ఉయ్యక్కొండార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత సంచికలో మనం శ్రీమన్ నాథమునుల గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు గురుపరంపరలో తరువాతి ఆచార్యుల గురించి తెలుసుకుందాము.

ఉయ్యక్కొండార్ – ఆళ్వార్తిరునగరి

తిరునక్షత్రం : కృత్తిక నక్షత్రం, చైత్ర మాసం.
అవతారస్థలం : తిరువెళ్ళఱై
ఆచార్యులు : నాథమునులు
శిష్యులు : మణక్కాల్ నంబి, తిరువల్లిక్కేణి పాణ్ పెరుమాళ్ అరైయర్, చేట్టలూర్ చెండలంగార దాసర్, శ్రీ పుణ్డరీక దాసర్, గోమఠమ్ తిరువిణ్ణకరప్పన్, ఉలగపెరుమాళ్ నంగై.

పుణ్డరీకాక్షర్ తిరువెళ్ళఱై (శ్వేత గిరి) అనే దివ్య దేశంలో అవతరించిరి, ఆ దివ్య దేశ పెరుమాళ్ళ పేరునే వీరికి పెట్టిరి. వీరి మరో పేరు పద్మాక్షర్ కాని తుదకు ఉయ్యక్కొణ్డార్ అనే నామంతో ప్రసిద్ది కెక్కారు.

వీరు కురుగై కావలప్పన్ నాథమునుల శిష్య బృందంలో ముఖ్యులు. నాథమునులు నమ్మాళ్వార్ల దివ్య అనుగ్రహం పొందిన తరువాత తిరిగి కాట్టుమన్నార్ కోవెలకి వచ్చి అక్కడ నుండి మన సాంప్రదాయన్ని విస్తరించారు. అష్టాంగ యోగాన్ని కురుగై కావలప్పన్ కి ఉపదేశించారు – దీని ద్వార ఎవరైన భగవత్ గుణములను నిరంతరంగా ఎటువంటి శరీర సంబంధము లేకుండా అనుభవించగలరు. అప్పుడు నాథమునులు ఉయ్యక్కొణ్డార్లని మీకు అష్ఠాంగ యోగాన్ని ఉపదేశిస్తాము అని అడుగగా – ఉయ్యక్కొణ్డార్ ఇలా చెప్పారు “పినమ్ కిడక్క మనమ్ పునరలామో” అర్థము – లోకంలో ఎందరో సంసారులు అఙ్జానము వలన బాధపడుతుండగా, మనము ఎలా ఒంటరిగా భగవత్ అనుభవించగలము. అది విని నాథమునులు వారి మానవత్వకు మిక్కిలి సంతోషము చెంది వారిని అభినందించారు. నాథమునులు ఉయ్యక్కొండార్, కురుగై కావలప్పన్లకు అష్ఠాంగ యోగము, ఆళ్వార్ల ప్రబంధముల అర్థములను ఉపదేశించి వాటిని త్వరలో అవతరించబోయే ఈశ్వరమునుల కుమారులకు (నాథమునుల మనమడు) ఉపదేశించమని ఆజ్ఞాపించిరి.

నాథమునుల తరువాత , ఉయ్యక్కొండార్లు దర్శన ప్రవర్తకాచార్యులుగా (సంప్రదాయ నిర్వహణ/విస్తరణ భాద్యతలు) ఉండి తన శిష్యపరివారమునకు వైష్ణవ సాంప్రదాయ విద్యను ఉపదేశించారు. వీరు పరమపదమునకు చేరే సమయంలో మణక్కాల్ నంబిని తదుపరి సాంప్రదాయ బాధ్యతలు ఎవరు వహిస్తారు అడుగగా, ఉయ్యక్కొండార్లు వారిని సంప్రదాయ బాధ్యతలు స్వీకరించ వలసినదిగా ఆఙ్జాపించి వారి పిదప యమునైతురైవర్ ని తదుపరి తరమునకు తయారు చేయవలసినదిగా చెప్పిరి.

ఉయ్యక్కొండార్ల తనియన్:

నమః పంకజ నేత్రాయ నాథః శ్రీ పాద పంకజే !
న్యస్త సర్వ భరాయ అస్మత్ కుల నాథయ ధీమతే !!

అడియేన్ రఘువంశీ రామానుజ దాసన్

మూలము: https://acharyas.koyil.org/index.php/2012/08/24/uyyakkondar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org