ఈయుణ్ణి మాధవ పెరుమాళ్

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమతే వరవరమునయే నమ:
శ్రీవానాచల మహామునయే నమ:
nampillai-goshti1

తిరునక్షత్రము:  వృశ్చిక మాసము,  భరణి నక్షత్రము ( యతీంధ్ర ప్రవణ ప్రభావములో   హస్త అని పేర్కొనబడింది)

అవతార స్థలము:  శ్రీరంగము

ఆచార్యులు:   నంపిళ్ళై

శిష్యులు: ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ (వారి కుమారులు),

ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ (నంపిళ్ళై ప్రియ శిష్యులు), వీరినే శిరియాళ్వాన్ అప్పిళ్ళై అని కూడా అంటారు.తిరువాయ్మొళి ఈడు మహా వ్యాఖ్యానము వీరి ద్వారానే మణవాళ మాముణులకు చేరింది.

తమిళములో “ఈతల్” అనగా ఇచ్చుట అని ,“ఉణ్ణుతల్” అనగా  భుజించుటా అని అర్థము. ఈయుణ్ణి అనగా శ్రీ వైష్ణవులకు పెట్టకుండా తినని వారని అర్థము.

 నంపిళ్ళై నిరంతరము భగవధ్విషయ కాలక్షేపములో పొద్దుపుచ్చేవారు. అవి శ్రీరంగములోని  శ్రీ వైష్ణవులకు బంగారు కాలము. ప్రతి ఒక్కరు మహాచార్యులైన నంపిళ్ళై ద్వారా  భగవద్ అనుభవములో ఓలలాడారు. నంపిళ్ళై ఎంపెరుమాన్ మరియు వారి ఆచార్యులైన నంజీయర్ల కృప వలన ఆళ్వార్ల  పాశురములకు శ్రీ రామాయణము, పురాణములు, ఇతిహాసముల నుండి  ఉదాహరణలనిస్తూ వివరించేవారు.

నంపిళ్ళైకు వడక్కు తిరు వీధి పిళ్ళై  ప్రియ శిష్యులు.  పగలు నంపిళ్ళై చెప్పే తిరువాయ్మొళి కాలక్షేపము విని రాత్రిళ్ళు దానిని జాగర్తగా గ్రంధస్థము చేసేవారు. ఒక సారి నంపిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళై గృహమునకు రాగా వారు తిరువాయ్మొళి కాలక్షేపము చేసిన విషయాలు తాటాకు మీద కనబడ్డాయి. తన శిష్యుడు అక్షరము పొల్లు లోకుండా రాయ గలిగినందుకు ఎంతో సంతోషించారు. కాని తన అనుమతి లేకుండా ఈ పని చేయటము వారిని నొప్పించింది. ఈ గ్రంధమే తరువాతి కాలములో ఈడు ముప్పత్తారాయిరప్పడిగా ప్రసిధ్ధి పొందినది. తరువాత దీనిని ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళకు అందజేసి శిష్యులకు బోధించమని చేప్పారు. (ఈ చరిత్ర https://acharyas.koyil.org/index.php/2013/09/25/vadakku-thiruvidhi-pillai-telugu/ లో  చూడవచ్చు..)

ఈయుణ్ణి మాధవ పెరుమాళ్వారి కుమారులైన ఈయుణ్ణి పధ్మనాభ పెరుమాళ్ళకు, వారు తన శిష్యులైన నాలుర్ పిళ్ళైకి బోధించారు. వీరు కూరతాళ్వాన్ శిష్యులైన నాలురాన్ వారసులు.

నాలుర్ పిళ్ళై జన్మ స్థలము మేల్పాడగం (తొణ్దై నాడు), తిరు నక్షత్రము పుష్యమి. వీరిని సుమన: కోసేలర్, కోల వరాహ పెరుమాళ్ నాయనార్, రామానుజార్య దాసర్, అరుళాళర్ తిరువడి ఉన్ఱియ్అవర్ అని కూడా అంటారు. వీరి శిష్య్లులు నాలూరాచాన్  పిళ్ళై, తిరుప్పుళింగుడి జీయర్ మరియు తిరుక్కణ్ణంగుడి జీయర్.

తిరుప్పుళింగుడి జీయర్ శ్రీ వైష్ణవ చరితమనే గ్రంధమును రాశారు.

నాలూర్ పిళ్ళై కుమారులు మరియు  ప్రియశిష్యులు  నాలురాచ్చాన్ పిళ్ళై. వీరి తిరు నక్షత్రము ధనుర్మాస భరణి నక్షత్రము.

వీరినే దేవరాజాచ్చాన్ పిళ్ళై,  దేవేసర్,  దేవాధిపర్ మరియు మేల్నాడు ఆచ్చాన్ పిళ్ళై అని కూడా అంటారు.వీరి తండ్రిగారి దగ్గర  ఈడు ముప్పత్తారాయీప్పడి  నేర్చుకున్నారు. వీరి శిష్యులు తిరునారాయణ పురత్తు ఆయ్, ఇళంపిళిచై పిళ్ళై మరియు తిరువాయ్మొళి పిళ్ళై.

 నాలూర్ పిళ్ళై, నాలూరాచాన్ పిళ్ళై తిరునారాయణ పురములోనే నివాసముండేవారు.

కూర కులోత్తమ ధాసర్ ఆనతి  మేరకు  తిరువాయ్మొళి పిళ్ళై తిరువాయ్మొళిలోని  అర్థములు తెలుసుకోవటానికి కాంచీపురమునకు బయలుదేరారు. అదే సమయములో నాలూర్ పిళ్ళై, నాలూరాచ్చాన్ పిళ్ళై కూడా అక్కడకు చేరుకున్నారు. దేవ పెరుమాళ్ సన్నిధిలో అందరూ కలుసుకున్నారు. దేవ పెరుమాళ్ అర్చక ముఖముగా “పిళ్ళై లోకాచార్యులు మరెవరో కాదు,  సాక్షాత్ ఎంపెరుమానులే” అని తెలియ జేసారు. అంతే కాక నాలూర్ పిళ్ళైని ఈడు వ్యాఖ్యానమును తిరువాయ్మొళి  పిళ్ళైకి బోధించ వలసినదిగా అదేశించారు. దానికి నాలూర్ పిళ్ళై దేవపెరుమాళ్ళను ఈ వయసులో తాను ఈ పని చేయగలనా అని అడిగారు. అప్పుడు ధేవ పెరుమాళ్ మీ కుమారులు నాలూరాచాన్ పిళ్ళై మీకు సహకరిస్తారని చెప్పారు. ఆ విధముగా  తిరువాయ్మొళి పిళ్ళై అందరితో కలసి ఈడు వ్యాఖ్యానమును నాలూరాచాన్ పిళ్ళై దగ్గర అధికరించి ఆళ్వార్ తిరునగరి చేరుకొని  మణవాళ మాముణులకు అనుగ్రహించారు. మాముణులు తరవాతి కాలములో  “ఈట్టు పెరుక్కర్” గా ఖ్యాతి గాంచారు.

నాలూర్ పిళ్ళై లేక నాలూరాచ్చాన్ పిళ్ళై తిరువాయ్మొళికి, పెరియాళ్వార్ తిరుమొళికి వ్యాఖ్యానము రాసినట్లుగా చెపుతారు.

మాముణులు, తమ” ఉపదేశ రత్నమాల” లో ఈడు వ్యాఖ్యానము పరిక్రమణ  చేసిన విధమును  48, 49 పాశురములలో చక్కగా వివరించారు.
  •  48వ పాశురములో, వడక్కు తిరువీది పిళ్ళై ఈడు ముప్పత్తారాయిరప్పడి ని గ్రంథస్తము చేసినట్టుగా చెప్పారు. నంపిళ్ళై దానిని వారి నుండి తీసుకొని ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళ్కు ఇచ్చినట్టు చెప్పారు.
  •  49వ పాశురములో, ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళ నుండి, వారి కుమారులు ఈయుణ్ణి  పధ్మనాభ పెరుమాళ్ నేర్చుకొని నాలూర్ పిళ్ళై మరియు నాలూరాచ్చాన్ పిళ్ళైకి తరువాత  తిరువాయ్మొళి పిళ్ళైకి, తిరునారాయణ పురత్తు ఆయ్ కి అనుగ్రహించారని  చెప్పారు.
ఈ విధముగా ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ చరిత్ర తెలుసుకున్నాము. వీరు గొప్పఙాని నంపిళ్ళై ప్రియ శిష్యులు. వారి చరిత తెలుసు కోవటము వలన మనలోనూ భాగవత నిష్ట కలగాలని కోరు కుందాము.
ఈయుణ్ణి  మాధవ  పెరుమాళ్ళ తనియన్: 
 
లోకాచార్య పధాంభోజ సంశ్రయం కరుణాంభుధిం
వేధాంత ధ్వయ సంపన్నం మాధవార్యం అహం భజే
ఈయుణ్ణి పధ్మనాభ పెరుమాళ్ళ తనియన్:
 
మాధవాచార్య సత్పుత్రం తత్పాదకమలాశ్రితం
వాత్సల్యాధి గుణైర్ యుక్తం పధ్మనాభ గురుం భజే
నాలూర్ పిళ్ళై తనియన్ :
 
చతుర్గ్రామ కులోధ్భూతం ద్రావిడ బ్రహ్మ వేధినం
యఙ్ఞార్య వంశతిలకం శ్రీవరాహమహం భజే
నాలూరాచాన్ పిళ్ళై తనియన్:
నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే
రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే
అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://acharyas.koyil.org/index.php/2013/04/21/eeynni-madhava-perumal-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/2012/08/17/introduction-contd-english/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org