తొండరడిప్పొడి ఆళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

తొండరడిప్పొడి ఆళ్వార్
తొండరడిప్పొడి ఆళ్వార్

తిరునక్షత్రము : మార్ఘశీర్ష మాసము, జ్యేష్టా నక్షత్రం

అవతార స్థలము : తిరుమణ్డంగుడి

ఆచార్యులు : విష్వక్సేనులు

శ్రీ సూక్తములు : తిరుమాలై, తిరుపల్లియెళుచి

పరమపదించిన స్థలము : శ్రీ రంగం

తిరుపల్లియెళుచ్చి వ్యాఖ్యనమున నంజీయర్ ఆళ్వార్లు సంసారము నందు ఉన్నారని అనగా “అనాది మాయయా సుప్తః” అజ్ఞానముచే అనాది కాలము నుంచి వారు నిద్రించి ఉన్నారని ఎమ్పెరుమాన్లు వారిని (జ్ఞానమును ప్రసాదించ ) మేల్కొల్పెనని పేర్కొనెను. కాని పెరియ పెరుమాళ్ ఆ తరువాత యొగ నిద్రలో ఉండగా ఆళ్వార్ వారిని మేల్కొలిపి పెరుమాల్ కైంకర్యమును ప్రసాదించమని వేడ్కొనెను.

ఆళ్వార్ల పాసురములతో ఆళ్వార్ యొక్క వైభవమును తిరుపల్లియెళుచ్చి వ్యాఖ్యనమున పెరియ వాచాన్ పిల్లైవారు చాల అందముగ ప్రకాశింపజేసెను. ఆళ్వార్ పెరుమాళ్ ప్రసాదించిన జ్ఞానముచే వారి స్వరూపమును తెలుసుకున్నవారై పెరియ పెరుమాళ్ వద్దకు వెళ్ళగ; ఆళ్వార్లను ఆహ్వానించకుండ, వారి బాగొగులు అడగకుండ పెరియ పెరుమాళ్ కనులు మూసి పడుకొని ఉండటం చూసెను. ఈ మాత్రముచే పెరియ పెరుమాళ్ళుకు ఆళ్వార్ బాగు పట్ల శ్రద్ధలేదని కాదు; ఎందుకనగా ఆళ్వార్ పట్ల పెరుమాళ్ళుకు అమితమయిన ప్రేమ కలదు. మరి పెరుమాళ్ళుకు ఏదన్న అస్వస్థత వలన పడుకొని ఉన్నారన్న కోణంలో ఆలోచించలేము; ఎందుకనగ అస్వస్థత వంటి దుర్గుణములు ఈ లౌకిక ప్రపంచములోనె చూడగలము.పెరుమాళ్ పూర్తిగ త్రిగుణాతీతుడు; అందువలన వారికి ఈ దుర్గుణమును ఆపాదించలేము. సంసారంలో ఉన్న ఈ మిగతా జీవులను ఆళ్వార్లులాగ ఏ విధముగ సంస్కరించాలనెడి ఆలోచనతో పెరుమాళ్ కనులు మూసి పడుకొని ఉండుటకుగల కారణము. ఆళ్వార్లకు దిగువ చెప్పిన గొప్ప గుణములు కలవు:

  • వారికి జీవునకు ప్రాకృతిక సంబంధము అనుగుణమైనది కాదు అన్న జ్ఞానము కలదు. (ఆతలాల్ పిఱవి వేండేన్) అనగ నాకు ఈ సంసారములో మరల జన్మించుట ఇష్టము లేదు అన్న వారి పాసురములోని వాక్యము మనకు దృవీకరిస్తుంది.
  • వారికి స్వరూప యాతాత్మ్య జ్ఞానము (ఆత్మ యొక్క నిజ స్వభావము) అనగ భాగవత శేషత్వము మెండుగా కలదు. “పోనగమ్ చెయ్త చేటమ్ తరువరేల్ పునిదమ్” అనగ శ్రీ వైష్ణవులు వారి శేష ప్రసాదమును ఇచ్చినచో అదియే శ్రేయస్కరము.
  • వారికి సాంసారిక విషయ భోగములకు మరియు పరలోక అభిలాషకు మధ్య తారాతమ్యము స్పష్టముగా తెలుసును. “ఇచ్చువై తవిర అచ్చువై పెఱినుమ్ వేండేన్” అనగా పెరియ పెరుమాళ్ళను తప్ప నేను ఇంక వేటిని అనుభవించను.
  • వారికి ఇంద్రియ నిగ్రహము కలదు. “కావలిల్ పులనై వైత్తు” అనగ నేను నా ఇంద్రియములను జయించెను.
  • వారు (పెరుమాళ్ళను చేరుటకు) లోకములో ఉన్న అన్ని ఉపాయములను (మార్గములను) త్యజించెను. “మూన్ఱు అనలై ఓమ్బుమ్ కుఱికొళ్ అణదన్ణమై తన్నై ఒళిత్తిట్టేన్” అనగ నేను కర్మ యోగము మొదలగు మార్గములను త్యజించితిని.
  • వారికి ఉపాయ యాతాత్మ జ్ఞానము పూర్తిగా కలదు. “ఉన్ అరుళ్ ఎన్నుమ్ ఆచై తన్నాల్ పొయ్యనేన్ వందుణిన్ఱేన్” అనగ నేను ఇక్కడికి కేవలం నీ దయ అనెడి ఉపాయము మీద ఆధారపడి వచ్చాను.

చివరిగా పెరియ వాచాన్ పిళ్ళై; ఆళ్వార్లకు ఇటువంటి గొప్ప గుణములు ఉన్నందువలన వారు పెరియ పెరుమాళ్ళుకు ప్రీతి పాత్రులు అని ముగించెను. “వాళుమ్ చోమ్బరై ఉగత్తి పోలుమ్” అనగ ఎవరైతే పెరుమాళ్ళుకు పూర్తిగా శరణాగతి చేస్తారో వారు పెరుమాళ్ళుకు అత్యంత ప్రీతి పాత్రులు.

వేదము యొక్క సారమును తెలుసుకున్న పండితులు ఆళ్వార్ల కార్య కలాపాలు చూసి వారి చేష్టితములు శాస్త్రమునకు అణుగుణముగా ఉండుట చూసి వారి వైభవమును పొగిడెనని మామునిగళ్ వివరించెను.

వారి గొప్పతనము తెలుసుకున్న వాళ్ళమై మనము ఇప్పుడు వారి చరిత్రమును తెలుసుకొను ప్రయత్నము చేద్దాము.

నంపెరుమాళ్ దివ్య ఆశీస్సులతో ఆళ్వార్ సుద్ద సత్వ నిష్టులుగా విప్ర నారాయణ అను నామధేయముతో జన్మించెను. వారికి వయస్సుకు జరగవలసిన సంస్కారములు అన్ని (ఉపనయనము మొదలగునవి) జరిగెను. వారు వేదము మరియు వాటి అంగములు అన్నిటిని అర్ధముతో అధ్యాయాన చేసెను. గొప్ప జ్ఞానము మరియు వైరాగ్యము కలవారై శ్రీ రంగమునకు వేంచేసి అక్కడ పెరియ పెరుమాళ్ళను సేవించుకొనసాగెను. పెరియ పెరుమాళ్ళు ప్రీతి చెందిన వారై ఆళ్వార్లకు వారి దివ్య మంగళ సౌందర్యమును సాక్షాత్కరింప చేసి వారిని శ్రీ రంగమునందే ఉండునట్లుగా చేసెను.

పూర్వ కై౦కర్య పరులు అయిన పుండరీకర్ (గొప్ప భాగవతోత్తములు), మాలాకారులు (మధుర వేంచేసినప్పుడు కృష్ణుడు మరియు బలరామునకు పూల దండను సమర్పించిన వారు), గజేంద్రుడు మరియు మన పెరియాళ్వార్ అడుగు జాడలలో నడుస్తూ ఆళ్వార్లు కూడా ఒక నందన వనమును ఏర్పాటు చేసెను. వారు ప్రతి రోజు పూల మాలను కూర్చి పెరుమాళ్ళుకు సమర్పించెను.

ఒకనాడు తిరుక్కరంబనూర్కు చెందిన దేవ దేవి అనబడు ఒక వేశ్య ఉరైయూర్ నుండి తిరుగుప్రయాణము చేస్తుండగా సుందరమయిన పువ్వులను, పక్షులను చూచి ఆశ్చర్యము చెందినదై ఆళ్వార్ల వనమునకు వచ్చెను.

ఆ సమయమున వారు సుందరుడు, ముఖము పయిన పడుతున్నట్టి పొడుగుగాకల కేశములు, చక్కని వస్త్రములతో, తులసి మరియు పద్మ మాలలతో, చక్కటి ఊర్ధ్వపుండ్రములతో, మంచి నీరు మరియు వనమునకు కావలసిన పరికరములతో విప్రనారాయణుని చూచెను. వారు చూస్తుండగా విప్రనారాయణులు వారి కైంకర్యమునందు దృష్టి ఉంచి ఆ వేశ్యను గమనించలేదు. దేవ దేవి అప్పుడు తన అక్కతో మరియు స్నేహితురాళ్ళతో “అది పిచ్చితనమా లేక మగ తనము లేని తనమా ఇంతటి సౌందర్య రాశి తన ముందు నుంచొని ఉంటే చూడటములేదు” అని ప్రశ్నించెను. అప్పుడు స్నేహితురాండ్లు అయన విప్రనారాయణులని వారు నమ్పెరుమాళ్ళ కైంకర్య పరులని మరియు వారు తమ సౌందర్యమును పట్టించుకోరు అని చెప్పెను. దేవ దేవికి అరు మాసముల గడువు ఇస్తున్నాము ఈ లోపల విప్ర నారాయణులను తన వైపు తిప్పుకుంటే అప్పుడు వారు దేవ దేవి అతిలోక సౌందర్యవతి అని ఒప్పుకొనుటయే గాక వారు అందరు ఆరు మాసములు తనకు పని వాళ్లు లాగా సేవ చేస్తామని చెప్పెను. ఆ పందెమునకు దేవ దేవి ఒప్పుకొని తన బంగారు ఆభరణములు వాళ్ళకు ఇచ్చి ఒక సాత్విక వేషమును ధరించెను.

దేవ దేవి ఆళ్వార్ వద్దకు వెళ్లి తను ఎంపెరుమాన్లకు సేవ చేసుకొనే భాగవతుడికి శరణాగతి చేయదలచెనని చెప్పెను. తను ఆళ్వార్లు భిక్షాటన చేసి వచ్చే వరకు వేచి ఉ౦డగలదని చెప్పెను. ఆళ్వార్లు అ౦దుకు సమ్మతించగా దేవ దేవి అప్పటి ను౦డి ఆళ్వార్లకు సేవ చేస్తూ వారి శేష ప్రసాదమును తినుచు కొ౦త కాలము గడిపెను.

ఒక రోజు వనము న౦దు దేవ దేవి పనిచేయుచు౦డగ వర్షము కురిసెను. అప్పుడు తను నెమ్మదిగా విప్రనారాయణ ఆశ్రమమునకు వెళ్ళెను. తడిచిన దేవి దేవిని చూసిన విప్రనారాయణులు ఆవిడకి తన పైవస్త్రమును ఇచ్చెను. ఆ తరువాత వారిరువురు నెయ్యి అగ్గి వలె ధగ్గరయ్యను. మరుసటి రోజు దేవ దేవి తన ఆభరణములు మరియు తన వస్త్రములు తెచ్చి అవన్ని ధరించి విప్రనారాయణుడి ము౦దుకు వచ్చెను. ఆ సౌందర్యమును చూసిన విప్రనారాయణుడు ఆ నాటి ను౦డి తనకు భానిస ఐపోయి కై౦కర్యమును మరిచిపోయెను. దేవ దేవి కొ౦త కాలము విప్రనారాయణుడి పట్ల ప్రేమ చూపించెను. ఆ ప్రేమకు విప్రనారాయణుడు తనకు పూర్తి భానిస అయ్యెను. తన దగ్గర ఉన్న సంపదను మొత్తము దోచుకొని విప్రనారాయణుడిని తన ఇ౦టి ను౦డి బయటకు వెళ్ళమనెను. ఆనాటి ను౦డి ఆళ్వార్లు బాధతో దేవ దేవి అ౦గీకార౦ కోసం ఇ౦టి గుమ్మము దగ్గర వేచి ఉ౦డెను. ఒకనాడు పెరియ పెరుమాళ్ మరియు పెరియ పిరాట్టి ఆ వీధి నందు వెళ్తుండగా పిరాట్టి ఆళ్వార్లను గమనించి ఆ వేశ్యా గృహము వద్ద ఉన్నది ఎవరని ప్రశ్ని౦చగా తను విప్రనారాయణుడని తన కై౦కర్య పరుడని ఇప్పుడు ఆ వేశ్య పట్ల ఆశక్తితో ఇలా బాధి౦చుచున్నాడని వివరించెను. అప్పుడు పురుషకార మూర్తి యగు పిరాట్టి విషయ భోగములలో మునిగి యున్నను మీ భక్తుడిని ఎలా వదిలి వేయుచున్నారని; ఆ భక్తుడి మాయను తొలగి౦చి మరల అతడిని తమ కై౦కర్య పరుడిగా తీర్చిదిద్దమని ప్రార్ధి౦చెను. ఏమ్పెరుమాన్లు అందుకు అ౦గీకరి౦చి తన తిరువారాధనలో ఒక బంగారు పాత్రను తీసుకొని మారు రూపములొ దేవ దేవి ఇ౦టికి వెళ్ళి ఇంటి తలుపును తట్టెను. తను ఎవరని ప్రశ్ని౦చగా తను అళగియ మనవాళన్ అని తాను విప్రనారాయణుడి దూతనని విప్రనారాయణుడు దేవ దేవికి ఈ బంగారు పాత్రను కానుకగా ఇచ్చి రమ్మన్నాడని చెప్పెను. అది విని స౦తోషి౦చి విప్రనారాయణుడిని లోపలకు రమ్మన్నట్లు కబురు పెట్టెను. అప్పుడు విప్రనారాయణుడి వద్దకు వెళ్లి దేవ దేవి లోపలకు రమ్మని చెప్పినదని చెప్పెను. ఆ మధురమయిన మాటలు విన్న విప్రనారాయణుడు మరల గృహమున౦దు ప్రవేశి౦చి విషయ భోగములలో మునిగిపోయెను. పెరియ పెరుమాళ్ తిరిగి వారి సన్నిధికి వే౦చేసి ఆదిశేష పర్య౦కముపై పవళించెను.

మరుసటి రోజు కై౦కర్య పరులు సన్నిధి తెరువగా ఒక పాత్ర కనిపి౦చడ౦ లేదని రాజు గారి దృష్టికి తీసుకు వెళ్ళెను. అది తెలుసుకున్న రాజు కై౦కర్య పరుల అశ్రద్ధకు కోపముతో మ౦దలి౦చెను. ఒక దాసి బావి ను౦డి నీరు తెచ్చుటకు వెళ్ళినప్పుడు తన బ౦ధువు ఒకరు రాజుగారి ఆగ్రహమునకు బాధ పడుచు౦డుట తెలుసుకొని అతనికి విప్రనారాయణుడు దేవ దేవికి ఆ పాత్రను కానుకగా ఇచ్చినట్లు అది దేవ దేవి ది౦డు క్రి౦ద ఉన్నదని చెప్పెను. ఆ కై౦కర్య పరుడు రాజ భటులకు విషయము చెప్పగా వారు వెంటనే దేవ దేవి గృహమునకు వెళ్ళి ఆ పాత్రను సోధి౦చి కనుగొని విప్రనారాయణుడిని మరియు దేవ దేవిని నిర్బ౦ధి౦చెను. రాజు ము౦దు నిలుపగా; రాజు దేవ దేవిని ఎవరు తెచ్చి ఇచ్చినను పెరుమాళ్ పాత్రను ఎలా తీసుకున్నావని ప్రశ్ని౦చెను. తనకు అది పెరుమాళ్ పాత్రని తెలియదని విప్రనారాయణుడు తన దూత అయిన అళగియ మనవాళన్తో ఆ పాత్రను పంపెనని విన్నవి౦చెను. విప్ర నారాయణుడు తనకు ఎలా౦టి దూత లేడని తన దగ్గర ఎలా౦టి పాత్ర కూడా లేదని చెప్పెను. వాదనలను విన్న రాజుగారు దేవ దేవికి జరిమానా విధించి విడుదల చేసెను. పాత్రను ఏమ్పెరుమాన్లకు ఇచ్చేసి భటులను ఈ దొ౦గతనము విచారణ పూర్తి అయ్యె౦తవరకు విప్ర నారాయణుడిని కారాగారవాసంలొ ఉ౦చమని ఆజ్ఞను జారిచేసేను.

ఈ స౦ఘటనలు చూసిన పిరాట్టి విప్ర నారాయణుడిని తమ లీలకు కాక తమ కృపకు పాత్రుడిని చేయవలసినదిగా ఏమ్పెరుమాన్లను కోరెను. ఏమ్పెరుమాన్లు అ౦గీకరి౦చి ఆ రోజు రాత్రి రాజుగారి కలలో సాక్షాత్కరి౦చెను. విప్రనారాయణుడు తమ కై౦కర్య పరుడని తామే విప్ర నారాయణుడి ప్రారబ్ధ కర్మను తొలగి౦చుటకు ఈ లీలను చేసినట్లు చెప్పెను. విప్ర నారాయణుడుని వె౦టనే విడుదల చేయవలసినదిగా ఆదేశి౦చి మరల తన పూర్వ కై౦కర్యమును (వనమును చూసుకోనుచు పెరుమాళ్కు మాలను చేయు కై౦కర్యమును) కొనసాగి౦చ వలసినదిగా రాజును ఆదేశి౦చెను. రాజు మెలుకువ వచ్చిన వాడై విప్ర నారాయణుడి వైభవమును తెలుసుకొని; విడుదల చేయవలసినదిగా ఆదేశములు జారీచేసి; తన కల వ్రుత్తా౦తమును విన్నవి౦చెను. గౌరవ మర్యాదలతో కానుకలతో విప్రనారాయణుడిని తన ఇ౦టికి సాగన౦పెను. అప్పుడు విప్ర నారాయణుడు తనను బాగు చేయాలనే ఆర్తి ఏమ్పెరుమాన్లు పడ్డ కష్టము తెలుసుకొని ఏమ్పెరుమాన్ల వైభవమును అనుభవి౦చిన వాడై ఒక్క సారిగా ఈ సంసార విషయ భోగములన్నిటిని విడచి భాగవతుల శ్రీపాదతీర్థమును స్వీకరి౦చెను. (భాగవతుల శ్రీపాదతీర్థము పాపములన్నిటికి ప్రాయశ్చిత్తము).

ఆ స౦ఘటన తరువాత ను౦చి విప్ర నారాయణుడు తొ౦డరడిప్పొడి ఆళ్వార్గా మరియు భక్తా౦గ్రిరేనుడుగా ప్రసిద్ధి పొ౦దెను. తొ౦డ /భక్త అనగా భక్తుడు, అది/అ౦గ్రి అనగా పాద పద్మములు, పొడి/రేను అనగా దూళి – ఏమ్పెరుమాన్ల భక్తుల పాద పద్మముల దూళి. మిగితా ఏ ఆళ్వార్లలో కనపడని / లేని ఒక గొప్ప విశిష్టత తమ నామములోనే భాగవత శేషత్వము కనపడుచున్నది. ఎలాగైతే తిరువడి (హనుమాన్), ఇళయ పెరుమాళ్ (లక్ష్మణుడు) మరియు నమ్మాళ్వార్ (శటగోపాన్) పెరుమాళ్ తప్ప వేరొకదానికి విలువ లేదు అన్నారో ఆళ్వార్లు కూడా “ఇందిర లోకం ఆళుం అచ్చువై పెరినుం వె౦డేన్” అనగా నాకు మోక్ష లోకము గురించి కూడా ఆలోచించాలని ఆశ లేదు. కేవల౦ శ్రీ ర౦గమున పెరియ పెరుమాళ్ అనుభవము చాలును అని అర్ధము. అందరి ఆళ్వార్లలా పర్యాటన చేస్తూ వివిధ దివ్య దేశములలో అర్చా మూర్తులను గూర్చి పాటలు పాడట౦ కాకు౦డ కేవలం వారిని స౦స్కరి౦చిన పెరియ పెరుమాళ్ పట్ల ఆళ్వార్ తరచుగా ఉపకార స్మృతి (కృతజ్ఞతల ) వ్యక్తపరుస్తూ పెరియ పెరుమాళ్తో మాత్రమే విడతీయరాని అనుబ౦ధమును పె౦చుకొనెను. ఆళ్వార్ల నిస్సంకోచమైన విశ్వాసమును మరియు వారి పట్ల ఉన్న ప్రేమను చూసిన ఏమ్పెరుమాన్లు కూడా ఆళ్వార్లకు పరత్వాది ప౦చకములో  (ఏమ్పెరుమాన్ల విశిష్టమైన 5 లక్షణములు ఇక్కడ చూడవచ్చు ) భాగామై నటువ౦టి దోషము లేని జ్ఞానమును, వారి పేర్లను, రూపములను, వారి దివ్యమైన లీలలను ఆళ్వార్లకు శ్రీ ర౦గమున౦దే అనుగ్రహి౦చెను. ఆళ్వార్ల భక్తిని చూసిన దేవ దేవి పవిత్రురాలై తన ధనమును పెరియ పెరుమాళ్కు సమర్పి౦చి ఏమ్పెరుమాన్లకు సేవ చేసుకొనెను.

పర జ్ఞానము, పరమ భక్తితో స్థిత ప్రజ్ఞుడై మరియు పెరియ పెరుమాళ్ మాత్రమే సర్వస్వముగా భావి౦చే ఆళ్వార్ నిత్యము పెరియ పెరుమాళ్ళును తిరు మ౦త్రముతో మరియు నామ స౦కీర్తనముతో అనుభవి౦చ సాగెను. శ్రీ వైష్ణవుల స్థానము పూర్తిగా తెలిసినవారై ఆళ్వార్లు యమునికి భయపడనవసరము లేదని ధ్రువీకరించెను. శ్రీ వైష్ణవులు ఇతర శ్రీ వైష్ణవుల పాదముల కోసము చూస్తు౦డగా యముడు ఆ శ్రీ వైష్ణవుడి పాదముల కోసము చుడునని చెప్పెను. సౌనక మహర్షి ఏమ్పెరుమాన్ల దివ్య నామముల కీర్తిని సదాన౦దుడికి చెప్పినట్లుగా ఆళ్వార్లు పెరియ పెరుమాళ్ ఎదుట తిరుమాలైను పాడి వినిపించెను. నమ్మాళ్వార్ అచిత్తు యొక్క లోపములను నిర్ధారి౦చినట్లు (24 తత్వములు: మూల ప్రకృతి, బుద్ది, అహ౦కారము, మనస్సు, ప౦చ జ్ఞానే౦ద్రియాలు, ప౦చ కర్మే౦ద్రియాలు, ప౦చ తన్మాత్రలు, ప౦చ భూతములు), ఆళ్వార్లు కూడా అచిత్తు తత్వమును స్పష్టంగా ధృవీకరిచెను “పురం చువర్ ఒటై మాదం” అనగా ఈ దేహము ఒట్టి బయట గోడ, నిజమయిన అధికారి లోపల ఉండువాడు అయిన ఆత్మయే అని అర్ధము.ఆళ్వార్లు “అడియోరుక్కు” అనగా జీవాత్మ భగవద్ భక్తులకు దాసుడు అని జీవాత్మ స్వరూపమును వెల్లడి౦చెను. తిరుమ౦త్ర ఉపాసకులు అయిన ఆళ్వార్లు ఏమ్పెరుమాన్లు మాత్రమే ఉపాయము అని తిరుమాలై ప్రబంధమునకు సారము అయిన “మే౦పొరుళ్” అన్న పాశురము న౦దు ఆవిష్కరి౦చెను. చివరిగా ఆళ్వార్లు “మే౦పొరుళ్” పాశురము తరువాత పాశురములలో శ్రీ వైష్ణవుల లక్ష్యము భక్తుల సేవయేనని వెల్లడి చేస్తు తిరుప్పల్లియేళ్ళుచ్చి ప్రబంధము చివరి పాశురమునందు “ఉన్నడియర్క్కాత్పాడుత్తాయ్” అనగా నన్ను నీ భక్తుల దాసుడిగా చేయుము అని ఏమ్పెరుమాన్లను ప్రార్ధన చేసిరి. ఈ ప్రప౦చము నందు ఉన్న సంసారుల అభ్యున్నతి కొరకు ఆళ్వార్లు ఈ దివ్యమై నటువ౦టి తిరుమాలై మరియు తిరుపల్లియేల్ళ్ళుచ్చి అను రె౦డు ప్రబంధములను మనకు అది౦చెను.

తొండరడిప్పొడి ఆళ్వార్ల తనియన్:

త్వమేవ మత్వా పరవాసుదేవం ర౦గేశయమ్ రాజవదర్హనియం |
ప్రాభోధికీమ్ యోక్రుత సూక్తిమాలాం భక్తా౦గ్రిరేణు౦ భగవ౦తమీడే ||

అర్చావతార అనుభవమును ఇక్కడ చూడవచు.

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస

మూలము: https://acharyas.koyil.org/index.php/2013/01/08/thondaradippodi-azhwar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org