తిరుమళిశై అణ్ణావప్పంగార్

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

తిరునక్షత్రముః ఆని అవిట్టమ్ (జ్యేష్ఠ, శ్రవణము)

అవతారస్థలముః తిరుమళిశై

ఆచార్యులుః నరసింహాచార్యులు (వీరి తండ్రి గారు)

వీరు క్రీ.శ.1766 లో తిరుమళిశై అనే ఊరిలో ముదలి యాణ్డాన్ వంశస్తులైన నరసింహాచార్యుల సుపుత్రులుగా అవతరించారు, వీరికి వీర రాఘవన్ అని వారి తండ్రి గారు నామ కరణము చేసిరి. వీరి తాతాగారైన రఘువరాచార్యర్ ‘భక్తి సారోదయమ్’ అనే స్తోత్రమును రచించారు.

అతి చిన్న వయసులోనే తర్కము, వ్యాకరణము, మీమాంశ, సాంఖ్యము, పతంజలి యోగము మొదలైనవి పూర్తి చేసారు. పదిహేను సంవత్సరాలకే యజుర్ వేద శాఖలను అధీకరించారు. ఇరవై గడిచే వరకు అన్ని శాస్త్రములలోను అధికారము సంపాదిచారు. తండ్రి గారి వద్ద రహస్య గ్రంధములను అవపోశన పట్టారు. సత్సాంప్రదాయానికి సంభదించిన రచనలు చేయనారంభించారు. ఆనాటికి ఎందరో మాయవాదులను తన వాదుతో జయించిన వాదూల వరదాచర్యులు, శ్రీ రంగాచార్యుల వద్ద కూడా శిక్షణ పొందారు.

వీరు కేవలము 51 సం, మాత్రము ఈ లోకములో ఉన్నప్పటికీ ఎన్నో అపూర్వములైన గ్రంధములను మనకు అందించారు. వాటిలో ముఖ్యమైనవి 1. పిళ్ళై లోకాచార్యుల శ్రీ వచన భూషణనమునకు మామునులు రాసిన వ్యాఖమునకు “అరుంబదమ్” (శ్లోక సంఖ్యలతో వివరణ) 2. తిరుమళిశై ఆళ్వార్ల వైభవమును గురించి రాసిన “శ్రీ భక్తి సారోదయము”.

ఇతర రచనలు

  1. శ్రీ భక్తి సారోదయము
  2. వేదవల్లి శతకము
  3. హేమలతాష్టకము
  4. అభీష్ట దండకము
  5. శుక సందేశము
  6. కమల కల్యాణ నాటకము
  7. మలయజ పరిణయ నాటిక
  8. నృసింహాష్టకము
  9. అరుమ్పదమ్ (మాముణుల శ్రీ వచన భూషణ వ్యాఖ్యానమునకు వివరణ)
  10. తిరుచన్ద విరుత్త ప్రతిపదము
  11. శ్రీ రంగ స్తవ వ్యాఖ్యానము
  12. మహావీరచరిత వ్యాఖ్యానము
  13. ఉత్తర రామచరిత వ్యాఖ్యానము
  14. చతుశ్లోకి వ్యాఖ్యానము
  15. రామానుజాష్టక వ్యాఖ్యానము
  16. నక్షత్రమాల వ్యాఖ్యానము
  17. దేవరాజ గురు విరచిత వరవరముని శతక వ్యాఖ్యానము
  18. దుష్కర శ్లోక టిప్పణి
  19. దినచర్య
  20. షణ్మత దర్శిని
  21. లక్ష్మఃఉపాయత్వ నిరాసః
  22. లక్ష్మివిభుత్వ నిరాసః
  23. సూక్తిసాదుత్వము
  24. తత్వసుధ
  25. తత్వసార వ్యాఖ్య-రత్నసారిణి
  26. సచ్చరిత్ర పరిత్రాణము
  27. పళ్ళమడై విళ్ళక్కమ్
  28. త్రిమ్సత్ ప్రశ్నోత్తరమ్
  29. లక్ష్మి మంగళదీపిక
  30. రామానుజాతిమానుష వైభవ స్తోత్రము
  31. అనుప్రవేశ శ్రుతి వివరణమ్
  32. శైలోగ్నిశ్చ”శ్లోక వ్యాఖ్య
  33. మహీసారవిషయ చూర్ణిక
  34. స్వాన్తే మే మదనస్తితిమ్ పరిహర” ఇత్యాది శ్లోక వ్యాఖ్య
  35. సచ్చార్యాష్టకమ్
  36. ప్రాప్యప్రపన్చన పంచ వింశతిః
  37. న్యాయ మంత్రము
  38. తాత్పర్య సాచ్రికరమ్
  39. వాచస్సుతా మీమాంశ
  40. వాచస్సుతా పూర్వపక్షోత్తరము
  41. బ్రహ్మవత్వతనంగమ్
  42. లక్ష్మి స్తోత్రము
  43. వరణ పంచ వింశతిః

పైన తెలుసుకున్న విషయాలను అవలోకించగా తిరుమళిశై అణ్ణావప్పంగార్ గొప్ప జ్ఞాని అని తెలుసుకున్నాము. వారి శ్రీ చరణాలకు ప్రణామాలు చేస్తూ వారు మనకందించిన గ్రంధములు అనుభవించటానికి ప్రయత్నము చేద్దాము.

తిరుమళిశై అణ్ణావప్పన్గార్ తనియన్

శ్రీమద్ వాదూల నరసింహగురోస్తనూజమ్
శ్రీమద్ తదీయపదపంకజ భ్రుంగరాజమ్
శ్రీరంగరాజ వరదార్య క్రుపాత్త్ భాష్యమ్
సేవే సదా రఘువరార్యం ఉదారచర్యమ్

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://acharyas.koyil.org/index.php/2013/06/26/thirumazhisai-annavappangar/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/2012/08/17/introduction-contd-english/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

1 thought on “తిరుమళిశై అణ్ణావప్పంగార్”

Comments are closed.