ఎంబార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత  సంచికలో  మనము ఎంబెరుమానార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల గురించి తెలుసుకుందాము.

ఎంబార్ – మధురమంగళమ్

తిరునక్షత్రము: తై, పునర్వసు
అవతార స్థలము: మధురమంగళం
ఆచార్యులు : పెరియ తిరుమలై నంబి
శిష్యులు: పరాశర భట్టర్, వేద వ్యాస భట్టర్
పరమపదించిన ప్రదేశము : శ్రీరంగము
శ్రీ సూక్తములు: విఙ్ఙాన స్తుతి, ఎంబెరుమానార్ల వడివళగు పాశురము

గోవింద పెరుమాళ్ళు మధుర మంగళం అనే గ్రామములో కమల నయన భట్టర్, శ్రీదేవి అమ్మాళ్ దంపతులకు జన్మించిరి. వోరికి గోవింద భట్టర్, గోవింద దాసర్, రామానుజ పద చాయైయార్ అనే నామధేయములు కలవు. కానీ ‘ఎంబార్’ అనే నామధేయముతో ప్రసిద్దిగాంచిరి. ఎంబెరుమానార్లకు వీరు పినతల్లి కుమారులు, ఎంబెరుమానార్లను వారణాసి యాత్రలో యాదవ ప్రకాశుల బారి నుండి రక్షించడములో వీరు ముఖ్యపాత్రను వహించెరి.

ఎంబెరుమానార్లను రక్షించిన పిమ్మట, గోవింద పెరుమాళ్ళు యాత్రని కొనసాగిస్తూ శివ భక్తులుగా మారి కాళహస్తి నందు నివసించసాగిరి. ఎమ్పెరుమానార్లు, పెరియ తిరుమలై నంబిని తిరిగి సంస్కరించుటకై పంపిరి. పూజకు పూల కోసం గోవింద పెరుమాళ్ తోటకి రాగా, పెరియ తిరుమలై నంబి, తిరువాయ్మొళి పాశురమును “దేవన్ ఎమ్పెరుమానుక్కల్లాల్ పూవుమ్ పూశనైయుమ్ తగుమే” పాడసాగారు. భగవానుడు శ్రీమన్నారాయణ మాత్రమే ఈ పూలతో పూజించ తగినవాడు, వెరెవరు దానికి అర్హులుకారు అన్న ఈ పాశుర అర్థమును తెలుకొని, గోవింద పెరుమాళ్ళు తన తప్పుని గ్రహించి శైవ సంబంధమును విడచి పెరియ తిరుమలై నంబిని ఆశ్రయించిరి. పెరియ తిరుమలై నంబి వారికి పంచ సంస్కారములను అనుగ్రహించి, సంప్రాదాయ అర్థములను ఉపదేశించిరి. అప్పటి నుండి, గోవింద పెరుమాళ్ళు పెరియ తిరుమలై నంబితో ఉండి ఆచార్యులకు కైంకర్యములను చేయసాగిరి.

తిరుపతిలో ఉన్న పెరియ తిరుమలై నంబి వద్దకి ఎంబెరుమానార్లు వచ్చి శ్రీ రామాయణమును వారి వద్ద నేర్చుకొనిరి. ఆ సమయములో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా ఎంబార్ల గొప్పతనమును మనము తెలుసుకోవచ్చును. సంఘ్రహముగా కొన్ని:

  • ఒకరోజు, గోవింద పెరుమాళ్ళు, పెరియ తిరుమలై నంబికి పడకని సిద్ధము చేసి ఆచార్యులకన్నా ముందు తాను పడుకొన్నారు. ఎంబెరుమానార్లు అది గమనించి, పెరియ తిరుమలై నంబికి తెలియపరిచెను. నంబి గోవింద పెరుమాళ్ళను ప్రశ్నించగా, వారు ఇలా చెప్పిరి – ఆ విధముగా చేయడమువలన నాకు నరకము ప్రాప్తించునని తెలుసు, కాని ఆ పడక ఆచార్యులకు సౌకర్యముహా ఉన్నదో లేదో అని చూసాను. తన గురించి ఏ మాత్రము కలతచెందక వారి ఆచార్యుల తిరుమేని గురించి ఆలోచించిరి. ఈ సంఘటన మామునుల శ్రీసూక్తికి సంబంధించినది – దేశారుమ్ శిచ్చన్ అవన్ శీర్ వడివై ఆశైయుడన్ ణోక్కుమవన్.
  • ఒకసారి ఎంబెరుమానార్లు, గోవింద పెరుమాళ్ పాము నోటిలో నుండి ముల్లుని తీసి శరీర శుద్ది కోసం స్నానము చేయడము గమనించి, ఏమిటని అడుగగా పాము నోటిలో ముల్లుని తీసానని చెప్పిరి. ఎంబెరుమానార్లు గోవింద పెరుమాళ్ళ జీవ కారుణ్యమును చూసి సంతోషించిరి.
  • ఎంబెరుమానార్లు పెరియ తిరుమలై నంబి దగ్గర సెలవు కోరగా, నంబి ఎంబెరుమానార్లకు ఎదైనా ఒకటి ఇవ్వదలచితిమని చెప్పిరి. అప్పుడు ఎంబెరుమానార్లు నంబిని, గోవింద పెరుమాళ్ళని వారితో పంపమని అభ్యర్థించిరి. నంబి సంతోషముతో ఒప్పుకొని, తమను సేవించినట్లే ఎంబెరుమానార్లని సెవించమని గోవింద పెరుమాళ్ళకి చెప్పిరి. కాని కంచి చేరుకోగానే, తమ ఆచార్యుని ఎడబాటును తట్టుకోలేక గోవింద పెరుమాళ్ళు వారి ఆచార్యుల వద్దకి తిరిగి వచ్చిరి. పెరియ తిరుమలై నంబి గోవింద పెరుమాళ్ళని తమ తిరుమాలిగలోకి రానివ్వకుండా, ఒకసారి ఎంబెరుమానార్లకి సమర్పించిన తరువాత ఇకపై వారితోనె ఉండ వలెనని చెప్పిరి. అప్పుడు గోవింద పెరుమాళ్ళు వారి ఆచార్యుల హృదయమును గ్రహించి ఎంబెరుమానార్ల వద్దకు తిరిగివెళ్ళిరి.

శ్రీరంగము చేరిన తరువాత, గోవింద పెరుమాళ్ళ అమ్మగారి కోరిక మేరకు, ఎంబెరుమానార్లు గోవింద పెరుమాళ్ళకి వివాహము జరిపించిరి. గోవింద పెరుమాళ్ అయిష్టముగానే ఒప్పుకొని తన భార్యతో కాపురము చేయలేదు. ఎంబెరుమానార్లు , గోవింద పెరుమాళ్ళని ఏకాంతముగ ఉండమని ఆఙ్ఙాపించినారు, కాని గోవింద పెరుమాళ్ తిరిగి వచ్చి ఎక్కడైనా వారికి ఎమ్పెరుమాన్ కనిపించుచున్నారు, ఏకాంతము లేదు అనిచెప్పిరి. వెంటనే గోవింద పెరుమాళ్ళ పరిస్థితిని గ్రహించి, ఎంబెరుమానార్లు వారికి సన్యాసాశ్రమముని ఇచ్చి ఎంబార్ అనే నామధేయముని పెట్టి వారితో ఉండమని ఆఙ్ఙాపించినారు.

ఒకసారి ఎంబార్లను ఇతర శ్రీవైష్ణవులు స్తుతించగా ఎంబార్ విని ఎంతో ఆనందించిరి. ఎంబెరుమానార్లు అది గ్రహించి, శ్రీవైష్ణవుల లక్షణము అదికాదని, నైచ్యానుసంధానము (నిగర్వము) లేకుండా పొగడ్తలకు లోనుకాకూడదని తెలిపిరి. దానికి ఎంబార్ ఈ విధముగ అన్నారు, ఎవరైన తనని స్తుతించితే అది ఎంబెరుమానార్లని స్తుతించినట్లేనని, ఎందుకనగా ఎంబెరుమానార్లు వారిలో వినయవిధేయముగా చక్కద్దిరనిరి. ఎంబెరుమానార్లు అది ఒప్పుకొని ఎంబార్ ఆచార్య భక్తిని మెచ్చుకొనిరి.

ఆండాళ్ (కూరత్తాళ్వాన్ ధర్మపత్ని) భగవత్ వరప్రసాదము వలన ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చిరి, వారి నామకరణ వేడుకకి ఎంబెరుమానార్లు ఎంబారులతో కలసి వచ్చిరి. ఎంబెరుమానార్లు, ఎంబార్ని పిల్లలని తీసుకురమ్మని ఆఙ్ఙాపించగా, ఎంబార్ పిల్లలకి రక్షగా ద్వయ మహా మంత్రమును అనుసందిస్తూ వారిని తీసుకువచ్చిరి. ఎంబెరుమానార్లు పిల్లలని చూచి, ఎంబార్ ద్వారా వారికి ద్వయ మహా మంత్రోపదేశము జరిగినదని గ్రహించి, తక్షణమే ఎంబార్లని వారి ఆచార్యులుగా నియమించిరి. ఆవిధముగా పరాశర భట్టర్, వేద వ్యాస భట్టర్ ఎంబార్లకు శిష్యులైరి.

ఆకాలములో, ఎంబార్లు లౌకిక విషయ సంబంధము లేకుండా ఉండేవారు. ఎంతో భగవత్ విషయాసక్తితో ఉండేవారు. వీరు భగవత్ విషయమందు గొప్ప రసికులుగా ఉండేవారు. ఎంబార్ల భగవత్ అనుభవములు తమ వ్యాఖ్యానాలలో చాలా చోట్ల ఉటంకించబడినవి. వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాము:

  • ‘పెరియాళ్వార్ తిరుమొళి’ చివరి పాశురము, అప్పుడు శ్రీవైష్ణవులు అర్థము అడిగిరి “చాయై పోల పాడవల్లార్ తాముమ్ అణుక్కర్గళే” – వారు ఎంబెరుమానార్ల వద్ద ఈ పాశురము అర్థము వినలేదని చెప్పిరి. కాని ఎంబెరుమానార్లు పాదుకలను తమ శిరస్సుపైన పెట్టుకొని ఎంబెరుమానార్లను ఒక నిమిషము ధ్యానించి, మరు క్షణమే ఈ విధముగా చదువమని చెప్పిరి “పాడవల్లార్ – చాయై పోల – తాముమ్ అణుక్కర్గళే”, ఎమనగా – ఎవరైతే ఈ పాశురాన్ని సేవిస్తారో పెరుమాళ్ళకు దగ్గరగా ఆతడి నీడ వలె ఉందురు అని చెప్పిరి.
  • అప్పుడు ఉయ్ంత పిళ్ళై అరయర్ ‘పెరియాళ్వర్ తిరుమొళి’ 2.1 పదిగమునకు ఎలా శ్రీకృష్ణుడు అందరినీ భయపెడుతున్నారో అభినయించుచుండగా, ఇలా చూపించారు – శ్రీకృష్ణుడు తన నేత్రాలని పెద్దగా చేసి గోప బాలులను భయపడే విధంగా పెట్టిరి. కాని ఎంబార్, ఆ ప్రదర్శనని పక్కనుండి చూస్తూ శ్రీకృష్ణుడు తన శంఖ చక్రములను చూపెడితే పిల్లలు భయపడుతారుకదా అనగా, అరయర్ స్వామి దానిని అర్థము చేసుకొని అలానే చూపించారు. ఎంబెరుమానార్లు అది గమనించి ఇలా అడిఫారు “గోవింద పెరుమాళే ఇరున్తీరో” (మీరు ఆ గోష్టిలో ఉన్నారా?) – వారికి తెలుసు ఒక్క ఎంబార్ మాత్రమే ఇలా అందమైన వివరణ ఇస్తారని.
  • తిరువాయ్మొళిలోని, మిన్నిడై మడవార్గళ్ పదిగము (6.2), సన్యాసిగా ఉండి కూడా, ఎంబార్ ఆళ్వార్ తిరువుళ్ళమ్ (హృదయ భావమును) తెలిసినవారు, కావున శ్రీకృష్ణుడికి ఆళ్వార్లకి ఏ విధమైన సంబంధము ఉన్నదో తెలియచేసెను. ఆశ్చర్యములైన అర్థములని ఈ అద్భుతమైన పదిగమునకు ఇవ్వడము చూసి శ్రీవైష్ణవులందరు ఆశ్చర్యము చెందిరి. ఎలా శ్రీవైష్ణవులు ఉండాలో తెలియచేయును “పరమాత్మని రక్తః అపరమాత్మని విరక్తః” – భగవానుడికి సంబంధించినది ఎమైనా ఆనందించుము, భగవానుడికి సంబంధించనిది త్యజించుము.
  • తిరువాయ్మొళి 10.8.3 పాశుర వ్యాఖ్యానము ఒక ముఖ్యమైన సంఘటనని చూపును. ఎంబెరుమానార్లు తిరువాయ్మొళిని ధ్యానిస్తూ తన మఠములో నడుస్తూ ఉండగా, అనుకోకుండా వెనకకు తిరిగిరి. ఎంబార్ వారిని తలుపు పక్కనుండి చూస్తూ ఎంబెరుమానార్లని మీరు పాశురములోని “మడిత్తేన్” గురించి ఆలోచిస్తున్నారా అని అడిగిరి, ఎంబెరుమానార్లు దేనిగురించైతే ఆలోచిస్తున్నారో, ఎంబార్ చేసిన చిన్న పని వలన వెంటనే సత్యమును గ్రహించిరి.

ఎంబార్ చరమ దశలో ఉండగా, పరాశర భట్టర్లను సాంప్రదాయ పరిపాలనను శ్రీరంగము నుండి చేయమని ఆఙ్ఙాపించిరి. వారు అలానే భట్టర్లని “ఎంబెరుమానార్ తిరువడిగళే తన్జమ్” అని స్మరించమని చెప్పిరి. ఎంబెరుమానార్లని ధీర్ఘముగా ధ్యానము చేస్తూ, ఎంబార్ తమ చరమ తిరుమేని వదిలి పరమపదమునకు ఎంబెరుమానార్లతో కూడి నిత్య విభూతిని చేరిరి.

మనకు ఎంబెరుమానార్లు, మన ఆచార్యులకు అలాంటి అనుబంధము ఉండేలా, ఎంబార్ల శ్రీ చరణములను ప్రార్థిద్దాము.

ఎంబార్ వారి తనియన్:

రామానుజ పద ఛాయా గోవిందాహ్వ అనపాయినీ !
తదా యత్త స్వరూపా సా జీయాన్ మద్ విస్రమస్తలీ !!

రఘు వంశీ రామానుజ దాసన్

మూలము: https://acharyas.koyil.org/index.php/2012/09/07/embar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org