తిరుక్కోష్ఠియూర్ నంబి

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః

 thirukoshtiyur-nambi

తిరునక్షత్రము : వైశాఖ మాసము, రోహిణి

అవతార స్థలము : తిరుక్కోష్ఠియూర్

ఆచార్యులు : శ్రీ ఆళవందార్

శిష్యులు : రామానుజులు (గ్రంథ కలక్షేప శిష్య)

పెరియళ్వార్లు వారి పెరియళ్వార్ తిరుమొళి 4.4 – నావ కారియమ్ పదిగమున తిరుక్కోష్ఠియూర్ ను అద్భుతముగా స్తుతించిరి. తిరుక్కురుగై పిరాన్ గా ఈ దివ్య దేశమున జన్మించి, తిరుక్కోష్ఠియూర్ నంబిగా ప్రఖ్యాతిగాంచి. శ్రీ ఆళవన్దార్ల ప్రధాన శిష్యులలో ఒకరైయారు. వీరిని గొష్ఠీపూర్ణులు, గొష్ఠీపూరీశన్ అని కూడా వ్యవహరించెదరు. శ్రీ ఆళవన్దార్లు వారి అయిదు ప్రధాన శిష్యులుకు సంప్రదాయములోని విభిన్న విషయములను ఎమ్పెరుమానర్లకు ఉపదేశించమని ఆజ్ఞాపించారు. వారిలో తిరుక్కోష్టియూర్ నంబి గారికి రహస్య త్రయ అర్థములను – తిరు మంత్రము, ద్వయ మరియు చరమ స్లోక అర్థములును రామానుజులు వారికి అనుగ్రహించమన్నారు.

ఏ మాత్రము నిబంధనలు లేకుండా, ఆశ ఉన్న వారందరికి చరమ శ్లోక అర్థములను నిస్వార్థముగా పంచినందుకు తిరుక్కోష్ఠియూర్ నంబి గారు రామానుజులని ఎమ్పెరుమానార్ అనే తిరునామమును అనుగ్రహిస్తారు. తిరుక్కోష్ఠియూర్ నంబి గారు వారి ఆచార్యులు అయిన శ్రీ ఆళవందార్లు అనుగ్రహించిన తిరుమంత్ర, ద్వయ, చరమ శ్లోకముల దివ్య అర్థములతో ఎమ్పెరుమాన్ ని ధ్యానము చేసుకుంటూ ఒంటరిగ ఉండేవారు. అందు చేత తిరుక్కోష్ఠియూర్లో ఉన్న ప్రజలికి కుడా నంబి గారి గొప్పతనము తెలియదు. నంబి గారి గొప్పతనము ఎరిగిన రామానుజులు వారు, నంబి గారి దగ్గర చరమ శ్లోకము యొక్క నీఘుడమైన అర్థములను నేర్చుకునుటకు 18 సార్లు శ్రీ రంగము నుండి తిరుక్కోష్ఠియూర్ వెళ్ళారు. 18 వ సారికి నంబి గారు రామానుజులుకి చరమ శ్లొక యొక్క రహస్య అర్థములను తెలుపుటకు నిశ్చయించుకున్నారు. అర్హత లేని వారికి, కష్టపడి తెలుసుకోవలని అనుకోనివారికి ఈ అర్థములను ఉపదేశించరాదని  రామానుజలను వాగ్దానుము చేయమని కోరుతారు. శ్రీ రామానుజల అంగీకరించి, వాగ్దానము చేస్తారు. తిరుక్కోష్ఠియూర్ నంబి గారు పరమ గోప్యమైన చరమ శ్లోక అర్థమును రామానుజులుకి ఉపదేశిస్తారు. చరమ శ్లోకమ్ – గీతాచార్యుని “సర్వ ధర్మాన్ పరిత్యజ్య” శ్లోకమ్ (గీత – 18.66). ఈ శ్లోకమున, అత్యంత ముఖ్యమైన సిద్దాంతమును ఏకమ్ అనే పదము ద్వారా ప్రతిపాదించబడినది – భగవనుడే మనకు ఏకైక ఉపాయము. మరి ఇంక ఏ సాధనములు అయిన కర్మ, ఙ్యాన, భక్తి యోగములు, మనము చేసిన ప్రపత్తి కాని మనకి ఉపాయములు కావు. ఈ భావ గుహ్యమైన చరమ శ్లోకమును అందరికి అందించిన ఇతరులు వారి కర్మలును మాని వేసే ప్రమాదమున్నందున రామానుజులు వరుకు వచ్చిన ఆచార్యులు ఈ విషయమును చాలా గోప్యము గా ఉంచినారు. రామానుజులు నంబి గారి దగ్గర నేర్చుకున్న వెంటనే చరమ శ్లోక అర్థమును తెలుసుకోవలన్నా ఆశ ఉన్న వారందరికి ఉపదేశం చేసారు. అది తెలుసుకున్న వెంటనే నంబి గారు రామానుజులు ని పిలిపిస్తారు.రామానుజులు నంబి గారి తిరుమాళిగై చేరుతారు. రామానుజులతో జరిగిన విషయము గురించి విచారిస్తారు, వారి అజ్ఞాను ఉల్లంఘించినారని రామానుజులు ఒప్పుకుంటారు. ఎందుకు అలా చేసారు అని అడుగగా “నేను మీ అజ్ఞాని ఉల్లంఘించినందున నాకు నరకము కలిగి నప్పటికి విన్నవారు అందరు మొక్షము పొంది, ఉజ్జివించేదరు” అని చెప్తారు. ఇతరులకు నిజమైన ఆధ్యాత్మిక ఙ్ఞానమును ఇవ్వాలనే రామానుజులు వారి యొక్క పెద్ద మనస్సును చూసి నంబి సంతసించి, వారికి “ఎంబెరుమానార్”  అని పిలిచారు.  ఎమ్పెరుమాన్ అనగా నా స్వామి (భగవానుడు), ఎమ్పెరుమానార్ అనగా భగవంతుని కన్నా ఎక్కువ కారుణ్యము కలవారు. ఈ విధముగా రామానుజులు చరమ శ్లోకము యొక్క నిఘూఢమైన అర్ధములను చాటి ఎంబెరుమానార్ గా మారారు. ఈ చరిత్రము మనకు ముముక్షుప్పడి వ్యాఖ్యాన అవతారికన (పరిచయము) మణవాళ మామునులు గారి చేత చరమ శ్లోక ప్రకరణమున అతి స్పష్టంగ, సుందరంగా వివరించబడినది, గమనిక: 6000 పడి గురు పరమపరా ప్రభావమ్ అందు శ్రీ రామానుజులు తిరుక్కోష్టియూర్ నంబి గారి వద్ద తిరుమంత్ర అర్థమును తెలుసుకుని తరువాత అందరికి చాటి, ఎమ్బెరుమానార్ అని నంబి గారి చేత తిరునామము గ్రహించి, అటు పిమ్మట చరమ శ్లోక అర్థములను తెలుసుకున్నారని చెప్పబడినది. కాని మణవాళ మామునులు, రామానుజులు చరమ శ్లోక అర్థమును వ్యక్త పరిచారని స్పష్టంగ తెలిపినందువల్లను, మరియు వ్యాఖ్యానములో అనేక చోట్ల “ఏకమ్” అను పదము యొక్క అర్థము అత్యంత రహస్యమైనదని చెప్పునందు వల్ల, ఇదే  ప్రమాణమని (ఆచార్యులు చెప్పిన ప్రకారముగా) తీసుకుంటిమి.

తిరుక్కోష్ఠియూర్ నంబి గారి వైభవమును అనేక చోట్ల వ్యాఖ్యానముల లో చెప్పబడినది.

  • నాచ్చియార్ తిరుమొళి 12.2 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము.
    • ఇందు ఆండాళ్ ని తిరుక్కోష్ఠియూర్ నంబి గారి తో పోల్చడం జరిగింది. ఎందుకు అనగా నంబి గారు కూడా వారి భగవద్గుణ అనుభవమును ఎవరికీ తెలియజేయలేదు. మన ఆండాళ్ కుడా తనకి కలిగిన భగవత్ విరహమును ఎవరికి చెప్పుటకు ఇష్టపడలేదు.
    • తిరుక్కోష్ఠియూర్లో ఉన్న ప్రజలి కూడా నంబి గారి గొప్పతనము తెలియదు. రామానుజులు తిరుక్కోష్ఠియూర్ చేరుకోగానే అక్కడ వున్న వారిని తిరుక్కురుగై పిరాన్ (నమ్మళ్వార్ పేరు మీదుగా నంబి గారి నిజ నామధేయము) గారి ఇంటి దారి చెప్ప మన్నారు. చూపిన వెంటనే ఆ ఇంటి దిక్కుకి సాష్టంగ నమస్కారమును చేసారు. సాక్షాత్ యతిరాజులు వీరికి నమస్కారము చేయుట చూసి అక్కడ ఉన్న స్థానికులు నంబి గారి విలువను తెలుసుకున్నారు.
    • ముదలియాణ్డాన్ మరియు కూరత్తాళ్వానులు శ్రీ నంబి గారి వద్ద 6 నేలలు పాటు వుండి సంప్రదాయ రహస్యాలను తెలుసుకున్నారు.
  • తిరువిరుత్తమ్ 10 – నంపిళ్ళై స్వాపదేశము: నంబి గారు శ్రీరంగమునకు వచ్చిన ప్రతిసారి రామానుజులు మరచ్చిపురం అనే ఊరు వరుకు సాగనంపేవారు. అలా ఒక సారి రామానుజులు నంబి గారితో “ధ్యానము చేసుకోనుటకు యోగ్యమైన ఒక సంఘటనను చెప్పండి” అని అడుగగా అందుకు నంబి గారు వెంటనే “మా ఆచార్యులు అయిన యామునాచార్యులు స్నానముకై నదిలో మునిగి నప్పుడు వారి వీపు భాగము కుర్మాసనము వలే”కనిపించేదని, వారు లేకపొయినా తాను అదే ఎప్పుడూ ధ్యానము చేస్తానని, రామానుజులుని కుడా అదె ధ్యానము చేయమన్నారు. దీని వలన మనకు తెలిసినది ఏమనగా శిష్యుడు ఆచార్యుని ఉపదేశములకు మరియు జ్ఞాననమునకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తాడో, వారి దివ్య తిరుమేని కూడా ఇవ్వవలెనని తెలుస్తునది.
  • తిరువిరుత్తమ్ 99 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం :ఆళ్వార్, వారు జ్ఞాన పిరానులనే ఉపాయముగా స్వీకరించుదురని చెప్పారు.ఈ విషయము ద్వారా చరమ శ్లోకము యందు ఏకం పదము యొక్క అర్థము – మిగిలిన ఉపాయములు తొలగించి భగవంతుడు ఒక్కడే ఉపాయము అనుటకు వివరణనిస్తునది. ఇది సంప్రదాయమునందు చాలా రహస్యమైన అర్థము, దీనినే నంబి గారు రామానుజులకు ఉపదేశించినారు. ఒకసారి, శ్రీ రంగమునకు ఉత్సవము సేవించుటకు వచ్చినప్పుడు, నంబి గారు రామానుజులుని శ్రీ రంగము కోవెల లో   జన సంచరము లేని ప్రదేశమునకు తీసుకువచ్చి ఏకమ్ అనే పద వివరణ చేయ సాగారు. నంబిగారు చెప్పనారంబించి నప్పుడు ఆ మూలన నిద్ర పోతున్న ఒక కైంకర్య పరుడిని చూసి వారు చెప్పడం ఆపివేసారు. వెంటనే ఇక్కడ ఎవరో ఉన్నారని అర్థమును చెప్పరు. తరువాత నంబి గారు రామానుజులు అర్థ విశేషములను తెలిపి, ఈ అర్థములను అర్హత ఉన్న వారికే అనుగ్రహించ వలెనని చెప్తారు. మండుట యెండను లెక్క చేయక  తెలిసిన అర్థములు తెలిసినట్టుగా వెంటనే కురత్తాళ్వాన్ యెడకి వెళ్ళి ఏ ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఉపదేశిస్తారు, ఈ విధంగా, అర్థములను తెలుసుకునుటకు ఆళ్వాన్ ఎటువంటి శ్రమను చేయకున్నను, ఎమ్పెరుమానార్ ఆళ్వాన్ తో అర్థ విశేషములను పంచుకుని  సహకారి నైరపేక్ష్యమ్ ని (మనము చేసిన ఉపకారమునకు ప్రతి స్పందన ఆశించకుండా)  ఇక్కడ చాటి చెప్తున్నారు.
  • తిరువిరుత్తమ్ 95 – (యాతానుమ్ ఓర్ ఆక్కయిల్ పుక్కు పాశురమ్) నంబి గారికి ఈ పాశురము చాలా ఇష్టమైనదని వారి శిష్యులలో ఒకరు నంజీయరు గారికి తెలుపుతారని ఈ వ్యాఖ్యానము యందు చెప్తారు. జీవాత్మ నిరంతరము లౌకిక విషయములలో మునిగి తేలుతున్నను ఎమ్పెరుమాన్ జీవాత్మపై చూపించే నిర్హేతుక కృపను ఈ పాశురమున చెప్పబడినది.
  • తిరువాయ్మొళి 1.10.6 – నమ్పిళ్ళై వ్యాఖ్యానమ్ – ఆళ్వారులు వారికి కలిగిన భగవద్ అనుభవమును వారి మనస్సుతో చెప్పుకునేవారు. ఈ విషయమును వివరించుటకు,  నమ్పిళ్ళై గారు నంబి గారి ఉదాహరణ ఇస్తు చేస్తారు. ఎమ్పెరుమాన్ విషయము చాల గొప్పది, దానిని అందరు అర్థము చేసుకోలేరు. అందుకే నంబి గారు ఒంటరిగా భగవద్ అనుభవములో ఉంటారు, అదే విధంగా ఆళ్వారులు వారి మనస్సుతో చెప్పుకునేవారు.
  • తిరువాయ్మొళి 8.8.2 – రామానుజులు ప్రసంగిస్తున్నప్పుడు జీవత్మ సహజ స్వరూపమును గూర్చి ప్రశ్న తలెత్తుంది “ఙ్ఞాతృత్వమా లేక శేషత్వమా (పరమాత్మ కి శేషుడా)”? అని, అప్పుడు రామానుజులు కూరత్తాళ్వాన్ ని తిరుకోష్ఠియూర్ నంబి గారి దగ్గర తెలుసుకునుటకు పంపించారు. కూరత్తాళ్వాన్ నంబి గారికి ఆరు నేలలు శుశ్రుష చేస్తారు. నంబి వారు వచ్చిన కారణము అడుగుతారు. రామానుజులు కి కలిగిన ప్రశ్న గురించి వారికి విన్నవిస్తారు కూరత్తాళ్వాన్. వెంటనే నంబి గారు మన ఆళ్వారులు వారి ప్రబంధములో “అడియేన్ ఉళ్ళాన్” అనగా జీవత్మ దాసుడు అని చెప్పారు. మరి వేదాంతము జీవుడు ఙ్ఞానం కలిగిన వాడని ఎందుకు చెప్తుంది అని అడుగగా. ఇక్కడ ఙ్ఞాతృత్వము ఏమనగా పరమాత్మకి జీవుడు దాసభూతుడనే ఙ్ఞానం కలిగి ఉండుట. “ఆళ్వారులు మరియు నంబి గారు వివరించినట్టుగా ఎమ్పెరుమాన్ కి శేషుడనే ఙ్ఞానం కలిగిన వాడే జీవాత్మ.

తిరుకోష్ఠియూర్ నంబిగారు ఎంబెరుమానారుల వైభవమును స్థాపించుట చరమోపాయ నిర్ణయము అను గ్రంథము లోను చూపబడినది. ఈ క్రింది లింకున పొందుపర్చడమైనది.

http://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujars-acharyas.html

తిరుమాలై ఆండాన్ రామానుజులుకి తిరువాయ్మొళి కాలక్షేపమును అనుగ్రహించు సమయమున వారి ఇరువురికి కలిగిన చిన్న విభేధము కారణమున కాలక్షేపము అగిపోయినది. అప్పుడు నంబి గారు అండాన్ తో రామానుజులు అవతార పురుషులు, ఙ్ఞానులని అని తెలియజేసి కాలక్షేపము కొనసాగేల చేసిరి. ఒక సారి రామానుజులకు గిట్టని వారు వారికి భిక్షలో విషమును కలిపిరి.ఈ విషయమును తెలుసుకున్న రామానుజులు ఆహరము మాని ఉపవసించారు. ఈ విషయమును తెలుసుకున్న నంబి గారు శ్రీరంగమునకు బయలుదేరిరి. నంబి గారిని స్వాగతించుటకు రామానుజులు ఎదురువెళ్ళి మండుటెండలో సాష్టాంగ ప్రణామము చేసిరి. నంబి గారు రామానుజులుని లేవమని అనక అలానే చూసిరి. అప్పుడు రామానుజులు శిష్యుడు అయిన కిడామ్బి ఆచ్చాన్ అను వారు రామానుజులుని పైకి లేపి నంబిగారిని సవాల్చేస్తారు. అప్పుడు నంబి గారు రామానుజుల తిరుమేని పై ఎవరికి అభిమానము ఉన్నదని తెలుసుకునుటకు ఆ విధంగా ప్రవర్తించానని చెప్పి, కిడామ్బి ఆచ్చాన్ను ఎమ్పెరుమానార్ కు రోజు ప్రసాదమును చేయమనిరి.ఈ విషయము ద్వారా నంబి గారికి రామానుజులు అంటే చాలా ప్రీతి అని, వారి బాగు కోరే వారని తెలుస్తుంది.

ఇలా తిరుకోష్ఠియూర్ నంబిగారు వైభవమును తెలుసుకున్నాము శ్రీ రామానుజులకి ఎంబెరుమానార్ అనే తిరునామము వచ్చుటకు కారణమై, అదే పేరు మీదుగా నంపెరుమాళ్ ద్వారా మన సంప్రదాయమునుకు ఎంబెరుమానార్ దర్సనం అని పేరు వచ్చుటకు దోహదపడ్డారు. ఈ విషయమును మణవాళమామునులు వారి “ఉపదేశ రత్నమాల” అను గ్రంథమున చెప్పిరి. యామునాచార్యులు, రామానుజులు పై అపారమైన ప్రేమ కలిగి వున్న తిరుకోష్ఠియూర్ నంబిగారి శ్రీపాదములుకు మనం అందరమూ సాష్ఠాంగ ప్రణామములను అర్పిద్దాము.

తిరుక్కోష్ఠియూర్ నంబి తనియన్:

శ్రీవల్లభ పదామ్భోజ దీభక్త్యామ్రుత సాగరమ్ |
శ్రీమద్గోష్ఠీపురీపూర్ణమ్ దేసికేంద్రమ్ భజామహే ||

అడియేన్ సురేశ్ కృష్ణ రామానుజ దాస

మూలము: http://acharyas.koyil.org/index.php/2013/02/27/thirukkoshtiyur-nambi-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org