శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
శ్రీమన్ నారాయణ రామానుజ యతిభ్యో నమః
తిరు నక్షత్రము : తై, విశాఖ
అవతార స్థలము : ఆళ్వార్ తిరునగరి
ఆచార్యులు : శ్రీ నాథమునులు
కురుగై అను నగరమున జన్మించిననందున వీరికి కురుగై కావలప్పన్ అని నామము వచ్చినది. వీరు శ్రీ నాథమునులకు అత్యంత ప్రియమైన శిష్యులు. శ్రీ నాథమునులు కాట్టుమన్నార్ కొవెళకి వచ్చిన తరువాత పెరుమాళ్ళ యందు ద్యానం చెసేవారు. ఆ సమయమున ఒక సారి కావలప్పన్ని శ్రీ నాథమునులు యోగాభ్యాసము నేర్చి వారికినూ నేర్పమనిరి. గురువు గారి ఆదేశమును అనుసరించి కావలప్పన్ గారు అష్టాంగ యోగమును నేర్చి పెరుమాళ్ళు యందు ద్యానం చెసేవారు. శ్రీ నాథమునులు పరమపదించిన తరువాత గురువు గారి సంశ్లేషనమును భరింప లేక శ్రీ నాథమునులు విడిచి పెట్టిన విమల శరిరము ఉన్న చోటున ఊంటూ గురువు గారిని ఆరాదిస్తూ, అష్టాంగ యోగమున పెరుమాళ్ళు యందు ద్యానం చెసేవారు.
మణక్కాల్ నంబి (శ్రీ నాథమునులు శిష్యులు) శ్రీ ఆళవందార్ ని కురుగై కావలప్పన్ ని ఆశ్రయించి అష్టాంగ యోగ విద్యను అభ్యశించమనిరి. శ్రీ ఆళవందార్లు వారి శిష్యులతో కలిసి కావలప్పన్ యొగాభ్యాసము చేయు చోటికి వెళ్ళినారు. కాని యోగములో ఉన్న కావలప్పన్ గారిని చూసి శ్రీ ఆళవందార్లు, వారి యోగమునకు భంగము కలుగరాదు అని శ్రీ ఆళవందార్లు అక్కడ గోడ వెనుక నిలబడిరి. వెంటనే కావాలప్పన్ గారు కళ్ళు తెరిచి ఇక్కడ శొట్టై కులము వారు ఉన్నరా అని గట్టిగా అడిగిరి. వెంటనే శ్రీ ఆళవందార్ల ముందు నిలబడి నమస్కరించి “యమునై తురైవన్” (అనగ శ్రేష్ఠమగు నాధమునుల కులము) అని చెప్పిరి. వెంటనే శ్రీ ఆళవందార్లు వెనుక నుంచన్న వారి జాడ, కావలప్పన్ ఎట్లు గ్రహించినారో అడిగిరి. దానికి కావలప్పన్ గారు తాను పెరుమళ్ళును ద్యానిస్తూ ఉండగ సాక్షాత్ తాయారులు వచ్చి పిలిచిన కదలని స్వామి ఈ వేళ నా భుజములుని కిందకు వంచి నా వెనుకకి చూస్తున్న స్వామి ని చూసి అర్దం చేసుకున్న స్వామికి ప్రియమైన శొట్టై కులము (నాథముని కులము) వారు ఎవరో ఇక్కడ వున్నారు అని.పెరుమాళ్ళ తో కావలప్పన్ కి ఉన్న సంభందము,నాథమునులు పై స్వామి కి ఉన్న అనురాగము చూసి చెలించిపోయారు శ్రీ ఆళవందార్లు.
శ్రీ ఆళవందార్లు కావలప్పన్ పాదములపై పడి తనికి కుడా అష్టాంగ యోగమును ఉపదేశంచమనిరి. శ్రీ ఆళవందార్లని పైకి లేవనెత్తి తాను ఈ శరీరమును విడిచి పెట్టే ముందు అష్టాంగ యోగమును ఉపదేశం చెస్తామని చెప్పిరి. కావలప్పన్ గారికి ఉన్న యోగ బలము చేత వారు పరమపదించే సమయమును చెప్పి శ్రీ ఆళవందార్లును ఆ సమయమునుకు వారి వద్దకు రమ్మనిరి. శ్రీ ఆళవందార్లు, కావలప్పన్ గారి దగ్గెర శెలవు తీసుకుని శ్రీరంగంమునకు వెళ్ళిరి.
ఎప్పటిలాగానే శ్రీరంగమున అధ్యయన ఉత్సవములు జరుగుచుండగ అళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయర్ (అరయర్ అనగా శ్రీరంగంన పెరుమాళ్ళకి అళ్వార్ పాశురములును శ్రుతి లయ బద్దముగ పాడుతూ అభినయము చేసేవారు). నమ్మాళ్వారుల తిరువాయ్మొళిలో ఉన్న తిరువనంతపురమున పద్మనాభ స్వామి పైఉన్న కెడుమిడర్ (10.2) పాశురమును పాడిరి. “నడుమినో నమర్గళుళ్ళీర్ నాముమక్కు అఱియచ్ చొన్నోమ్” ఓ భక్తులరా మనం అందరము తిరువనంతపురమునకు నడిచి పోదాము అనే అర్దము వచ్చే పాశురమును అరయర్ పాడిరి. ఇది విన్న శ్రీ ఆళవందార్లు పరవశించి అది పెరుమాళ్ళ అనుఙ్ఞగా భావించి తిరువనంతపురమునకు వెళ్ళిరి. అచట శ్రీ పద్మనాభ స్వామికి మంగళాశాసనమును చెసిరి. ఆ తరువాత శ్రీ ఆళవందార్లుకు సరిగ్గా ఈ రోజున కావలప్పన్ గారు తనకి అష్టాంగ యోగమును ఉపదేశం చెస్తాను అన్న రోజు అని గుర్తుకు వచ్చి బహు దుఖించి ఈ సమయుమున నాకు పుష్పక విమానము లేకపొయేను అని విలపించిరి.
అదే రోజున కావలప్పన్ గారు అష్టాంగ యోగమున వారి గురువు గారిని స్మరిస్తూ వారి ఆచార్య తిరువడిని చెరిరి.
మనం అందరమూ మన ఆచార్య పరంపరలో ఉన్న కురుగై కావలప్పన్ వంటి మహనీయులుని స్మరించుకుంటూ వారి ఆచార్య నిష్టను, భగవద్ భక్తి ని ప్రసాదించమని కోరుకుందాము.
కురుగై కావలప్పన్ వారి తనియన్
నాథముని పదాసక్తమ్ ఙ్ఞ్యానయోగాతి సమ్పదమ్|
కురుగాతిప యోగీన్ద్రమ్ నమామి శిరసా సదా||
అడియేన్ సురేష్ కృష్ణ రామానుజ దాస.
పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org
2 thoughts on “కురుగై కావలప్పన్”
Comments are closed.