వేదవ్యాస భట్టర్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

azhwan_bhattars                                  పరాశర భట్టర్,  కూరత్తాళ్వాన్  మరియు వేద వ్యాస భట్టర్

తిరునక్షత్రం: వైశాఖ మాస అనూరాధా నక్షత్రం

అవతార స్థలము: శ్రీరంగం

ఆచార్యులు: ఎంబార్ (గోవిందభట్టర్)
పరమపదించన స్థలం: శ్రీరంగం

వీరు కూరత్తాళ్వాన్ (ఆళ్వాన్)కు ప్రఖ్యాతిగాంచిన తిరుక్కుమారులు మరియు పరాశర భట్టర్ కు చిన్న సోదరులు. వీరు రామ పిళ్ళై మరియు రామసూరిగా కూడ ప్రసిద్ధి చెందారు. శ్రీ భాష్య వ్యాఖ్యాన కర్త అయిన సుదర్శన సూరి (శృత ప్రకాశికా భట్టర్) వీరికి వారసులు.

పెరియ పెరుమాళ్ (శ్రీరంగనాథుడు) ప్రసాద వరం వల్ల ఆండాళ్ మరియు కూరత్తాళ్వాన్ దంపతులకు ఉభయ భట్టర్లు జన్మించిరి. ఒకసారి కూరత్తాళ్వాన్ మరియు ఆండాళ్, పెరుమాళ్ ప్రసాదం తీసుకోకుండ శయనించారు (కూరత్తాళ్వాన్ ఊంఛ వృత్తిలో ఉండి ఆనాడు వర్షం కారణంగా ధాన్యమును సంపాదించలేక పోయిరి). ఆ సమయాన వారు శ్రీరంగ దేవాలయపు అంతిమ  నైవేద్య ఘంటానాదాన్ని విన్నారు. ఆండాళ్ అప్పుడు ఎంపెరుమాన్తో “ఇక్కడ నీ భక్తుడు ప్రసాద స్వీకరణ లేకుండ ఉంటే నీవక్కడ విశేష భోగాన్ని అనుభవిస్తున్నావా” అని అన్నారు. ఇది ఆలకించిన పెరియ పెరుమాళ్  తన ప్రసాదాన్ని మిగితా సామాగ్రిని మర్యాద యుక్తంగా ఉత్తమ నంబి ద్వారా కూరత్తాళ్వాన్ మరియు ఆండాళ్కు పంపిరి. ప్రసాదం రావడాన్నిచూసిన ఆళ్వాన్ ఆశ్చర్య పడి సర్దుకొని లేచారు. వెంటనే ఆండాళ్ వైపు చూసి ‘నీవు ఎంపెరుమాన్ ను ఏమైన అభ్యర్ధించావా?’ అనగా ఆమె అంగీకరించినది.

ఆళ్వాన్ అలా ఎంపెరుమాన్ కు చేసిన అభ్యర్ధన వలన వచ్చిన ప్రసాదాన్ని చూసి కలత చెందారు. తాను రెందు దోసిళ్ళ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించి మిగితాది ఆండాళ్ కు ఇచ్చివేసారు. ఆ రెండు దోసిళ్ళ ప్రసాద ప్రభావం వల్ల కాబోలు వారికి ఇరువురు కుమారులు జన్మించారు.

ఆళ్వాన్ కు ఇరువురు కుమారులు జన్మించిన పన్నెండవ రోజున ఎంపెరుమానార్ (భగవద్రామానుజులు) ఎంబార్ మరియు మిగితా శిష్యులతో కూడి ఆళ్వాన్ గృహానికి వచ్చారు. ఆ పిల్లలిద్దరిని తీసుకరమ్మని ఎంబార్ ను  ఎంపెరుమానార్ ఆదేశిస్తారు. ఎంబార్ ఆ పిల్లలిద్దరిని తీసుకువచ్చేటప్పుడు వారికి రక్షగా ద్వయమంత్రాన్ని వారి చెవుల్లో అనుసంధిస్తూ తమ చేతులతో జాగ్రత్తగా ఎంపెరుమానార్ దగ్గరకు తీసుకువస్తారు.

ఎంపెరుమానార్ ఆ పిల్లలిద్దరి దగ్గర వస్తున్న  ద్వయ మంత్రపు విశేషాన్ని గమనించి వారికి ప్రథమంగా రక్షణ కోరిన ఎంబార్ నే వారి ఆచార్యులుగా ఉండమని ఆదేశించారు. ఎంబార్ ఆ పిల్లలిద్దరికి తమ సిద్ధాంత సూత్రములు, విశేషములు ఉపదేశించ వచ్చని ఆనందించారు.  ఎంపెరుమానార్ ఆ పిల్లలిద్దరికి, మన సనాతన ధర్మానికి  సహకారం అదించిన పరాశర మహర్షి మరియు వేదవ్యాస మహర్షుల స్మృతిగా పరాశరభట్టర్  మరియు వేదవ్యాస భట్టర్ అని నామకరణం చేశారు. ఎంపెరుమానార్ తాను ఆళవందార్ కు ఇచ్చిన ప్రతిఙ్ఞ అయిన పరాశర మహర్షి మరియు వేదవ్యాస మహర్షులకు కృతఙ్ఞతగా ఏదైన చేస్తానన్న ప్రతిఙ్ఞను ఇలా నెరవేర్చుకున్నారు.

 ఈ ఇద్దరి సోదరుల్లో పరాశర భట్టర్  ఈ సంసారాన్ని విడనాడాలి అన్న కోరికతో చాలా స్వల్ఫకాలం మాత్రమే ఉండి  పరమపదమునకు వేంచేసారు. ఆండాళ్ (భట్టరుల తల్లిగారు) భట్టర్ తాను పరమపదమునకు వెళ్ళి శ్రీ మన్నారాయణునికి  శాశ్వత కైంకర్యం చేయాలన్న కోరికను పరిగణించి అంతిమ కాలంలో ఉదారంగా ఉండి అంతిమ కర్మలను పర్యవేక్షిస్తు ఆనందంగా నిర్వహించారు. అంతిమ కర్మలను నిర్వహించిన పిదప వేద వ్యాస భట్టర్ గృహానికి తిరిగి వచ్చి తన సోదరుని వియోగ విరహం భరించలేక దుఃఖించసాగిరి. అప్పుడు ఆండాళ్, ‘పరాశర భట్టర్ పరమపదాన్ని అధిరోహించడము మీకు అసూయగా ఉన్నదా? అని నిష్ఠూరమాడినది. వేద వ్యాస భట్టర్ తన దోషమును గుర్తించి తనను తాను ఓదార్చుకొని, తన తల్లిని ప్రాధేయపడి పరాశర భట్టర్ యొక్క మిగితా ఉత్సవములను యధా విధిగా జరిపించారు.

పెరియపెరుమాళ్  వేద వ్యాస భట్టర్ ను తన సన్నిధికి పిలిపించుకొని పరాశర భట్టర్ గురించి చింతించకు, నేను నీ తండ్రిలాగా ఇక్కడ ఉన్నాగా’ అని సముదాయించారు. తరువాత  వేద వ్యాస భట్టర్ సమర్థులైన నంజీయర్ మొదలగు వారితో సాంప్రదాయము నడిపించిరి.

వ్యాఖ్యానములలో వేద వ్యాస భట్టర్ యొక్క వైభవమును తెలుపు  కొన్ని ఇతిహాసములను (ఘట్టములను) పరిశీలిద్దాము ఇక్కడ.

  • తిరుమాలై 37 – పెరియ వాచ్చాన్ పిళ్ళై గారి వ్యాఖ్యానం – ఈ పాశురంలో తొండరడిపొడి ఆళ్వార్ ఇలా చెపుతున్నారు. పెరియపెరుమాళ్ సదా మనను రక్షించు శాశ్వత బంధువు. ఈ సంబంధమును పురస్కరించుకొని వేద వ్యాస భట్టర్  తాను పరాశర భట్టర్ యొక్క వియోగాన్ని భరించ లేనప్పుడు ఈ సూత్రాన్ని స్మరించుకొని సర్వం పెరియపెరుమాళ్ పై భారం వేసి ఊరడిల్లారు.
  • ముదల్ తిరువందాది 4 –  నంపిళ్ళై మరియు  పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం – పొయిగై ఆళ్వార్ ఇలా చెపుతున్నారు – రుద్రుడు భగవద్విషయమును అగస్త్య మహర్షి, పులస్త్య, దక్ష మరియు మార్కండేయులకు (ఎంపెరుమాన్ గురించి సర్వం తనకు తెలిసిన)  వివరిస్తున్నాడు. ఈ సంఘటనను  వేద వ్యాస భట్టర్ వ్యంగ్యముగా వ్యాఖ్యానించి నప్పుడు, పరాశర భట్టర్  ఇలా అన్నారు “రుద్రుడు తనను తమోగుణం ఆవరించినప్పుడు అయోమయంలో  పడతారు, కనీసం ఇప్పుడైన రుద్రుడు భగద్విషమున నిమగ్నమై ఉన్నాడు, అతనిని ఇప్పుడు విమర్శించకు” అని అన్నారు.
  • తిరువాయ్మొళి 6.2.10 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానం – ఈ పాశురమున నమ్మాళ్వార్ తిరుమంత్రార్థమును (అష్ఠాక్షరి) చెబుతున్నారు. చాలా విశేషమైన సాంప్రదాయ రహస్యమును వెలికి తీశారు ఇక్కడ నంపిళ్ళై గారు. తిరుమంత్రార్థమును కేవలం  ఆచార్య ముఖతగానే వినాలి. ఒకసారి కూరత్తాళ్వాన్ కాలక్షేపము చెబుతున్న సమయాన ఈ పాశురార్థమును ఇలా వివరించారు – తాను తన సంతానమైన పరాశర భట్టర్ మరియు వ్యాస భట్టర్ల విషయానికి వచ్చేసరికి వారిరువురినివారి స్వాచార్యులైన ఎంబార్ దగ్గరకు వెళ్ళి ఈ తిరుమంత్రార్థమును సేవించాలని తెలిపారు. వారు వినయంగా శిరసా వహించి బయలుదేరారు.  ఆళ్వాన్  వారిని  వెనక్కు పిలచి “ఈ ప్రపంచమున అన్నీ క్షణికమే ఏదీ శాశ్వతం కాదు, మీరు మీ ఆచార్యుల దగ్గరకు చేరుకోలేక పోవచ్చు (మధ్యలో మీరిరువురుకి ఏదైన ఆటంకం జరగవచ్చు), కావున ఆ తిరుమంత్రార్థమును నేనే మీకు అనుగ్రహిస్తాను” అని అన్నారు. ఆళ్వాన్ శ్రీవైష్ణవులు ఎలా ఉండాలి అనే విషయంపై ప్రామాణికమైన  ఉదాహరణను తెలిపారు – ఆధ్యాత్మికులతో దయతో మసులుకొని ఇతరులతో దూరంగా ఉండాలి.
  • తిరువాయ్మొళి 3.2 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానం (ఉపోద్ఘాతమున) ఈ దశకమన నమ్మాళ్వార్  తిరుమాళిరుంశోలై అళగర్ విషయమున సరైన అనుభవమును చేయలేక పోయిరి. వ్యాస భట్టర్ ఈ విషయమున పరాశర భట్టర్ తో తన సందేహాన్ని ఇలా వెలిబుచ్చారు “ఏ కారణం చేత ఆళ్వార్ అంత సులువుగా గ్రాహ్యము కాని పరమపదం (చాలా చాలా దూరంగ ఉన్న) మరియు విభవ అవతారాలు (ఎప్పుడో జరిగిన) కాక మన ముందు ఉండి అతి సౌలభ్యముగా ఉన్న అర్చావతార ఎంపెరుమాన్ విషయాన చాలా ఖేదముగా ఉండి వారిని సరిగ్గా అనుభవించ లేక పోతున్నారు?”. దీనికి పరాశర భట్టర్ ఇలా సమాధానమిచ్చారు “అఙ్జానులగు జీవుల ఉజ్జీవనకై  భగవానుడు తాను ఐదురూపాల్లో (పర, వ్యూహ, విభవ, అర్చావతార మరియు అంతర్యామి) వేంచేసి ఉంటాడు. కాని భగవానుని స్వామిత్వం తెలిసిన ఙ్ఞానునకు అన్నీ రూపాలు సమానంగా కనబడతాయి. భగవానుని  కళ్యాణ గుణములన్నీ పర్వతాది పంచ రూపాల్లో సమానంగా ఉంటాయి. కాని ఆళ్వార్ తాను అళగర్ యొక్క సౌందర్యములో మునిగి పోయి భావోద్వేగముతో సంపూర్ణముగా స్వామిని అనుభవించ లేక పోయినారు”.
  • తిరువాయ్మొళి 6.7.5 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానం – ఎప్పుడైతే పరాశర భట్టర్ తాను  వైత్తమానిధి పెరుమాళ్ వేంచేసి ఉన్న తిరుక్కోళూర్ దివ్యదేశము యొక్క వనముల అందమును తెలుపుతున్నపుడు ఆళ్వార్ ఆ దివ్యదేశము యొక్క అందాన్ని    అనుభవిస్తున్నపుడు  ఆళ్వార్  మనస్సు ఎంత ప్రసన్నంగా అయినదో అనే విషయానిపై  ఎంబార్ తెలిపిన వ్యాఖ్యానమును వేద వ్యాస భట్టర్ విషయ విస్తారమునకు  పరాశర భట్టర్ కు తెలుపుతారు.
  • తిరువాయ్మొళి 7.2 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానం – ఎప్పుడైతే  ఈ ఇరువురు భట్టర్లకు పెండ్లీడు వచ్చినప్పుడు ఆండాళ్ ఈ విషయాన్ని పెరియ పెరుమాళ్ళకు తెలుపమని ఆళ్వాన్ కు చెపుతుంది. ఆళ్వాన్ దీనికి ‘ మీరెందుకు చింతిస్తారు భగవత్ కుటుంబమును గురించి?” అని అన్నారు. తాను సర్వం  ఎంపెరుమాన్ కు  పారతంత్ర్యులు, స్వప్రయత్నమే చేయని వారు. ఎప్పుడైతే ఆళ్వాన్ తాను పెరియ పెరుమాళ్ సన్నిధికి వెళ్ళినప్పుడు ఆళ్వాన్ ఏదైన   అడగాలని వచ్చారని పెరియ పెరుమాళ్  అనుకున్నారు. ఆళ్వాన్ ఇలా అన్నారు “ఇరువురి  భట్టర్లు వివాహ యోగ్యులయ్యారని అందరు అనుకుంటున్నారు”. ఆ తర్వాత ఎంపెరుమాన్ వివాహ కార్యమును ఏర్పాటు చేసారు .

ఇంత వరకు మనం వేద వ్యాస భట్టర్ యొక్క కొన్ని వైభవములను తెలుసుకున్నాము. తాను సర్వం భాగవత నిష్ఠలో ఉండి ఎంపెరుమాన్ తో సాన్నిహిత్యం కలిగి ఉన్నారు. భాగవత నిష్ఠకై అతని పాదారవిందములను ప్రార్థిస్తాము.

వేద వ్యాస భట్టర్ వారి తనియన్:

పౌత్రం శ్రీరామమిశ్రస్య శ్రీవత్సాంకస్య  నందనం |
రామసూరిం భజే భట్టపరాశారవరానుజం||

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: http://acharyas.koyil.org/index.php/2013/04/16/vedha-vyasa-bhattar-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/2012/08/17/introduction-contd-english/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org