శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
కోయిల్ కన్దాడై అణ్ణన్ – శ్రీరంగం అణ్ణన్ తిరుమాళిగై
తిరునక్షత్రము: (పురట్టాసి) కన్యా పూర్వాషాడ
అవతార స్థలము: శ్రీరంగము
ఆచార్యులు: మణవాళ మాముణులు
శిష్యులు: కన్దాడై నాయన్ (వీరి కుమారులు), కందాడై రామానుజ అయ్యంగార్ మొదలగు వారు
రచనలు; శ్రీ పరాంకుశ పంచ వింశతి, వరవరముని అష్టకమ్, మామునుల కణ్ణినుణ్ శిరుతామ్బు వ్యాఖ్యానము.
యతిరాజ పాదుకగా పిలువబడే ముదలియాణ్డాన్ వంశములో దేవరాజ తోళప్పర్ కుమారులుగా అవతరించారు. కోయిల్ కందాడై అప్పన్ వీరికి తమ్ముడుగారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వరద నారాయణన్. అష్ట దిగ్గజములుగా ప్రఖ్యాతి గాంచిన మణవాళ మామునుల ప్రధాన శిష్యులలో వీరు ఒకరు.
కోయిల్ అణ్ణన్ శ్రీ రంగము తమ శిష్యులతో ఉంటున్న కాలములో ఒకసారి అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ (మాముణుల పూర్వాశ్రమనామము) శ్రీరంగమునకు వేంచేసారు. శ్రీరంగనాదులు, వారి కైంకర్యపరులు కూడా సాదరముగా ఆహ్వానించారు. శ్రీ రంగనాధులు వారికి సన్యాసాశ్రమముతో అళగియ మణవాళ మామునులన్నపేరును కూడా అనుగ్రహించారు. శ్రీ రంగనాధులకు అళగియ మణవాళులని మరొక పేరు. అందువలననే పెరుమాళ్ళు తన ప్రియ శిష్యునికి తనపెరునే అనుగ్రహించారు. ఇకపైన ఎమ్పెరుమానార్ నివశించిన పల్లవరాయ మఠములోనే ఉండమాన్నరు.
మాముణులు తమ శిష్యులైన పొన్నడిక్కాల్ జీయర్ను పిలిచి కాలక్షేపములకు అనుకూలముగా పెద్ద కూటము కట్టమన్నారు. అలా కట్టేసమయములో అష్ఠాదశ రహస్యములను అనుగ్రహించిన పిళ్ళై లోకాచార్యుల గృహము నుండి మట్టిని తెచ్చి నిర్మించారు. ఆకాలములో పాశ్చాత్యుల దండ యాత్రల వలన శ్రీరంగము, శ్రీ వైష్ణవ సంప్రదాయము అనేక ఆటుపోటులకు లోనయింది. మాముణులు అక్కడ వేంచేసి సంప్రదాయములో పూర్వాచార్యులు చేసిన కృషిని కొనసాగించారు. అది తెలిసినవారు అసంఖ్యాకముగా వచ్చి మాముణుల శిష్యులుగా చేరారు.
కందాడై సిఱ్ఱణ్ణర్ భార్య అయిన ఆయ్చియార్ కు తన తండ్రిగారి ఆచార్యులైన మామునుల మీద అపారమైన భక్తి శ్రద్దలుండేవి. అందువలన ఆమె తమ తల్లిగారి ఇంటి వద్ద కొంత కాలము వున్నప్పుడు మాముణులను ఆశ్రయించి పంచసంస్కారము చేయవలసినదిగా ప్రార్ఠించగా వారు అనుగ్రహించారు. మామగారు స్వయమాచార్య పురుషులై నందున ఈ విషయమును రహస్యముగా వుంచింది. భర్తకు కూడా తెలియదు. ఒకసారి కోయిల్ కందాడై అణ్ణన్గారి తండ్రిగారి తిరువధ్యానము వచ్చింది. ఆనాడు ఆచ్చియారు వంటచేసారు. కార్యక్రమము ముగుసి అందరూ కూటములో కూర్చున్నారు.
అప్పుడు కోయిల్ కందాడై అణ్ణన్ శ్రీ వైష్ణవులు కొందరు పెరియ జీయరు మఠము నుండి వస్తూవుండగా చూసారు. వారిని వివరములడగగా తన పేరు శింగర్రయ్యర్ అని తమ రాజైన వళ్ళువ రాజేంద్రుడు మాములను ఆశ్రయించటము కోసము వచ్చారని చెప్పారు. దానికి అణ్ణన్ శ్రీ రంగములో ఎందరో ఆచార్యులుండగా వారిని కాదని బయటినుంచి వచ్చిన మాముణులు ఎందుకు ఆశ్రయిస్తున్నారని అడిగారు. అది పెరుమాళ్ళ అజ్ఞ అని చెప్పరు వారు. శ్రీ రంగనాధులే మాముణుల శిష్యులయ్యారని అది గొప్ప రహస్యమని చెప్పారు శింగరయ్యరు, అణ్ణన్ వారి మాటలకు ఆశ్చర్యమొంది వారిని ఆరాత్రి అక్కడే వుండ వలసిందిగా కోరారు. వారు కూడా అంగీకరించారు. రాత్రి ప్రసాదము తీసుకొన్న తరువాత అణ్ణన్ సోదరులు బయట పడుకున్నారు. లోపల ఉన్న ఆచ్చియార్ పడుకునే ముందు “జీయర్ తిరువడిగళే శరణమ్, పిళ్ళై తిరువడిగళే శరణమ్, వాళి ఉలగాసిరియన్” అని మాముణులు, తిరువాయ్మొళి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యులను నమస్కరించటము విన్నారు. అణ్ణన్ తమ్ములలో ఒకరు లోపలికి వెళ్ళి విషయము తెలుసుకోవాలని లేచారు కాని అణ్ణన్, అప్పన్ వారిని ఆపి ఉదయమే చూద్దామన్నారు.
అణ్ణన్ గారికి ఆరాత్రి మాముణుల గురించిన తలపులతొ నిద్ర కూడా రాలేదు. సింగరైయ్యర్ దగ్గరకు వెళ్ళి మాట కలిపారు. అప్పుడు సింగరయ్యర్ ఒక సంఘటన గురించి చెప్పారు. నేను ప్రతిదినము కూరగాయలు తీసుకువచ్చి మఠములొను, ఆచార్య తిరుమాళిగలలోను ఇస్తూ ఉండేవాడిని ఒకరోజు ఒక శ్రీ వైష్ణవులు పెద్ద జీయరు మఠములొ ఇవ్వమని చెప్పారు. నేను పెద్ద జీయరు మఠమునకు కూరగాయలు తీసుకువెళ్ళాను. వారు ఎక్కడ పండిచారు? ఎవరు నీళ్ళు పెట్టారు? అని అనేక ప్రశ్నలు వేసారు. పవిత్రమైన ప్రదేశములో తమ శిష్యులచే పండింపబడిందని విన్నవించాను. వారు సంతోషించి కూరగాయలను అంగీకరించారు. ‘శ్రీ రంగనాధుని సేవించుకొని వెళ్ళ’ మని చెప్పారు. నేను అలాగే చేసాను. అక్కడి అర్చకులు ‘ఈ సారి కూరగాయలు ఎవరికి ఇచ్చార’ ని అడిగారు. పెద్ద జీయరు మఠములో అని చెప్పగావిని సంతోషించారు. అంతేకాక ‘నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. త్వరలో నీకు ఆచార్య సంబంధము దొరక బోతుందని తీర్ఠము, శఠారి, మాల, అభయహస్తము ఇచ్చి దీవించారు. నాకు పరమానందము కలిగింది. మఠమునకు వెళ్ళి జీయరుతొ జరిగినది చెప్పి బయలుదేరుతుండగా వారి శిష్యులు ప్రసాదము ఇచ్చారు. ఆ ప్రసాదము స్వేకరించగానే నేను పునీతుడనయ్యాను. ఆరాత్రి కలలొ శ్రీరంగనాధులు కనపడిఆది శేషులను చూపి అళగియమణవాళ జీయరు ఆది శేషులు వేరు కాదు. వారి శిష్యులుకమ్ము. ‘అని ఆనతినిచ్చారు. అప్పటినుండి మామునుల శిశ్యుడను కావటము కోసము ఎదురు చూస్తున్నాను. అని ముగించారు. అంతా విన్న అణ్ణన్ దీర్గ ఆలోచనలో పడి అలాగే నిద్రపోయారు.
అణ్ణన్ గారికి నిద్రలో ఒక కల వచ్చింది. ఆకలలో శ్రీ వైష్ణవులు ఒకరు చేతిలో కొరడాతో డాబా మీది నుంచి దిగి వచ్చి అణ్ణనును కొడుతున్నారు.వీరు తిరగబడగల శక్తి కలిగి వుండి కూడా ఊరుకున్నారు. తను చేసిన తప్పుకు దండన విధిస్తున్నారని భావించారు. కాసేపటికి ఆకొరడా విరిగిపోయింది. ఆ శ్రీ వైష్ణవుడు చేతితో అణ్ణాను లాగుతున్నాడు. అణ్ణా ఆయన ఏమి చెపితె అది చేస్తున్నారు. ఇద్దరూ పైకివళ్ళారు. అక్కడ ఒక సన్యాసి ఉన్నారు. ఆయన కూడా కొరడా తీసుకొని కొట్టారు. కొద్ది సేపటికి ఆ కొరడా విరిగిపోయింది. అప్పుడు ఆ శ్రీ వైష్ణవుడు సన్యాసిని చూసి ‘ఇతడు చిన్నవాడు. అతనికి తను చేస్తున్నదేమిటో తెలుసుకునే శక్తి లేదు. మన్నించి కొట్టడము ఆపి దీవించండి’ అని చెప్పాడు. దానికి ఆయన ‘ఉత్తమ నంబి, నువ్వు ఇద్దరూ తప్పు చేసారు’ అన్నారు. వెంటనే అణ్ణన్ ‘నేను నిజంగానే అళగియ మణవాళ జీయరు గొప్పతనమును తెలుసుకోలేక పోయాను నన్ను క్షమించండి’ అన్నారు. అడి విన్న సన్యాసి శాంతించి ప్రేమతో’ మేము భాష్యకారులము (శ్రీ రామానుజులు) ఈ శ్రీ వైష్ణవులు ముదలియాణ్డాన్. (మీ పూర్వీకులు). నిన్ను నువ్వు సరిదిద్దుకో. ముదలియాణ్డాన్తో సంబంధము కాపాడుకో. మేము ఆది శేషులము. మళ్ళీ మణవాళ మాముణులుగా అవతరించాము. నువ్వు నీ సంబందీకులు మణవాళ మాముణుల శిష్యులై ఉజ్జీవించండి’ అన్నారు. అణ్ణన్ కల తేలిపోయింది, మేలుకున్నారు. ఆశ్చర్యము, భయము కలుగగా తన అన్నగారికి కల మొత్తము వివరించారు. ఆచ్చియారుకు కూడ కలగురించి చెప్పారు. ఆమె మాముణుల గొప్పతనమును వివరించారు. ఆనందముతో సిన్గరైయ్యర్ దగ్గరకు వెళ్ళి జరిగిన దంతా తెలియజేసి అక్కడనుండి కావేరికి వెళ్ళి నిత్య అనుష్టానము చేసుకున్నారు.
అణ్ణా ఇంటికి తిరిగి రాగానే ఉత్తమ నమ్బిని ఇతర కందాడై వంశస్తులను పిలిచి (ముదలియాణ్డాన్ వంశస్తులు) జరిగిన విషయము వివరించగా ఆశ్చర్యముగా అందరూ అలాంటి కలగన్నామని చెప్పారు. అందరూ కలసి లక్ష్మణాచార్యుల మనవడైన ఎమ్బా వద్దకు వళ్ళారు. ఎంబా విషయము వినగానే కోపముతో ఎగిరి పడ్డారు. మనమే స్వయమాచార్య పురుషులై వుండి మరొక ఈయర్ను ఆశ్రయించటమా? అన్నారు. మరి కొందరు కూడా అలాగే అన్నారు. అణ్ణన్ ఇతర కన్దాడై కుటుంబములోని ఆచార్య పురుషులతో మాముణులను ఆశ్రయించటము కోసము జీయర్ మఠమునకు బయలుదేరారు. అణ్ణన్ తన శిష్యులైన తిరువాళి యాళ్వార్, సుద్ద సత్త్వమ్ అణ్ణన్ గారిని తీసుకొని వెళ్ళారు. సుద్ద సత్త్వమ్ అణ్ణన్ సందర్భము వచ్చినప్పుడల్లా కోయిల్ అణ్ణన్ గుంచి మాముణులతో విన్నవిస్తూ ఉండేవారు. వీరు వెళ్ళే సమయానికి మాముణులు తిరుమలై ఆళ్వార్ మణ్డపములో ఉపన్యసిస్తున్నారు. అణ్ణన్ మాముణుల ఉపన్యాసమునకు అడ్డురావటము ఇష్టము లేక ఒక శ్రీ వైష్ణవులను పిలిచి సమయము వచ్చినప్పుడు తమ గురించి తెలియజేయమని విన్నవించారు. ఆ శ్రీ వైష్ణవులు తప్పుగా అర్థము చేసుకొని కోయిల్ అణ్ణన్ సకుటుంబముగా వాదు కోసము వచ్చారని తెలియజేసారు. మాముణులు ఆ సమయములో ఎటువంటి వాదు చేయటం ఇష్టము లేక వెంటనే ఉపన్యాసము ఆపి మఠము వెనుక భాగానికి వెళ్ళారు. ఇంతలో కోయిల్ అణ్ణన్ వానమామలై జీయర్ను ఆశ్రయించారు. అదే సమయములో ఆయ్చియార్, శ్రీ వైష్ణవులు అణ్ణన్ ఉద్దేశ్యమును మాముణులకు వివరించారు. మాముణులు ఆదరముతో కోయిల్ అణ్ణన్ను ఆహ్వానించారు. తిరుప్పల్లాణ్డు, పొలిగ పొలిగ పదిగమ్ (తిరువాయ్మొళి) గురించి వివరించారు. తరువాత అణ్ణన్ పొన్నడిక్కాల్ జీయర్ పురుషకారముతో మామునుల అంతరంగ స్థలములోనికి పొన్నడిక్కాల్ జీయర్ ద్వారా అణ్ణన్ను పిలిపించుకొని ‘తమరు వాదూల గోత్రస్తులు (ముదలియాణ్డాన్). స్వయమాచార్య పురుషులు. మా శిష్యులు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు’ అని అడిగారు. అణ్ణన్ తనకు వచ్చిన కలగురించి చెప్పి, గతములో తనవలన జరిగిన తప్పులను మన్నించి అనుగ్రహించమని ప్రార్థించారు. మీలాగ మరికొందరు కూడా పరమాత్మచే కలలో ఆదేశింపబడిన వారున్నారు. అందరికీ ఎళ్ళుండి పంచ సంస్కారము చేస్తాము అని చెప్పగా అణ్ణన్ మూడు దినముల తరవాత అణ్ణన్ సకుటుంబముగా పెద్ద జీయర్ మఠమునకు వెళ్ళి (తాపమ్ – భుజములపై శన్క/చక్రముల ముద్ర, పుండ్ర – ఊర్ద్వపుండ్రము, నామ – దాస్య నామము నిచ్చుట (నమె), మంత్రము – రహస్య త్రయ మన్త్రములు, యాగము – తిరువారాదన క్రమము) అనుగ్రహించ వలసినదిగా కోరారు. మాముణులు వానమామలై జీయర్ (పొన్నడిక్కాల్) ను పిలిచి తగిన ఏర్పాట్లను చేయమని ఆనతిచ్చారు. అంతే కాక అక్కడ కూడివున్న సభనుద్దేశించి ‘పొన్నడిక్కల్ జీయర్ నా ఊపిరి వంటివారు. నాకు జరిగిన మంచి వారికీ కలగాలి’ అన్నారు.
మాముణులు మరియు కోయిల్ అణ్ణన్ – అణ్ణన్ తిరుమాళిగై, శ్రీ రంగము
కోయిల్ అణ్ణన్ మాముణుల మనస్సు గ్రహించి తాము పొన్నడిక్కల్ జీయర్ శిష్యులవ్వటము తమకు ఆనందమే అని తెలియజేసారు.
ఆయ్చియార్ కుమారులైన అప్పాచియారణ్ణా తమను కూడా అనుగ్రహించమని కోరారు. మాముణులు సంతోషించి “నమ్ అప్పాచియారణ్ణావో?” అన్నారు. మాముణులు తమ ఆసనము నుండి లేచి పొన్నడిక్కాల్ జీయర్ను తమ సింహాసనము మీద కూర్చో పెట్టారు. అప్పాచియారణ్ణా, వారి సోదరులు దాశరధి అప్పై కూడా పొన్నడిక్కాల్ జీయర్ శిష్యులైనారు.పెరియ పెరుమాళ్ ప్రసాదమురాగా మాముణులతో సహా అందరు కోవలకు వెళ్ళి పెరుమాళ్ళకు మంగళాసాశనము చేసి సేవించు కొని వచ్చి తదీయారాదనము స్వీకరించారు.
ఒక రోజు మాముణులు సుధ్ద సట్వమ్ అణ్ణన్ను కోయిల్ అణ్ణణ్తో కలిసి కైంకర్యము నిర్వహించమని ఆదేశించారు. ఆణ్డ పెరుమాళ్ళను (కొమాణ్డూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ వంశములోని వారు) అణ్ణన్ శిశ్యులై అణ్ణన్ను సేవించుకొమ్మని, అణ్ణన్ సత్సమ్ప్రదాయము కొరకు చేస్తున్న కృషిలో సహకరించమని ఆనతిచ్చారు. కోయిల్ అణ్ణన్ సమీప బందువైన ఎరుమ్బి అప్పా, కోయిల్ అణ్ణన్ పురుషకారముతో మాముణులను ఆశ్రయించారు తరువాతి కాలములో వారికి ప్రియ శిష్యులైనారు.
కన్డాఢై నాయన్ (కందాఢై అణ్ణన్ కుమారులు) చిన్న వయసులోనే అపారమైన ఙ్ఞానమును కలవారు. మాముణులు దివ్య ప్రభన్ద పాశురములు సేవిస్తున్నప్పుఢు చక్కగా వివరించేవారు. మాముణులు ఏంతో సంతోషించి వారిని ప్రోత్సహించి భవిష్యత్తులో సత్సమ్ప్రదాయమును ప్రవర్తించాలని మంగళాశాసనము చేసారు. కన్దాడై నాయన్ ‘పెరియ తిరుముఢి అఢైవు’ అనే గ్రంథమును రచించారు.
ప్రతివాది భయంకరమ్ అణ్ణన్ కూఢ కోయిల్ అణ్ణన్ పురుషకారముతో మాముణులను ఆశ్రయించి శిశ్యులైనారు.
కోయిల్ అణ్ణన్ను భగవత్ విషయమును కన్డాఢై అప్పన్, తిరుక్కోపురట్టు నాయనార్ భట్టర్, సుద్దసత్వమ్ అణ్ణన్, ఆణ్డ పెరుమాళ్ నాయనార్ మరియు అయ్యనప్పా లకు వివరించమని మామునులు ఆదేశించారు. కోయిల్ అణ్ణన్ను “భగవత్ సంభంద ఆచార్యర్” అనే బిరుదు నిచ్చారు.
ఒకసారి మాముణులు కందాడై నాయన్ (అణ్ణన్ కుమారులు), జీయర్ నాయనార్ (పూర్వాశ్రమములో మాముణుల మనుమడు) భగవత్ విషయమ్ గురించి చర్చించు కోవడము చూసి ఈడు వ్యాఖ్యానమునకు సంసృతములో అరుమ్పదమ్ (పరిపూర్ణ వివరణ) రచించమని ఆదేశించారు.
మాముణులు శ్రీ రంగనాధుల ముందు, భగవత్ విషయ కాలక్షేపము చేసిన తరవాత శ్రీ రంగనాధులు స్వయముగా “శ్రీ శైలేశ దయాపాత్రమ్” తనియన్ చెప్పి మాముణులను తమ ఆచార్యులుగా స్వీకరించారు. అప్పడి నుండి అన్ని దివ్య దేశములలో ప్రతి దినము ప్రారంభములోను చివరన తనియన్ తప్పక చెప్పుకోవాలని ఆదేశించారు. అదే సమయములో కోయిల్ అణ్ణన్ తిరుమాళిగైలో ఆయన భార్య ఇతర బందువులు శ్రీ వైష్ణవులు మాముణుల ప్రాశస్త్యము గురించి చెప్పుకుంటుండగా, ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఒక చిట్టి ఇచ్చి అదృశ్యమయ్యాడు. ఆ చిటిలో కూడా “శ్రీశైలేశ దయా పాత్రమ్” తనియన్ వుండటము చూసి అదంతా ‘ఎమ్పెరుమాన్ ‘ మహత్యముగా గుర్తించి ఆనందించారు.
ఒక సారి మామునులు కొయిల్ అణ్ణన్గారిని ‘తిరువేంకఠనాధునికి మన్గళాశాసనము చేయడానికి వెళ్ళగలరా?’ అని అడిగారు. అప్పిళ్ళై కొయిల్ అణ్ణన్ను “కావేరి కఢవాడ కందాడై అణ్ణన్ అన్రో” అనేవారు మాముణులు.
శ్రీ రంగనాధులే తిరుమలై వేంచేసి వుండి నిత్య సూరులచే పూజింపబడుటున్నాడని చెప్పగా, అణ్ణన్ తిరుమల యాత్రకు బయలుదేరారు. పెరియ పెరుమాళ్ సన్నిదికి వెళ్ళి వారి అనుమతిని తీసుకొని ఉత్తమ నంబి మరియు శ్రీ వైష్ణవులనేకులతో సన్నద్దమయ్యారు. పల్లకిలో వెళ్ళమనగా వద్దని కాలినడకనే ప్రయాణ మయ్యారు. తిరుమలలో అణ్ణన్ను అనంతాళ్వాన్, పెరియ కేళ్వి జీయర్, ఆచార్య పురుషులు, అనేక శ్రీవైష్ణవులు ఎదురేగి ఆహ్వానించారు.
అణ్ణన్ రతోత్సవములో పాల్గొని శ్రీ వేంకటేశునికి మంగళాశాసనము చేసారు. బదరికాశ్రమములో వేంచేసి కైంకర్యము చేస్తున్న అయోధ్య రామానుజ ఐయ్యంగారును అక్కడ కలుసుకున్నారు. అయోధ్య రామానుజ ఐయ్యంగారు మాముణుల శిష్యులవ్వాలనుకున్నారు. అనంతాళ్వాన్ మాత్రము, మాముణులకు ఎంతో ఆప్తులైన అణ్ణన్ వద్ద శిష్యులవమని సూచించారు. అనంతాళ్వాన్ సూచన మేరకు అయోద్య రామానుజ ఐయ్యన్గారు అణ్ణన్ వడ్డ పంచ సంస్కారము పొందారు. శ్రీ వేంకటేశుడు అణ్ణన్తో ఐయ్యంగారు సంబందమును శాశ్వతముగా నిలిచి వుండే విదముగా “కన్డాఢై రామానుజ ఐయ్యంగారు” ప్రకఠించారు. వీరు కూడా అక్కడే ఉండి అనేక కైంకర్యాలు చేస్తూ వచ్చారు.
అణ్ణన్ శ్రీ రంగమునకు తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకొని శ్రీ వేంకటేశుని సన్నిధికి వెళ్ళగా స్వామి తన శేష వస్త్రమును ఇచ్చి ‘కందాఢై రామానుజ ఐయ్యంగారు సమర్పించిన పల్లకీలో వెళ్ళమని చెప్పారు. అణ్ణన్ ఆనందముగా స్వీకరించి శ్రీ రంగమునకు బయలు దేరారు. దారిలో దివ్య దేశములలో మంగళాశాసనములు చేస్తూ, ఎరుంబి అప్పాను వారి పెద్దలను కాంచీపురములో కలుసుకున్నారు.అణ్ణన్ కాంచీపురములో సాలైక్కిణరు నుంఢి తీర్థము తెచ్చి దేవ పెరుమాళ్ళుకు సమర్పించారు. ఈ కైంకర్యమును కొనసాగించమని అప్పాచియారణ్ణాను ఆఙ్ఞ్నాపించారు.
అణ్ణన్ కాంచీపురము నుండి శ్రీ పెరుంబుదూరుకి వెళ్ళి ఆ దగ్గరలోని దివ్య దేశములను సేవించు కోవాలనికుని, దేవ పెరుమాళ్ అనుమతి తీసుకోవడానికి వెళ్ళారు. అప్పుడు నైవేద్యానంతర తిరువారాదనము జరుగుటున్నాది. దేవ పెరుమాళ్ వస్త్రము, మాల, చందనము ఇచ్చి ‘ఇవి పెరియ జీయరుకు తీసుకు వెళ్ళండి’ అన్నారు. అవి అందుకున్న అణ్ణన్ బయటకు వచ్చి ‘కచ్చిక్కు వాయ్తాన్ మణ్డపమ్’ లో కూర్చుని మాముణుల గొప్పదనమును వర్ణిస్తున్నారు. అక్కడ కూడిన వారు అణ్ణన్ను ‘జీయర్ అణ్ణన్’ అని ప్రశంశించారు. ఇంతలో మాముణుల నుండి పిలుపు రాగా అణ్ణన్ శ్రీ పెరుంబుదూరు వైపు తిరిగి నమస్కారము చెసి శ్రీ రంగమునకు బయలుదేరారు.
కోయిల్ అణ్ణన్ రాక గురించి తెలుసుకున్న మాముణులు వారి ఇంటికి వచ్చారు. తిరుమాలై అన్డ పెరుమాళ్ భట్టర్ కైంకర్యపరులతో వచ్చి పెద్ద జీయరునకు వేంకటేశుని మాలను ప్రసాదమును సమర్పించారు. అణ్ణనుతో వచ్చిన శ్రీ వైష్ణవులు కోయిల్ అణ్ణనును దేవ పెరుమాళ్ “అణ్ణన్ జీయర్” అని ప్రస్తుతించిన విషయము తెలియజేసారు. విన్న మాముణులు ఆనందించారు. ప్రతివాది భయంకరమ్ అణ్ణన్ కోయిల్ అణ్ణన్ ను శ్రియఃపతి తో పోలిక చేసి పొగిడారు. పెరుమాళ్ళ, అమ్మవారి లాగా మాముణులు అణ్ణన్ పరస్పరము ఔన్నత్యాన్ని పెంపొందించు కుంటారని అన్నారు.
పెద్ద జీయర్ ఆఖరి దశలో కష్టపడి ఆచార్య హృదయమునకు వ్యాఖ్యానమును రాస్తుండగా చూసి అణ్ణన్ ఎందుకు అంత శ్రమ పడుతున్నారని నొచ్చుకున్నారు. దానికి మాముణులు ఎవరి కోసము రాస్తున్నాను. మన పిల్లల కోసమే కదా (ముండు తరాలు) అన్నారు.
కొయిల్ అణ్ణన్ కు మహమ్మదీయుల దండ యాత్రలకు ముందు ఉండిన ప్రాభవమును పునరుద్దరించడానికి ఎంతగానో కృషి చేసారు.
ఎఱుంబి అప్పా మాముణుల గురించి రాసిన పూర్వ దినచర్యాలో నాలుగవ శ్లోకములో ఈ విధముగా రాసారు.
పార్స్వతః పాణిపద్మాభ్యామ్ పరిగ్రుహ్య భవత్ ప్రియౌ
విన్యస్యన్తమ్ శనైర్ అన్గ్రీ మ్రుదులౌ మేదినీతలే
తమరి మృదువైన కరచరణాలుగా తమరి ప్రియ శిష్యులైన కొయిల్ అణ్ణన్, కొయిల్ అప్పన్ ఇరువైపులా వుండి ఈ భూమి మీడ నడిపిస్తున్నారు.
ఇరు వైపులా తమ ప్రియ శిష్యులిరువురూ (కోయిల్ అన్నన్, కోయిల్ అప్పన్) తో మాముణులు – కాంచిపురము అప్పన్ స్వామి తిరుమాలిగై
తిరుమళిశై అణ్ణావప్పంగార్ తమ ‘దినచర్యా వ్యాక్యానము’లో ‘ప్రియ శిష్యులంటే కొయిల్ అణ్ణన్, కొయిల్ అప్పన్’ అని వర్ణించారు. మాముణులు ‘పాన్చరాత్ర తత్వసార సంహిత’ లో చెప్పిన్నట్లుగా ఎల్ల వేళలా త్రిదణ్ఢమును దరించేవారు కాదు. దానికి అణ్ణావప్పంగార్ ఈ క్రింది విధముగా కారణములను చెప్పారు.
- ఒక సన్న్యాసి త్రిదణ్ఢమును తీసుకు వెళ్ళకూడని సందర్భమని భావిస్తే తీసుకు వెళ్ళనవసరము లేదు.
- ఒక సన్న్యాసి నిరంతరము భగవద్యానములోనే కాలము గడిపేటప్పుడు, శాస్త్రమును, భగవత్ విషయమును ఆచార్యుల దగ్గర బాగుగా తెలుసుకున్నవారైనప్పుడు, ఇంద్రియ నిగ్రహము కలిగివుండి నప్పుడు త్రిదణ్డమును చేత పట్టకున్నా దోషము లేదు.
- పెరుమాళ్ళకు సాష్ఠాంగ నమస్కారము ఆచరించే సమయములో త్రిదణ్డము ఆఠంకముగా వుంటుంది.
మాముణులు స్వయముగా కొయిల్ అణ్ణను గొప్పదనమును ఒక పాశురములో చెప్పారు.
ఎక్కుణత్తోర్ ఎక్కులత్తోర్ ఎవ్వియల్వోర్ ఆయిడినుమ్ నమ్మిరైవరావరే
మిక్కపుఘళ్ కారార్ పొళిల్ కోయిల్ కన్దాఢై అణ్ణనెన్నుమ్ పేరాళనై అఢైన్త పేర్
ఎవరైతే కొయిల్ అణ్ణన్ ను ఆశ్రయిస్తారో వారు ఏ కులము, గుణము, ఏకోవలో వారైనా నాకు శిరోదార్యమే.
మాముణుల ప్రియ శిశ్యులైన కొయిల్ కన్డాఢై అణ్ణన్ గురించి తెలుసుకున్నాము. వారి మంగళా శాసనములు మనకు సదా వుండాలని ప్రార్తించుదాము.
ఇక కోయిల్ కన్డాఢై అణ్ణన్ తనియన్ తెలుసుకుందాము.
సకల వేదాన్త సారార్త పూర్ణాశయమ్
విపుల వాదూల గోత్రోద్భవానామ్ వరమ్
రుచిర జామాతృ యోగీన్ద్ర పాదాశ్రయమ్
వరద నారాయణమ్ మద్గురుమ్ సమాశ్రయే
అడియేన్ చూడామణి రామానుజ దాసి.
ఆధారము: యతీంద్ర ప్రవణ ప్రభావము, మదురై శ్రీ ఊ. వే. రంగరాజన్ స్వామి ‘మన్ను పుగళ్ మణవాళ మామునివన్ ‘, వరవరముని దినచర్య, పెరియ తిరుముడి అడైవు.
మూలము: http://acharyas.koyil.org/index.php/2013/10/16/koil-kandhadai-annan-english/
పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/2012/08/17/introduction-contd-english/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org
3 thoughts on “కోయిల్ కందాడై అణ్ణన్”
Comments are closed.