శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
తిరునక్షత్రము: వృశ్చిక మాసము పునర్వసు నక్షత్రము
అవతార స్థలము: కాంచీపురము (‘పెరియ తిరుముడి అడైవు‘ అనే గ్రంధము ఆధారముగా తిరుమల)
ఆచార్యులు: మణవాళ మాముణులు
శిష్యులు: కోయిలప్పన్ (పూర్వాశ్రమములో వీరికుమారులు), పరవస్తు అణ్ణన్, పరవస్తు అళగియ మణవాళ జీయర్, అణ్ణరాయ చక్రవర్తి, మేల్నాట్టు తోళప్పర్ నాయనార్.
రచనలు; అంతిమోపాయ నిష్థ
పరమపదము చేరిన స్థలము; తిరుమల
గోవిందర్ అనే తిరునామముతో అరణ ప్పురత్తాళ్వార్ల వంశములోని మధుర కవి అయ్యర్ల కుమారులుగా అవతరించారు. పత్తంగి పరవస్తు వంశములోని వారని మరొక వాదము కూడాకలదు. పూర్వాశ్రమములో గోవింద దాసరప్పన్, భట్టనాదర్ అనే పేర్లు కూడా కలవు. సన్యశించిన తరవాత పట్టర్పిరాన్ జీయర్, భట్టనాద ముని అనే పేర్లతో ప్రసిద్ధి గాంచారు. మాముణుల ప్రియ శిష్యులైన అష్థ దిగ్గజములలో వీరు ఒకరు. అనేక సంప్రదాయ గ్రంధములు రాసిన పిళ్ళై లోకం జీయర్ వీరి ప్రపౌత్రులు.
మాముణులు ఒక రోజు శిష్యులందరు కూడివున్న సమయములో నమ్మాళ్వార్లకు మధురకవి ఆళ్వార్లలాగా, ఆళవందార్లకు ధైవవారి యాణ్దాన్ లాగా, శ్రీ రామానుజులకు ఎంబార్లాగా ‘దేవుమత్తరియేన్’ అని నాకు గొవింద దాసరప్పన్ (పట్టర్పిరాన్ జీయర్) మాత్రమే కైంకర్యము చేయుటకు అర్హులు అని ప్రకటించారు. శ్రీ రామానుజులతో ఎంబారు ఉన్నట్టుగా వీరు కూడా మాముణులను వీడక చాలా కాలము కైంకర్యము చేస్తూ అనేక శాస్త్ర విషయములను బాగా అవహాగన చేసుకున్నారు.
వీరు పూర్వాశ్రమములో దాదాపు 30 సంవత్సరాలు మాముణుల శేష ప్రసాదము తీసుకునేవారు. వీరిని “మోర్ మున్నార్ అయ్యర్” అని పిలిచేవారు (‘ముందుగా పెరుగన్నము తినేవారు‘ అని అర్థము). సంప్రదాయ భోజనములో ముందు కూరలు, పప్పు, పచ్చడి, చారు చివరిగా పెరుగుతో ముగిస్తారు. వీరు మాముణుల శేష ప్రసాదము తీసుకోవటము వలన మాముణులు చివరగా భుజించిన పెరుగు రుచి మారకుండా పెరుగన్నము తినేవారు.
మాముణుల శిష్యులు వారిని “భట్టనాధ మునివర అభీష్ట ధైవతం“, అనేవారు.
మాముణుల అంతిమ కాలములో అణ్ణరాయ చక్రవర్తి (తిరుమల నల్లాన్ చక్రవర్తి వంశస్తులు) తిరుమల నుండి శ్రీ రంగమునకు వేంచేసారు. శ్రీ రంగనాధుని సేవించుకొని మాముణుల వద్దకు పట్టర్పిరాన్ జీయర్ పురుషకారముతో వచ్చారు. పెరియ జీయర్ (మాముణులు) అణ్ణరాయ చక్రవర్తి తిరుమలలో చేస్తున్న కైంకర్యము గురిచి సంతోషించి “రామస్య దక్షిణొ భాహుః” అన్నట్లు పట్టర్పిరాన్ జీయర్ మాకు కుడి భుజము. వారిని ఆచార్యులుగా వరించి సంప్రదాయమునకు నాయకులుగ విలసిల్లండి అన్నారు. వారి మాట శిరసా వహించి అణ్ణరాయ చక్రవర్తి పట్టర్పిరాన్ జీయర్ వద్ద పంచ సంస్కారము పొందారు.
మాముణులు పరమపదమునకు వేంచేసే కాలములో పట్టర్పిరాన్ జీయరు తిరుమలలో వుండి చేతనోజ్జీవన గావిస్తూ ‘అంతిమోపాయ నిష్ట ‘అనే గ్రంధమును రచించారు. దానిలో ఆచార్య పరంపరలోని పూర్వాచార్యుల ఆచార్య నిష్టను తెలియజేసారు. గ్రంధ ప్రారంభములోనే ఇందులోని విషయములు మాముణులచే చెప్పబడింది. దాసుడు కేవలము కలము ద్వారా మరియు వాటిని వ్రాసినాడు అని తెలిపిరి.
మనలోను పట్టర్పిరాన్ జీయరులో లాగ ఆచార్య నిష్టను అనుగ్రహించమని వారి శ్రీ పాదాలను ఆశ్రయించి కోరు కుందాము.
పరవస్తు పట్టర్పిరాన్ జీయర్ తనియన్:
రమ్యజామాత్రుయోగీంధ్ర పాదసేవైక దారకం!
భట్టనాథ మునిం వందే వాత్సల్యాధి గుణార్ణవం!!
అడియెన్ చుడామణి రామానుజ దాసి
మూలము: https://acharyas.koyil.org/index.php/2013/06/01/paravasthu-pattarpiran-jiyar-english/
పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/2012/08/17/introduction-contd-english/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org
4 thoughts on “పరవస్తు పట్టర్పిరాన్ జీయర్”
Comments are closed.