ఎరుంబి అప్పా

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
eRumbiappA-kAnchi
                               ఎఱుంబి అప్పా – కాంచీపురము అప్పన్ స్వామి తిరుమాళిగై
తిరు నక్షత్రము: ఐప్పసి, రేవతి
అవతార స్తలము: ఎఱుంబి
శిశ్యులు: పెరియవప్పా (వారి యొక్క కుమారులు), సేనాపతి ఆళ్వాన్
శ్రీసూక్తులు: పూర్వ దినచర్యై, ఉత్తర దినచర్యై, వరవరముని శతకము, విలక్షణ మోక్ష అధికారి
నిర్ణయము, చివరి పాశురమైన ఉపదేశ రత్తిన మాలై (మన్నుయిర్గాళ్ …)

ఎఱుంబి అప్పా మనవాళ మాముణు శిష్యులైన  అష్ట దిగ్గజముఅలో ఒకరు. (అష్ట దిగ్గజములు మన సంప్రదాయమును కాపాడిన వారు.) వీరి అసలు పీరు దేవరాజన్.

వీరు తమ గ్రామములో నివశిస్తూ ధర్మాచరణ చేన్నప్పుడు  మణవాళ మాముణుగురించి విన్నారు. మనవాళ మాముణుల కలామును మన పూర్వాచార్యులు ‘నల్లడిక్కాలమ్’ (స్వర్ణ యుగము) గా భావించారు. ఈ కలాములో నిరాటంక; ముగ భగవద్గుణానుభవము పొందగలిగారు. ఉదహారణకు శ్రీ మద్రామానుజుల కాలములో శైవరాజు కారణముగా శ్రీ రంగము నుండి తిరు నరాయాణ పురము వెళ్ళ వలసివచ్చింది. అలాగే భట్టరు వారి కాలంలో రాజు దురాగతాల వలన తిరుకోట్టియూరు వెళ్ళ వలసిన నిర్భందము ఏర్పడింది.  పిళ్ళై లోకాచర్యుల కాలములో కూడా మహమ్మదీయుల దండ యాత్రల వలన దక్షిణముగా వెళ్ళారు. కాని మణవాళ మాముణులు శ్రీ రంగము వచ్చిన తరవాత దేవాలయ నిర్వహణను మెరుగు పరచి ఆచార్య పురుష సంప్రదాయాన్ని పునరుద్దరించారు. చెదరి పోయిన గ్రందాలను సేకరించారు. నిరంతరము ఆళ్వారుల గ్రంథముల కాలక్షేపములో కాలమును గడిపేవారు.

మణవాళ మాముణుల గురించి విన్న ఎఱుంబి అప్ప వారిని సేవించుకోవాలని శ్రీ రంగములోని మఠమునకు వచ్చారు. అప్పుడు వారు తిరువాయ్మొళిలోని మొదటి పాశురము ఉయర్వర ఉయర్నలమ్’ వ్యాక్యానము చేస్తున్నారు. వేదము, వేదాంతము, పరత్వము గురుంచి మాముణులు చేస్తున్న వ్యాక్యానము మనసుకు హత్తుకుపోయింది. తరవాత మనవాళ మాముణులు వీరిని తదీయారాదనకు ఆహ్వానించారు. కాని ఎఱుంబి అప్పా దానికి సమ్మతించలేదు. సన్యాసి మఠములోగాని, వారి ఉచ్చిష్ఠము గాని, వారిచే పంపిచ బడిన ఆహారముగాని స్వీకరించరాదనే సామాన్య ధర్మమును వీరు పాటించారు. ఒకవేళ అలా స్వీకరిస్తే వారు ‘చాందరాయణ వ్రతమును ఆచరించ వలసి వుంటుంది. వీరు విశేష ధర్మమును తెలుసుకొలేక పొయరు. అదే మంటే తిరుమాలైలోని 41వ పాశురములో ‘తరువరేల్ పునిదమన్రే’ (మహానుభావులైన శ్రీ వైష్ణవులు దయతో ఇచ్చిన ప్రసాదము పరమపవిత్రమైనది. దానిని భక్తితో స్వీకరించాలి.)

eRumbiappA's srIrAma-parivAr

శ్రీ రామ పరివారము – అప్పా యొక్క తిరువారాదన పెరుమాళ్ (కాంచీపురములోని అప్పన్ స్వామి తిరుమాళిగైలో చూడవచ్చు)

వారు తిరిగి స్వగ్రామమునకు చేరుకొని, ఉదయము అనుష్టానమును పూర్తిచేసుకొని, వారు కోవిల్ ఆళ్వార్ (తిరువారాదనము చేయు గది) తెరుచుటకు ప్రయత్నించగా వారి యొక్క తిరువారాదన పెరుమాళ్ చక్రవర్తి తిరుమగన్ (శ్రీ రాముడు) తలుపును తెరుచుకోకుండా చేసిరి. భాదతో వారు అహారమును తీసుకోకుండా నిద్రకి ఉపక్రమించిరి. వారి యొక్క స్వప్నములో, మాముణులు మరెవరో కాదు. ఆదిశేషుడు. రామావతారములో లక్షణుడు. దుఃఖితులైన సంసారులను ఉద్ధరించుటకు ఈ యుగములో మామునులుగా అవతరించారు. వారినాశ్రయించి తత్వ ఙ్ఞానమును పొందండి’ అని శ్రీ రాముడు చెప్పగా ఎఱుంబి అప్పా పరుగు పరుగున శ్రీ రంగము చేరుకొని కోయిల్ కందాడై అన్నన్ పురుషకారముతో మాముణుల శ్రీ చరణాలను అశ్రయించారు తరువాతి కాలములో మాముణుల ముఖ్య శిష్యులైన అష్ట దిగ్గజములలో ఒకరైనారు.

ఎఱుంబి అప్పా మాముణులతో ఉన్న కాలములో వారి దిన చర్యను పరిశీలిస్తూ శ్లోకములుగా చెప్పేవారు. తరువాతి కాలములో అవి ‘దినచర్య’ గా ప్రసిద్దిగాంచిది.

తమ గ్రామమునకు వచ్చి నప్పటికి ఎఱుంబి అప్పా మాముణుల గురించే చింతిస్తూ ఉండటము వలన వారి నిత్యానుష్ఠానమును ‘పూర్వ దినచర్య’, ‘ఉత్తర దినచర్య’ గా కూర్చి ఆచార్యులకు ఒక శ్రీ వైష్ణవులతో పంపించారు. అది చూసిన ఆచార్యులు ఎంతో పొంగిపోయి వెంటనే ఎఱుంబి అప్పాను రమ్మని ఆహ్వానము పంపించారు  వీరు కూడా ఆచార్యుల ఆఙ్ఞను శిరసావహించి వచ్చి మాముణులు నంపెరుమాళ్ సమక్షంలో చేస్తున్న భగవద్విషయ కాలక్షేపమును విని తరించి గ్రామమునకు తిరిగి వెళ్ళారు.

కొంత కాలనికి మామునుల పరమపద వార్త తెలుసుకొని అపారమైన వియోగబాధను పొంది వారి శ్రీ సూక్తులను తలచుకుంటూ తమను కూడా వీలైనంత త్వరలో పరమాత్మ సన్నిధికి చేర్చుకొమ్మని ప్రార్థించారు.

ఎఱుంబి అప్పా  తన శిష్యులైన సేనాపతి ఆళ్వాన్ మొదలైనవారితో సంభాషించిన సంప్రదాయ విషయములను  “విలక్షణ మోక్ష అదికారినిర్ణయము అనె గ్రంధముగా సంపుటీకరించారు.

ఆళ్వార్, ఆచార్యుల శ్రీ సూక్తులకు సంభందించిన అనేక అపార్థాలను నివృత్తి చేసుకోవటానికి ఎంతగానో ఉపకరిస్తుంది. సంసారములో వైరాగ్యము పెంచుకొని పూర్వాచార్యుల ఙ్ఞాన, అనుష్ఠానముల యందు అభిమానమును పెంచుకొని వాటిని ఆచరించాల్సిన అవసరాన్ని ఈ గ్రంధము తెలియచేస్తుంది. పూర్వ, ఉత్తర దినచర్యలను అనుసంధానము చేయనివారు నిత్య ప్రసాదము స్వీకరించరాదని మన పూర్వాచార్యులు నిర్ణయించారు. అటువంటి ఎఱుంబి అప్పా దివ్య చరణములను నిత్యము స్మరించుకుందాము.

ఎఱుంబి అప్పా తనియన్

సౌమ్య జామాతృ యోగీన్ద్ర చరణామ్భుజ షట్పదమ్

దేవరాజ గురుమ్ వన్దే దివ్య జ్నాన ప్రదమ్ శుభమ్

అడియేన్ చుడామణి రామానుజదాసి

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/2012/08/17/introduction-contd-english/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org