అప్పాచ్చియారణ్ణా

జై శ్రీ మన్నారాయణ

శ్రీమతే రామానుజాయనమ:

శ్రీమద్వరవర మునయే నమ:

శ్రీవానాచలమహామునయే నమ:

appachiyaranna
అప్పాచ్చియారణ్ణా

తిరునక్షత్రము~:   శ్రావణ మాసము హస్తము

అవతారస్థలము~: శ్రీరంగము

ఆచార్యులు~: పొన్నడిక్కాల్ జీయర్

శిష్యులు~:  అణ్ణావిలప్పన్ (వీరి కుమారులు)

వాదూల గోత్రోద్భువులైన ముదలియాన్డాన్ వంశములో తొమ్మిదవతరమునకు చెందినవారు ఆన్డాన్ కుటుంబీకులు.వీరు శిర్రణ్ణార్రెరి సుపుత్రులుగా శ్రీరంగములో అవతరించారు.వీరి నాన్న గారు వీరిని వరద రాజులగా నామకరణం చేసారు.వీరి  తల్లి గారు ఆయ్చియార్ తిరుమన్జనమప్పా కుమార్తె. వీరి పరమాచార్యులైన మణవాళ మామునులు ప్రేమతో వీరికి అప్పచియారణ్ణా అని పేరు పెట్టారు.”నమ్ అప్పాచియాణ్ణవో”(వీరేనా మన అప్పాచియాణ్ణ ?) అని సంభోదన చేసారు.    ). వీరు పొన్నడికాల్ జీయర్ ప్రియ శిష్యులు . ఎలాగైతే పొన్నడికాల్ జీయర్ ను మణవాళ మామునుల యొక్క పాద పద్మములు గా భావించదరో , వీరిని పొన్నడికాల్ జీయర్ యొక్క పాద పద్మములు గా భావిస్తారు.

వీరి మాతామహులైన తిరుమన్జనమప్పా శ్రీరంగము పెరియ కోయిల్ లో  నిస్వార్థ కైంకర్య పరులు మరియు మామునుల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండేవారు .మామునుల గొప్పతనము ఎరిగిన వారై , వారు స్నానమాడు సమయమున వారి వెనుక వీరు కూడా వెళ్ళేవారు.  .మామునులు దిగిన గట్టుకు పై గట్టులో దిగి .మామునులను తాకి పవిత్రమై వస్తున్న ప్రవాహములో తాను స్నానము చేసి నిశ్చలమైన జ్ఞానము తో ప్రసాదింపబడ్డారు. తరువాతికాలములో మామునుల మఠములో చేరి వారి కైంకర్యములో తరించారు.

ఒక సారి మామునులు కావేరిలో స్నానం చేయడంకోసం బయలుదేరారు.సరిగ్గా అప్పుడే వాన మొదలైంది. ఆ దగ్గర లో వున్న ఇంటి చూలు కింద నిలబడ్డారు.  ఇంటి గృహిణి బయటకు వచ్చి మామునులను చూసి వారు కూర్చోవటానికి ఆసనము ఏర్పాటు చేసి వారి పాదుకలను శిరస్సుపై వుంచుకొని ఆనందించి తరవాత తన కొంగుతో పాదుకలను తుడిచి  ఎంతో భక్తి తో కళ్ళక్కద్దుకొంది. ఆ స్పర్శ వల్ల జ్ఞాన ప్రాసాదిత్ అయి మణవాళ మామునులను తన ఆచార్యులుగా స్వీకరించవలెనని ఆశించింది  మామునులు  ఆమెను చూసి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు.తిరుమంజనమప్పా కుమార్తెనని,కన్దాడై సిర్రన్నార్( ముదలియాణ్దాన్ వంశం) ఇళ్లాలినని తనను ఆచ్చి అంటారని చెప్పింది.వర్షం ఆగిన తరువాత అక్కడి నుండి మామునులు కావేరి కి బయలుదేరుతారు. ఆమెకు ఆరోజే  మామునుల అనుగ్రహము  లభించింది.

    కొంత కాలము తరువాత తన మనసులోని మాటను తండ్రి గారికి వివరిస్తుంది .మామునుల దగ్గర పంచసంస్కారము చేయుటకు  అతి  రహస్యముగా ఏర్పాటు చేస్తారు (స్వయమాచార్యపురుష వంశములో కోడలు కావడము వలన బహిరంగంగా చేసుకునుటకు జంకిన కారణమున ). మామునులు ఆచ్చికి గల  సంబంధములు చూసి  పంచసంస్కారము చేయుటకు ముందుగా సంకోచిస్తారు , కాని ఆచ్చి భక్తి ని చూసి, సంస్కరనముల ను గావిస్తారు. 

ఎమ్పెరుమాన్ యొక్క దివ్యమైన అనుగ్రహము చేత కందాడై వంశము లో ని ఆచార్యులు అందరు మామునిగళ్ శరణు పొందుతారు.  కోయిల్ కందాడై అన్నన్ స్వామికి ఒక అద్భుతమైన కల వచ్చిందిపెరుమాళ్ళే ఆ కల లో పొన్నడిక్కాల్ జీయర్ పురుషకారముతో మామునుల శ్రీపాదములను ఆశ్రయించమని ఆదేశించారు. తన తో పాటు కందాడై వంశము లో ని ఆచార్యులు అందరిని తీసుకుని వచ్చి మామునిగళ్ ఆశ్రయం పొందుతారు .

కోయిల్ కందాడై అన్నన్ పరివారమునకు పంచ సంస్కారము చేసిన తరవాత మామునులు తనకు మరియు పొన్నడిక్కాల్ జీయర్కు  గల అద్వితీయ సంబంధమును గురించి వివరించారు. “వారు శుభశ్రేయస్కులు మరియు తనకు ఊపిరి వంటివారని.తనకు గల వైభవములన్ని వారికి లభించాలని చెప్పారు.ముదలియాన్డాన్ వంశస్తులు తనకు శిష్యులైనట్లు గానే ఆ వంశము లో కొందరైనా  వారికి శిష్యులు గా ఉండాలని అన్నారు.కోయిల్ కందాడై అన్నన్ మామునుల మనస్సును అర్థము  చేసుకుని “మీరు ముందు గానే పొన్నడికాల్ జీయర్ స్వామి యొక్క పాద పద్మములు మాకు చూపించినట్లైతే , మేము వారి శ్రీ పాదములను ఆశ్రయించి ఉండే వారము”అని చెప్పారు. దానికి మామునులు “మేము చేయ గలిగే పనిని , ఎలా వదులు కో గలము ? ” అని బదులు ఇచ్చారు. కోయిల్ అణ్ణన్ చుట్టూ తన బంధువుల వైపు చూస్తారు , అప్పాచ్చియారణ్ణ లేచి  “మన స్వామి  వానమామలై రామానుజ జీయర్ యొక్క శ్రీ పాదముల శరణము తనకు ఇవ్వ వలెనని ” విన్నవిస్తారు. జీయర్ సంతోషించి , “నమ్ అప్పాచియాణ్ణావో” ( వీరేనా మన అప్పాచియాణ్ణ ?) అని సంభోదన చేస్తారు.తాను ఆసనము నుండి లేచి పొన్నడిక్కాల్ జీయరును కూర్చో మన్నారు. శంఖచక్రములనిచ్చి అప్పాచ్చియారణ్ణాకు పంచసంస్కారము చేయమన్నారు.
పొన్నడిక్కాల్ జీయరు వినమ్రత తో ముందు వెనకాడుతారు , అప్పుడు మామునులు వారు పంచ సంస్కారములు ఖచ్చితంగా చేయవలెనని , అది తనకు ప్రీతి కరమైనదని చెప్తారు.అప్పుడు అంగీకరించి అప్పాచ్చియారణ్ణాకు పంచసంస్కారము చేసి ,శిష్యులు గా స్వీకరిస్తారు . అప్పటినుంచి, అప్పాచ్చియారణ్ణ శ్రీరంగములోనే ఉండి నిరంతరాయంగా మామునుల ను మరియు పొన్నడిక్కాల్ జీయరును  కైంకర్యము చేస్తూ ఉండిపోయారు.

mamuni-ponnadikkaljiyar-appachiyaranna
శ్రీ రంగం- మామునులు , వానమామలై – పొన్నడి కాల్ జీయర్ , అప్పాచ్చియారణ్ణా

ఒకసారి మామునులు తిరుమల యాత్ర  వారి శిష్యులు అందరి తో యాత్ర చేసారు.  దారిలో కాంచిపురములో ఆగి దేవపెరుమాళ్ళను సేవించుకున్నారు.అవి వైశాఖమాసములో గరుడోశ్చవము జరుగుతున్న రోజులు.గరుడ వాహనము మీద ఉన్న ఎమ్పెరుమాన్ ను మంగళ శాసనము చేసారు.

varadhan-garudavahanam-mamunigaL
గరుడ వాహనము పై దేవ పెరుమాళ్ ,మామునులు

కాంచి పురములోని శ్రీ వైష్ణవులు మామునిగళ్ దగ్గర చేరి , వారిని కీర్తిస్తారు. మామునిగళ్ వారికి శ్రీ వైష్ణవ సిద్ధాంతము గురించి , మరియు సంప్రదాయము లో కృత్యాకృత్య ములను చెప్పి , దివ్య ప్రబంధము లో ప్రావిణ్యులవమని చెప్పారు .దానికి వారు ఆనందముగా అంగీకరించి తమకు మార్గ నిర్దేశము చేయటానికి ఒక ఆచార్యులను అనిగ్రహించమని కోరారు.మామునిగళ్ పొన్నడి కాల్ జీయర్ స్వామిని  అప్పాచ్చియారణ్ణాను పిలవమని కోరగా, వారు కబురు చేస్తారు. అప్పుడు  ఆ  శ్రీ వైష్ణవుల తో  అప్పాచ్చియారణ్ణ ను తనని గా భావించమని చెప్పారు. అప్పచ్చియారణ్ణాను పిలిచిమీరు మొదలియాన్డాన్ వంశస్తులు.మీరు మా నిర్వాహకులు గా, మీపూర్వీకులైన మొదలియాన్డాన్ ,కందాడై తోళప్పన్ లను సంతృప్తి పరుచునట్లుగా దేవపెరుమాళ్ళను మంగళా  శాసనము చేస్తూ ,ఇక్కడి శ్రీ వైష్ణవులకు మార్గనిర్దేశము చేస్తూ కంచిలో వుండిపొమన్నారు. వారు కూడా ఆచార్యుల ఆఙ్ఞను శిరసావహించి కంచిలో వుండటానికి అంగీకరించారు.అయితే అప్పుడు మాత్రము మామునులతో తిరుమల ఇత్యాది దివ్యదేశ యాత్రకు వెళ్ళి ఆఖరికి శ్రీరంగము చేరుకున్నారు.

అప్పుడు మామునులు అప్పాచ్చియారణ్ణాను పిలిచి కర్తవ్యమును గుర్తు చేసారు.అప్పాచ్చియారణ్ణా శ్రీరంగములో మామునుల శ్రీ పాద పద్మముల యందు గల గోష్ఠిని విడిచి వెళ్ళలేని తన అశక్తతను తెలియజేసారు. అప్పాచ్చియారణ్ణా యొక్క భావోద్వేగములను అర్థము చేసుకొని , వారిని తన పెరుమాళ్ సన్నిధి కి తీసుకువస్తారు. తన రామానుజమనే చెమ్బును పొన్నడిక్కాల్ జీయరుకిచ్చారు . వారు ఆచార్య ప్రసాదముగా దానిని నిత్యము తన బుట్ట లో పెట్టుకొని , భక్తి తో పూజించేవారు . దానిని తెప్పించి, అప్పాచ్చియారణ్ణా కు అప్ప గిస్తూ “దీనిపైన చెక్కబడిన శంఖచాక్రదులు అరిగిపోయినవి , దీనిని కరిగించి ఆలోహముతో తన విగ్రహములు రెండు తయారుచేసి ఒకటి మీ ఆచార్యులైన పొన్నడిక్కాల్ జీయరునకిచ్చి  ఒకటి నీ తిరువారాధనము కొరకు పెట్టుకునుము” అని అన్నారు. దానితో పాటు తన తిరువారాధనములోని మరొక పవిత్రమైన విగ్రహము ఇచ్చారు.ఆ విగ్రహము పేరు “ఎన్నై తీమనమ్ కెడుత్తార్”(నామనసును సుధ్ధి చేసినవారు) ఇది తిరువాయి మొళిలో2.8లో నమ్మాళ్వార్  పెట్టిన పేరు.

ennaitheemanamkeduthar
ఎన్నై తీమనమ్ కెడుత్తార్ – మొదలి ఆండాన్ స్వామి తిరుమాలిగై -శింగ పెరుమాళ్ కోయిల్

ఈ విగ్రహము ఎమ్పెరుమానార్ల శిష్యులైన ఆట్కొండవల్లి జీయరు మరియు వారి ప్రియులైన  కందాడై ఆండాన్ (మొదలి ఆండాన్ యొక్క  సుపుత్రులు ) ఆరాదించేవారు.మామునులు వారి తో “మీరునూ కందాడై ఆండాన్ వంశీయులు , ఈ ఎమ్పెరుమాన్లను పూజించుటకు తగ్గ వారు , మీ తిరువారధనములో వీరిని వేంచేప చేసి ,తిరువారధనము గావించండి. “అని చెప్పారు. వారి పై గల మిక్కిలి ప్రీతి విశేషము చేత , వారు దేవపెరుమాళ్ళ యొక్క  అంశము  అనే రహస్యమును  వెల్లడి చేసారు. మామునుల ఆజ్ఞ మేరకు కంచిలో స్థిర నివాసము ఏర్పరచుకుని , అక్కడి శ్రీ వైష్ణవుల కు మార్గ దర్శకులు అయ్యారు.

ఈ విధముగా మనము అప్పాచ్చియారణ్ణా యొక్క గొప్ప జీవితం లోని కొన్ని మచ్చు తునకలను చూసాము  వీరు మామునుల కు మరియు వారి ఆచార్యులైన పొన్నడిక్కాల్ జీయరు కు అత్యంత ప్రీతి పాత్రులు . మనకు కూడా వారి వలె ఆచార్య అభిమానము సిధ్ధించ వలెనని వారి శ్రీ పాదముల దగ్గర ప్రార్థన చేద్దాం .

అప్పాచ్చియారణ్ణా తనియన్:

శ్రీమతే వానమహాశైలరామానుజ మునిప్రియామ్

వాదూల వరదాచార్యమ్ వందే వాత్సల్య సాగరమ్

source

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

3 thoughts on “అప్పాచ్చియారణ్ణా”

Comments are closed.