ఆళ్వార్లు

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్  |
భక్తాంఘ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం  ||

“నేను భూదత్త ఆళ్వార్, పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమళిశై ఆళ్వార్, కులశేఖర ఆళ్వార్, తిరుప్పాణాళ్వార్, తొణ్డరడిప్పొడి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, శ్రీరామానుజులు, మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్ల పాద పద్మములను ఎల్లప్పుడూ సేవించుచుందును”.

Alwars-10

పది మంది ఆళ్వార్లు

madhuravaki-andal-emperumanar

మధురకవి ఆళ్వార్, ఆండాళ్, ఎంబెరుమానార్లు

ఈ దివ్య శ్లోకము శ్రీ పరాశర భట్టర్లచే, తాను తిరుక్కోట్టియూర్లో వున్నపుడు రచించబదినది. ఆకాలంలో ఆ ప్రాంతమును పాలించుచున్న రాజు “వీర సుందర బ్రహ్మ రాయన్” వలను తనకు కలుగుచున్న అశాంతి కారణంగా భట్టర్ శ్రీరంగమును వీడవలసి వచ్చిందిది. అప్పుడు భరింపరాని శ్రీరంగనాథుని వియోగమును అనుభవించుచూ, తనకు తాను భగవత్/ భాగవత అనుభవములో మునిగి తేలుటకు ఈ శ్లోకమును, తిరుప్పావై తనియన్లను రచించెను.

ఈ శ్లోకములో, పదిమంది ఆళ్వార్లతో పాటుగా (పొయిగై ఆళ్వార్, భూదత్త ఆళ్వార్, పేయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖర ఆళ్వార్, పెరియాళ్వార్, తొణ్డరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పాణాళ్వార్, తిరుమంగై ఆళ్వార్), “శ్రీ” అన్న పదము చేత ఆండాళ్ ను, “మిశ్ర” (బాగా నేర్చుకున్న/ గౌరవించదగిన) అన్న పదము చేత మధురకవి ఆళ్వార్లను, “యతీంద్ర” అన్న పదము చేత శ్రీరామానుజులను ప్రశంసించిరి.

  1. పోయిగై ఆళ్వార్
  2. భూదత్తాళ్వార్
  3. పేయాళ్వార్
  4. తిరుమళిశై ఆళ్వార్
  5. మధురకవి ఆళ్వార్
  6. నమ్మాళ్వార్
  7. కులశేఖర ఆళ్వార్
  8. పెరియాళ్వార్
  9. ఆండాళ్
  10. తొండరడిప్పొడి ఆళ్వార్
  11. తిరుప్పాణ్ ఆళ్వార్
  12. తిరుమంగై ఆళ్వార్

హిందీలో :  https://acharyas.koyil.org/index.php/azhwars/

అడియేన్ వకుళాభరన రామానుజ దాసన్

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org