్నాను.

  • వాది కేసరి అళగియ మణవాళ జీయర్  (మిధున  మాసము – స్వాతి నక్షత్రము)

sundharajAmAthrumunE: prapadhyE charaNAmbhujam
samsArArNava sammagna janthu santhArapOthakam

సుందరజామాతృమునేః ప్రపద్యే చరణాంభుజం |
సంసారార్ణవ సమ్మగ్న జన్తు సంతార పోతకం ||

సంసారసాగరములో మునిగి పోతున్న జీవాత్మలకు కాపాడు నావవలె ఉన్న సుందరజామాతృ మునులకు /వాది కేసరి అళగియ మణవాళ జీయర్ చరణాంభుజములను రక్షకముగా శరణువేడుచున్నాను.

  • కూరకులోత్తమ దాసర్ (తులా మాసము  –  ఆర్ద్రా నక్షత్రము)

lOkAchArya krupApAthram kauNdinya kula bhUshaNam
samasthAthma guNAvAsam vandhE kUra kulOthamam

లోకాచార్య కృపాపాత్రం కౌణ్డిన్య కుల భూషణం |
సమస్తాత్మ గుణావాసం వందే కూర కులోత్తమం ||

పిళ్ళైలోకాచార్యుల కృపకు పాత్రులై కౌణ్డిన్య కుల భూషణుడై అనేక కల్యాణ గుణములకు ఆవాస్యయొగ్యుడైన కూరకులోత్తమ దాసర్  కు వందనం చేయుచున్నాను.

  • విళాన్ చోలై పిల్లై (తులా మాసము – ఉత్తరాభాద్ర)

thulAhirbuDhnya samBhootham srIlOkArya padhAshritham
sapthagAThA pravakthAram nArAyaNa maham BhajE

తులాహిర్బుధ్న్య సంభూతం శ్రీలోకార్య పదాశ్రితం |
సప్తగాథా ప్రవక్తారం నారాయణ మహం భజే ||

తులా మాసమున ఉత్తరాషాడ నక్షత్రమున అవతరించి,  శ్రీ పిళ్ళైలోకాచార్యుల శ్రీపాదపద్మములను ఆశ్రయించి, ‘సప్తగాథా'( శ్రీ వచనభూషణ సారము)  ప్రవర్తకులైన శ్రీ నారాయణ గురువులను/విళాన్ చోలై పిల్లైను భజిస్తున్నాను.

  • వేదాంతాచార్యులు (కన్యా మాసము – శ్రవణా నక్షత్రం )

srImAn vEnkatanAthArya: kavithArkkika kEsarI
vEdhAnthAchAryavaryO mE sannidhaththAm sadhA hrudhi

శ్రీమాన్ వేంకటనాథార్య కవితార్కిక కేసరీ |
వేదాంతాచార్య వర్యోమే సన్నిధత్తాం సదా హృది ||

ఎవరైతే కవులకి(వ్యతిరేఖులకు) ప్రతివాదులకు సింహము వంటి వారో,ఙ్ఞాన భక్తి , వైరాగ్య ములకు ఆవాసమైన శ్రీ వేంకటనాథార్యులు( వేదాంతదేశికులు) సదా నా హృదయములో నివసింతురు గాక.

  • తిరునారాయణపురత్తు ఆయ్ జనన్యాచార్యులు (తులా మాసము – పూర్వాషాడ నక్షత్రం)

AchArya hrudhayasyArththA: sakalA yEna dharsithA:
srIsAnudhAsam amalam dhEvarAjam thamAsrayE

ఆచార్య హృదయస్యార్త్తాః సకలా యేన దర్శితాః |
శ్రీశానుదాసమ్ అమలం దేవరాజం తమాశ్రయే ||

ఆచార్య హృదయమునకు దివ్యార్థములను అనుగ్రహించిన,  అమలులై(ఎలాంటి అఙ్ఞానములేక‌) ఉన్న శ్రీశానుదాసులు అను నామాంతరము కలిగిన దేవరాజాచార్యులను ఆశ్రయిస్తున్నాను.

 

మనవాళ మామునుల కాలము లోను ఆ తరువాతి కాలములో  ఎందరో గొప్ప ఆచార్యులు మన సాంప్రదాయంలో ప్రవర్తకులుగా వెలసి ఉండిరి. వారిలో కొందరు

ramya jAmAthru yOghIndhra pAdharEkhA mayam sadhA
thathA yaththAthma saththAdhim rAmAnuja munim bhajE

రమ్య జామాతృ యోగీంద్ర పాదరేఖా మయం సదా |
తదా యత్తాత్మ సత్తాదిం రామానుజ మునిం భజే ||

శ్రీమణవాళమామునులకు పాదరేఖ వలె ఉండి , తమ జీవనోపాధి, కార్యకలాపాలు సర్వం మామునులపై ఆధారపడి (మామునులకు దాసుని వలె) ఉన్న వానమామలై ప్రథమ రామానుజ జీయర్ ను భజిస్తున్నాను.

  • పతంగి పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్  (కార్తీక మాసము – పునర్వసూ నక్షత్రము)

ramya jAmAthru yOgIndhra pAdha sEvaika dhArakam
bhattanAtha munim vandhE vAthsalyAdhi guNArNavam

ரம்ய ஜாமாத்ரு யோகீந்த்ர பாத ஸேவைக தாரகம்
பட்டநாத முநிம் வந்தே வாத்ஸல்யாதி குணார்நவம்

రమ్యజామాతృ యోగీంద్ర పాదసేవైక ధారకం |
భట్టనాథ మునిం వందే వాత్సల్యాదిగుణార్ణావం ||

మామునుల శ్రీపాదపద్మములను తామ ఆత్మోజ్జీవనకై ఆశ్రయించి, వాత్సలము మొదలైన సమస్త కల్యాణ గుణములను కలిగిన భట్టనాథ మునికి వందనమును సమర్పిస్తున్నాను

  •  కోయిల్ కందాడై అణ్ణన్ (కన్యా మాసము – పూర్వాభాద్ర)

sakala vEdhAntha sArArtha pUrNAsayam
vipula vAdhUla gOthrOdhbhavAnAm varam
ruchira jAmAthru yOgIndhra pAdhAsrayam
varadha nArAyaNam madh gurum samsrayE

సకల వేదాంత సారార్థ పూర్ణాశయం
విపుల వాధూల గోత్రోద్భవానాం వరం |
రుచిర జామాతృ  యోగీంద్ర పాదాశ్రయం
వరద నారాయణం మద్ గురుం సంశ్రయే ||

వేదాంత విషయములన్నింటిని తమ హృదయమున నిలుపుకొని, వాధూల వంశ వారసుడై, మామునుల దివ్య చరణారవిందములను ఆశ్రయించిన వరదనారాయణ గురువు /  కోయిల్ కందాడై అణ్ణన్ ను ఆశ్రయిస్తున్నాను..

 

  • ప్రతివాది భయంకర అణ్ణన్ (కర్కాటక  మాసము – పుష్యమీ నక్షత్రం)

vEdhAntha dhEsika katAksha vivrudhdhabhOdham
kAnthOpayanthru yamina: karuNaika pAthram
vathsAnvavAyamanavadhya guNairupEtham
bhakthyA bhajAmi paravAthi bhayankarAryam

వేదాంత దేశిక కటాక్ష వివృద్ద భోదం
కాంతోపయన్తృ యమినః కరుణైక పాత్రం |
వత్సాన్వవాయమనవద్య గుణైరుపేతం
భక్త్యా భజామి పరవాది భయంకరార్యం ||

వేదాంతదేశికుల అనుగ్రహము వలన వికసించిన ఙ్ఞానము కల, మామునుల కృపకు పాత్రులై ,  కల్యాణ గుణపూర్ణుడై, శ్రీవత్స వంశములో జన్మించిన  ప్రతివాది భయంకర అణ్ణన్ ను భజిస్తున్నాను.

  • ఎఱుంబియప్పా(తులా మాసము  – రేవతి)

saumya jAmAthru yOgIndhra sharanAmbhuja shatpadham
dhEvarAja gurum vandhE dhivya jnAna pradham shubham

సౌమ్య జామాతృ  యోగీంద్ర చరణామ్భుజ షట్పదం |
దేవరాజ గురుం వందే దివ్య ఙ్ఞాన ప్రదం శుభం ||

మామునుల దివ్య పాద పద్మముల యందు తుమ్మెదవలె, ఎవరైతే పవిత్ర స్వభావముచే మరియు  తమ దివ్య ఙ్ఞానముచే దీవిస్తున్నారో ఆ దేవరాజగురు /  ఎఱుంబియప్పా కు వందనం చేయుచున్నాను.

  •  అప్పిళ్ళై

kAnthOpayanthru yOgIndhra charaNAmbhuja shatpadham
vathsAnvayabhavam vandhE praNathArrhthiharam gurum

కాంతో పయంతృ యోగీంద్ర  చరణాంబుజ షట్పదం |
వత్సా న్వయభవం వందే ప్రణతార్తి హరం గురుం ||

మామునుల చరణాంబుజముల యందు తుమ్మెద వలె శ్రీవత్స వంశములో అవతరించిన ప్రణతార్తి హరుల / అప్పిళ్ళై కు వందనము చేయు చున్నాను.

 

  •  అప్పిళార్

kAnthOpayanthru yOgIndhra sarva kainkaryadhUrvaham
thadhEka dhaivatham saumyam rAmAnuja gurum bhajE

కాంతో పయంతృ యోగీంద్ర సర్వ కైంకర్య ధూర్వహం |
తదేక దైవతం సౌమ్యం రామానుజ గురుం భజే ||

మామునులనే పరమ దైవంగా భావించి సకల కైంకర్యములను చేసిన రామానుజ గురువు / అప్పిళార్ భజిస్తున్నాను.

 

  • పిళ్ళై లోకమ్ జీయర్ (మేష  మాసము – శ్రవణా నక్షత్రం)

srIsatAri gurOrdhivya srIpAdhAbhja madhuvratham
srImathyathIndhrapravaNam srI lOkArya munim bhajE

శ్రీశఠారి గురోర్దివ్య శ్రీపాదాభ్జ మధువ్రతం |
శ్రీమత్యతీంద్రప్రవణం శ్రీ లోకార్య మునిం భజే ||

శఠగోపగురు  దివ్య పాద పద్మముల యందు తుమ్మెదవలె , ‘యతీంద్రప్రవణం'(మామునుల గురించిన విస్తార చరిత్ర గ్రంథము) గ్రంథ రచయిత అయిన  పిళ్ళై లోకమ్ జీయర్ ను భజిస్తున్నాను.

  • తిరుమళిశై అణ్ణావప్పన్గార్ (మిధున  మాసము – ధనిష్ఠా నక్షత్రం )

srImadh vAdhula narasimha gurOsthanUjam
srImath thadhIya padhapangaja brungarAjam
srIrangarAja varadhArya krupA aththa bhAshyam
sEvE sadhA raguvarAryam udhAracharyam

శ్రీమత్ వాధుల నరసింహ గురోస్తనూజం
శ్రీమత్ తదీయ పదపంకజ భృంగరాజం |
శ్రీరంగరాజ వరదార్య కృపాత్త భాష్యం
సేవే సదా రఘువరార్యం ఉదారచర్యం ||

వాధూల నరసింహాచార్యుల కుమారులై, వారి చరణారవిందముల యందే తుమ్మెద వలె సంచరించు, ‘శ్రీభాష్యము’ను  శ్రీరంగరాజాచార్యులు మరియు వరదాచార్యుల నుండి అధికరించి ఉదాత్త గుణము కల రఘువరార్యుల /తిరుమళిశై అణ్ణావప్పన్గార్ ను   సదా సేవిస్తున్నాను.

  • అప్పన్ తిరువేంకట రామానుజ ఎమ్బార్ జీయర్

srIvAdhUla ramApravALa ruchira sraksainya nAthAmchaja
srIkurvIndhram mahArya labhdha nijasath saththam chruthA bhIshtatham
srIrAmAnuja mukya dhEsikalasath kainkarya samsthApakam
srImathvEnkatalakshmaNArya yaminam thamsathguNam bhAvayE

శ్రీవాధూల రమాప్రవాళ రుచిర స్రక్సైన్య నాథాం చ జ
శ్రీకుర్వీంద్రం మహార్య లబ్ద నిజసత్ సత్తమ్ శ్రుతా భీష్టతం |
శ్రీరామానుజ ముఖ్య దేశిక లసత్ కైంకర్య సంస్థాపకం
శ్రీమత్ వేంకటలక్ష్మణార్య యమినం తం సద్గుణం భావయే ||

శ్రీవాధూల ఆచార్యుల  కుల మాలలో ముత్యమువలె , విష్వక్సేనుల అంశగా అవతరించిన (ఆచార్య రత్నమాలలోని   మణి మకుటమగు విష్వక్సేనుల వలె ఇతను కూడ అని వేరొక రకంగా అర్థం చేసు కోవచ్చు)ఆచార్యోత్తములై, వివిధ కైంకర్యములను( తిరుమంజన కట్టియములను, నిత్య/లీలా విభూతి విషయాలను చిత్ర తిరువాదిరై(చైత్ర ఆరుద్ర- శ్రీరామానుజుల వార్షిక తిరునక్షత్రం) నాడు ప్రకటించిన) మన ఆచార్య పరంపరలో ముఖ్యులైన  అప్పన్ తిరువేంకట రామానుజ ఎమ్బార్ జీయర్ ను భజిస్తున్నాను.

అడియేన్ నల్లా శశిధర రామానుజదాస:

ఆధారములు:

Sources: 6000 padi guru paramparA prabhAvam, yathIndhra pravaNa prabhAvam, periya thirumudi adaivu and http://acharyas.koyil.org/index.php/thanians/

మొదట పుత్తూర్ శ్రీ.ఉ.వే.కృష్ణస్వామి అయ్యంగార్ గారికి ఆదరముతో కృతఙ్ఞతను సమర్పించు కొంటున్నాను.ఆరాయురప్పడి, పెరియ తిరుముడి అడైవు, ఆచార్య వైభవము లో  ఉన్న  అన్నీ తనియనులకు  అర్థమును అనుగ్రయించిన వారు.

1 thought on “తనియన్లు”

Leave a Comment