శ్రీ పెరుమ్బుదూర్ ఆది యతిరాజ జీయర్

శ్రీ

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవర మునయే నమః

శ్రీ వానాచల మహామునయే  నమః

తిరు నక్షత్రము : ఆశ్వయుజ మాసము, పుష్యమి.

అవతారస్థలము :  తెలియదు

ఆచార్యులు : మణవాళ మాముణులు

పరమపదము చేరిన ప్రదేశము : శ్రీ పెరుంబుదూర్ 

ఆది యతిరాజ జీయర్ గారే యతిరాజ జీయర్ ముఠము, శ్రీ పెరుంబుదూర్ (ఎమ్పెరుమానార్ల అవతార స్థలము ) స్థాపించారు.

srIperumbUthUr yathirAja jIyar mutt
యతిరాజ జీయర్ ముఠము, శ్రీపెరుమ్బూతూర్

యతిరాజ జీయర్ ముఠమునకు ఒక ప్రత్యేకత కలదు. అది ఏమనగా, కోవెలలో కైంకర్యము చేయుటకు మరియు కైంకర్య నిర్వహణ చూచుటకు గాను ఆళ్వార్ / ఆచార్యులు స్థాపించిన కొద్ది మఠములలో ఇది ఒకటి. ఎమ్పెరుమాన్ మరియు ఎమ్పెరుమానారు సంవత్సరము మొత్తము ఇక్కడికి వేంచేస్తారు.

AdhiyathirAjajIyar
యతిరాజ జీయర్ ముఠము, శ్రీపెరుమ్బూతూర్

వీరు మాముణులు, పొన్నడిక్కల్ జీయర్  (వానమామలై), కోయిల్ కందాడై అన్నన్, దొడ్డయాచార్యులు మొదలైన వారితో  సత్సంబంధాలు కలిగివున్నారని వీరి తనియన్ ద్వారా తెలుస్తున్నది. వీరందరి శ్రీ చరణాల వద్ద శాస్త్ర అర్థాలను నేర్చుకున్నారు.

వీరి వాళి తిరు నామము లందు శ్రీ మద్రామానుజుల మీద వీరికి గల అప్పారమైన భక్తి తెలుస్తుంది. వీరి వాళి తిరునామము మాముణుల వాళి తిరునామము పోలి వుంటుంది.

పరమ స్వామి (తిరుమాలిరుంచోలై కళ్ అళగర్) ఆదేశముల మేరకు, మాముణులు వారి ఒక్క ఆంతరంగిక కైంకర్యపరుల లో ఒక్కరైన యతిరాజ జీయర్ ని తిరుమాలిరుంచోలై కోవెలను పునరుద్దరించి, సంస్కరించుటకు పంపారని యతీంద్ర ప్రవణ ప్రభావములో చెప్పారు. కొందరు యతిరాజ జీయర్ ని శ్రీ పెరుంబుదూర్ ఆది యతిరాజ జీయర్గా  పరిగణిస్తారు, మరి కొందరు ఆ యతిరాజ జీయర్ వేరని, వీరె తదుపరి కాలములో తిరుమాలిరుంచోలై జీయర్ ముఠమునకు మొదటి జీయర్ అయ్యరాని భావిస్తారు.పెద్దల వద్ద దీని గురించి మరింత తెలుసుకొవచ్చును.

వీరిని గురించి మనకు ఇంతవరకే తెలుస్తున్నది. భగవత్, భాగవత, ఆచార్య కైంకర్య ప్రాప్తి కోసము మనము వారి శ్రీ చరణాలను ఆశ్రయించి తరించుదాము.

తిరుమాలిరుంచోలై జీయర్ తనియన్:

శ్రీమత్ రామానుజాంగ్రి ప్రణవ వరమునే: పాదుకమ్ జాతభ్రుంగమ్
శ్రీమత్ వానాద్రి రామానుజ గణగురు సత్వైభవ శోత్రదీక్షమ్
వాదూల శ్రీనివాసార్య చరణశరణమ్ తట్ కృపా లబ్ద భాష్యమ్
వందే ప్రాఙ్ఞమ్ యతీంద్రమ్ వరవరదగురో;ప్రాప్త భక్తామృతార్థమ్

అడియేన్ చూడామణి రామానుజదాసి

మూలము: http://acharyas.koyil.org/index.php/2013/10/27/sriperumbuthur-adhi-yathiraja-jiyar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/2012/08/17/introduction-contd-english/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

3 thoughts on “శ్రీ పెరుమ్బుదూర్ ఆది యతిరాజ జీయర్”

Comments are closed.