వాది కేసరి అళగియ మణవాళ జీయర్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

vadhi-kesari-azhagiya-manavala-jiyar

తిరునక్షత్రము: జ్యేష్ఠ మాసము స్వాతి నక్షత్రం

అవతార స్థలము: అంబ సముద్రం వద్ద మన్నార్ కోవిల్ (బ్రహ్మ దేశం)

ఆచార్యులు: పెరియ వాచ్ఛాన్ పిళ్ళై (సమాశ్రయణం) మరియు నాయనారచ్ఛాన్ పిళ్ళై (గ్రంథ కాలక్షేపం)

శిష్యులు: యామునాచార్యర్ (తిరుమలై ఆండాన్ యొక్క వంశస్తులు, తత్వ భూషణం మరియు ప్రమేయ రత్నం రచించారు), పిన్ సేన్ఱవల్లి ఇతరులు

పరమపదించిన చోటు: శ్రీరంగము

రచనలు~: తిరువాయ్మొళి 12000 పడి వ్యాఖ్యానము (ప్రతి పదార్థము), తిరువిరుత్తమ్ స్వాపదేశ వ్యాఖ్యానం, ద్రమిడోపనిషద్ సంగతి – తిరువాయ్మొళి సంగతి శ్లోకము, ఆధ్యాత్మ చింతై, రహస్యత్రయ వివరణం, దీప సంగ్రహం, తత్వ దీపం, దీప ప్రాకాశికై , తత్వ నిరూపణం, భగవత్ గీతై వెంబ – శ్రీ భగవత్ గీత లోని ప్రతి శ్లోకమునకు తమిళంలో ఒక పాశురము, శ్రీ భగవత్ గీత వ్యాఖ్యానము మొదలైనవి.

తల్లి దండ్రులచే వరదరాజర్ అనే పేరుతో అనుగ్రహింపబడ్డారు. యౌవన వయస్సులోనే పెరియ వాచ్ఛాన్ పిళ్ళై గారి శిష్యులై, తిరుమడ పళ్ళి కైంకర్యమును చేస్తూ వారి సేవ చేసారు. 32 సం॥ వయస్సులో ఉన్నప్పుడు కొందరు పండితులు తత్వ శాస్త్రం చర్చ చేస్తుండగా చూసారు . ఆత్రుతతో వారి వద్దకు వెళ్లి చర్చింకునే విషయమును గురించి అడిగారు. వరదరాజులు అజ్ఞానుడని తలచి, వ్యంగ్యంగా వారితో ముసలకిసలయం (లేని గ్రంథము) గురించి చర్చిస్తున్నాము అని చెప్పారు. అక్షర జ్ఞానము లేనందున శాస్త్రము అర్థము అవదని చివాట్లు పెట్టారు. పెరియ వాచ్ఛాన్ పిళ్ళై వారి దగ్గరుకు వెళ్లి జరిగిన సంఘటనను వివరించారు. తనకు చదువు రానందున వల్లే తనని వెక్కిరించారని పెరియ వాచ్ఛాన్ పిళ్ళై వారికి వివరిస్తారు. తన పరిస్థతి మీద సిగ్గు పడి వారికి శాస్త్ర జ్ఞానమును ప్రసాదించాలని కోరుతారు. అత్యంత దయ మయులైన పెరియ వాచ్ఛాన్ పిళ్ళై వారు, వారికి శాస్త్రముతో పరిచయము చేసి, వారికి కావ్య, నాటక, అలంకార, శబ్ద, తర్క, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస భోదిస్తారు. ఆచార్యుని కృప కారణంగా, అతి తక్కువ కాలములోనే వారు శాస్త్రములో దిట్ట అయ్యి, ముసలకిసలయం అనే గ్రంథము రచించి, తనను వెక్కిరించిన పండితులకు బహుకరిస్తారు. భగవత్ విషయమును నాయనారచ్ఛాన్ పిళైగారి దగ్గర నేర్చుకున్నారు. ఆచార్య కటాక్షము వల్ల ఒక జీవాత్మ ఎంత ఎత్తులకు ఎదగ గలడో తెలుపుటకు వీరు ఒక చక్కని ఉదాహరణ.

అటు పిమ్మట, విరక్తి కలగి, సన్యాస ఆశ్రమమును స్వీకరించి, అళగియ మణవాళ జీయర్ (సుందర జామాతృ ముని ) అను తిరునామమును స్వీకరిస్తారు. ఇతర తత్వముల పండితులతో అనేక వాదములను గెలిచి, వాది కేసరి అనే తిరునామమును సంపాదించు కుంటారు.

మన సంప్రదాయము కొరకై అనేకమైన మహా గ్రంథముల రచించారు. తిరువాయ్మొళికి ప్రతి పదార్థమును 12000 పడి అను గ్రంథము పేరిట రాసారు (శ్రీ భాగవతము 12000 శ్లోకముల పరిమాణము పోలిన). ఇది చాల గొప్ప గ్రంథము, ఎందులకు అనగా తిరువాయ్మొళి ఇతర వ్యాఖ్యానములలో నమ్మాళ్వార్ యొక్క దివ్య అనుభవమును మరియు పాశురము యొక్క ప్రవాహమును వర్ణించారు. కాని ఏ యొక్క గ్రంథము తిరువాయ్మొళి గ్రంథమును సుస్పష్టంగా తెలుసుకునేందుకు వీలుగా పాశురము యొక్క ప్రతి పదార్థమును ఇవ్వలేదు. వీరు రాసిన మరి ఒక్క చెప్పుకో తగ్గ గ్రంథము శ్రీ భగవద్గీత యొక్క ఒక్కొక్క శ్లోకమునకు అరవములో పాశురము రాయుట. శ్రీ భగవద్ గీత శ్లోకముల యొక్క సూత్రములను సులభమైన తమిళ భాషలో రాసారు . అనేకమైన రహస్య గ్రంథములను కూడా రచించారు .

వీరి శిష్యులైన యామునాచార్యర్ (తిరుమలై ఆండాన్ యొక్క వంశస్తులు) అత్యుత్తమమైన రెండు రహస్య గ్రంథములను రాసారు (తత్వ భూషణం మరియు ప్రమేయ రత్నం) – రెండునూ విలువైన సాంప్రదాయ విషయములతో నిండి ఉన్నవి.

మణవాళ మాముణులు తిరువాయ్మొళి కు గల అనేక వ్యాఖ్యానములు గురించి చెప్పు సందర్భములో వాది కేసరి అళగియ మణవాళ జీయర్ ను మరియు వారి 12000 పడిని చాలా పొగుడుతూ రాసారు. వారి ఉపదేశ రత్నమాల లోని 45వ సూత్రమును పరిశీలద్దాము రండి.

అన్బోడు అళగియ మణవాళ జీయర్
పిన్బొరుమ్ కట్ట్రు అరిన్దు పేచుక్కైక
తామ పెరియ పోతముడన్ మారన్ మఱైయిన్ పొరుళ్ ఉఱైత్తదు
ఏతమిల్ పన్నిరాయిరం

అనువాదం
అళగియ మణవాళ జీయర్, భవిష్యద్ కాలములో అందరు చెప్పుకునుటకున్ను, పాండిత్యము తోను మరియు ఎంతో ప్రేమ తోను తిరువాయ్మొళి యొక్క అర్థములను (ప్రతి పదార్థమును), కల్మషము లేని 12000 పడిలో అనుగ్రహించారు.

పిళ్ళై లోకం జీయర్, వారి వ్యాఖ్యానములో ఈ క్రింది వాటిని గుర్తిస్తారు:

  1. ఇక్కడ ప్రేమ అంటే – అ) తిరువాయ్మొళి పట్ల అనుబంధం /భక్తి ఆ) జీవాత్మ పట్ల దయ (జీవాత్ముల ఉజ్జీవనం కాగ వ్యాఖ్యానమును అనుగ్రహించారు)
  2. తిరువాయ్మొళికి మరి నాలుగు వ్యాఖ్యానములు ఉన్నపటికిని, పాశురములోని ఏదైనా పదము యొక్క నిజమైన అర్థమును తెలుసుకోవలేనన్న, 12000 పడిపై ఆధార పడ వలసి ఉంటుంది. అందులకే దీనిని చాలా ముఖ్యమైన గ్రంథముగా పరిగణిస్తారు.
  3. అళగియ మణవాళ జీయర్ గారి జ్ఞానమును మరియు సామర్థ్యమును చాలా గొప్పగా మణవాళ మామునులు కీర్తిస్తారు, ఎందుకనగా వీరు తిరువాయ్మొళి నైపుణ్యులు మరియు దాని విలువైన అర్థములను సుస్పష్టంగా రాసారు.
  4. ఆళ్వార్ యొక్క దివ్యమైన అనుభవము వీరి వ్యాఖ్యానములో సుందరంగా వర్ణింపబడ్డాయి. ఇతర వ్యాఖ్యానముల తో వీరి వ్యాఖ్యానము సరి సమముగా ఉంటుంది. ఉదాహరణకు, పిళ్ళాన్ 6000 పడి వ్యాఖ్యానము చిన్నగా నున్న, వీరి వ్యాఖ్యానము అక్కడ వివరణము ఇస్తుంది. పెరియ వచ్ఛాన్ పిళ్ళై 24000 పడి వ్యాఖ్యానము లేక నమ్పిళ్ళై 36000 పడి వ్యాఖ్యానము విస్తారముగా నున్న, అక్కడ వీరి వ్యాఖ్యానము చిన్నగా ఉండి వివరణము ఇస్తుంది.
  5. ఆళ్వార్ వారి వ్యాఖ్యానమును ఏదమిల్ (నిష్కలమషం) అని సంభోదించారు, అదే విధముగా మాముణులు వీరి వ్యాఖ్యానమును (12000 పడిని) నిష్కలమషమునైనదిగా వివరిస్తారు.

ఈ విధముగా వాది కేసరి అళగియ మణవాళ జీయర్ యొక్క దివ్యమైన జీవిత చరిత్రములోని కొన్ని ఘట్టములను పరిశీలించాము. భాగవత్ నిష్ఠలో పరిపూర్ణముగా మునిగి, పెరియ వాచ్ఛాన్ పిళ్ళై మరియు నాయనారచ్ఛాన్ పిళ్ళైకి అత్యంత ప్రియ శిష్యులుగా ఉండిరి. వారి యొక్క పాదపద్మము దగ్గర మనలకు అటువంటి నిష్ఠ రావడానికి ప్రార్థన చేద్దాం.

వాది కేసరి అళగియ మణవాళ జీయర్ తనియన్

సుందరజామాత్రుమునే : ప్రపద్యే చరణాభుజం
సంసారార్ణవ సంమ్మజ్ఞ జంతు సన్తారపోతకమ్

అడియేన్ ఇందుమతి రామానుజ దాసి

మూలము: http://acharyas.koyil.org/index.php/2013/03/22/vadhi-kesari-azhagiya-manavala-jiyar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/2012/08/17/introduction-contd-english/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

6 thoughts on “వాది కేసరి అళగియ మణవాళ జీయర్”

Comments are closed.