శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
ముదలాళ్వార్లు
గత సంచికలో మనము పొన్నడిక్కాల్ జీయర్ వారి వైభవమును అనుభవించాము ఇప్పుడు ఆళ్వారుల మరియు ఆచార్యుల వైభవమును అనుభవిద్దాం. దీనిలో విశేషంగా ముదలాళ్వార్ల (పొయిగై ఆళ్వార్, భూదత్తాళ్వార్ మరియు పేయాళ్వార్) వైభవమును అనుభవిద్దాము.
పొయిగై ఆళ్వార్లు
తిరునక్షత్రము: ఆశ్వీజ మాసము (ఐప్పసి), శ్రవణా నక్షత్రం (తిరువోణమ్)
అవతార స్థలము: కాంచీపురము
ఆచార్యులు: విశ్వక్సేనులు (భగవంతుని సర్వ సైన్యాధికారి)
శ్రీ సూక్తులు: ముదల్ తిరువందాది
పొయిగై ఆళ్వార్ తిరువెక్కలోని యథోక్తకారి కోవెల సమీప కొలనులో అవతరించిరి. వీరికి కాసారయోగి అని, సరోమునీంద్రులు అనే నామధేయములు కలవు.
వీరి తనియన్
కాంచ్యాం సరసిహేమాబ్జే జాతం కాసార యోగినమ్|
కలయే యః శ్రియఃపతి రవిమ్ దీపం అకల్పయత్||
భూదత్తాళ్వార్లు
తిరునక్షత్రము: ఆశ్వీజ మాసము (ఐప్పసి), ధనిష్ఠా నక్షత్రం (అవిట్టమ్)
అవతార స్తలము: తిరుక్కడల్ మల్లై (మహాబలిపురం)
ఆచార్యులు: విష్వక్సేనులు (భగవంతుని సర్వ సైన్యాధికారి)
శ్రీ సూక్తులు: ఇరండామ్ తిరువందాది
భూదత్తాళ్వార్ తిరుక్కడల్ మల్లై దివ్యదేశములోని స్థల శయన పెరుమాళ్ళ కోవెలలోని కొలనులో అవతరించిరి. వీరికి భూదహ్వయలు, మల్లాపురవరాధీశులు అనే నామధేయములు కలవు.
వీరి తనియన్:
మల్లాపుర వరాధీశం మాధవీ కుసుమోద్భవం|
భూతం నమామి యో విష్ణోర్ జ్ఞానదీపం అకల్పయత్||
పేయాళ్వార్లు
తిరునక్షత్రము: ఆశ్వీజమాసము (ఐప్పసి), శతభిషా నక్షత్రం (సదయమ్)
అవతార స్థలము: తిరుమయిలై (మయిలాపురం)
ఆచార్యులు: విష్వక్సేనులు (భగవంతుని సర్వ సైన్యాధికారి)
శ్రీ సూక్తులు: మూన్ఱామ్ తిరువందాది
పేయాళ్వార్లు తిరుమయిలైలోని కేశవ పెరుమాళ్ళ కోయిల్ వద్ద అవతరించిరి. వీరికి మహదాహ్వయులు, మయిలాపురాధీశులు అనే నామములు కలవు.
వీరి తనియన్
దృష్ట్వా హృష్టం తదా విష్ణుం రమయా మయిలాధిపం|
కూపే రక్తోత్పలే జాతం మహదాహ్వయం ఆశ్రయే||
ముదలాళ్వార్ల చరిత్ర, వైభవము:
ఈ ముగ్గురు ఆళ్వార్లను చేర్చి కీర్తించుటకు గల కారణములు:
- వీరు ముగ్గురు రోజు విడచి రోజు అవతరించిరి – ద్వాపరయుగము చివర మరియు కలియుగము ప్రారంభమున జన్మించిరి (యుగ సంధి – మార్పు కాలము – వివరణ గురించి క్రింద చూద్దాము).
- ముగ్గురు అయోనిజులు – తల్లి గర్భము నుండి కాకుండా భగవానుని అనుగ్రహముచే ముగ్గురు పుష్పముల యందు అవతరించిరి.
- పుట్టినప్పటి నుండి వీరికి భగవానునితో సంబంధము ఉండెను – భగవానుడి పరిపూర్ణమైన అనుగ్రహముచేత భగవద్గుణానుభవములో నిరంతరాయముగా జీవనమును గడిపిరి.
- వీరు ఒక సంఘటన ద్వార ఒకరినొకరు కలుసుకొనిరి. అప్పటి నుండి కలిసి జీవించి ఎన్నో దివ్యదేశములను / క్షేత్రములను దర్శించిరి. వీరిని ఈ విధముగా సంభోదించెదరు “ఓడిత్తిరియుమ్ యోగిగళ్” – ఎల్లప్పుడూ యాత్రలు చేసే యోగులు.
ఈ ముగ్గురు ఆళ్వార్లు వేరు వేరు ప్రదేశములలో జన్మించి భగవానున్ని పూర్తిగా అనుభవించిరి. భగవద్దాసులను తమ సర్వస్వముగా భావించిరి (గీతలో – జ్ఞానిత్వ ఆత్మ ఏవ మే మతమ్) కావున ఈ ముగ్గురిని ఒకేచోట చూడదలచిన భగవానుడు తిరుక్కోవలూర్ అనే దివ్యదేశములో
ఒక రాత్రి ముగ్గురు ఒకేచోట కలుసుకునేలా ఒక దైవలీలను కల్పించిరి.
చాలా పెద్ద వర్షము కురుయిచుండగా ఆ ముగ్గురు ఒకరి తరువాత ఒకరు ఒక ఆచ్చాధన వసార క్రింద చేరుకున్నారు. అప్పుడు ఆ వసారలో ముగ్గురు నిలబడుటకు మాత్రమే సరిపోవు స్థలము ఉండెను. పూర్తిగా భగవత్ భావముతో ఉండడముచేత ఒకరి గురించి మరియొకరు తెలుసుకొన్నారు. అప్పుడు వారు తమ దివ్యానుభవములను చెప్పుకొనుచుండగా భగవానుడు తిరుమామగళ్(లక్ష్మిదేవి) తో కూడి చీకటిగా ఉన్న ఆ వసారలోకి ప్రవేశించిరి. అప్పుడు ఆ ముగ్గురు తమ మధ్యలోకి ఎవరు వచ్చారో తెలుసుకొనుటకు ఇలా చేసిరి.
- పొయిగై ఆళ్వార్ ప్రపంచమనే దీపములో సముద్రమును తైలముగా చేసి సూర్యుడిని వెలుగుగా చేసి ఆ ప్రదేశమును కాంతిమయంగా చేసిరి.
- భూదత్తాళ్వార్ తన ప్రేమను దీపముగా, అనుబంధమును తైలముగా, ఙ్ఞానమును వెలుగుగా చేసి ఆ ప్రదేశమును కాంతిమయంగా చేసిరి.
- పేయాళ్వార్ మిగితా ఆ ఇద్దరి ఆళ్వారుల సహాయముతో పిరాట్టితో కూడిన భగవానుని, తిరువాళిని (చక్రం), తిరుశంఖంను దర్శించి ఆ సేర్తికి మంగళాశాసనమును చేసిరి.
ఆ విధముగా వీరు ముగ్గురూ తిరుక్కోవలూర్ స్వామిని, ఇతర అర్చావతార పెరుమాళ్ళ వైభవాన్ని ఈ లీలా విభూతిలోనే అనుభవించిరి.
నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానములో ముదలాళ్వార్ల వైభవాన్ని చాలా అందముగా వెలికి తీసెను. వాటిలో కొన్నింటిని ఇక్కడ అనుభవిద్దాము:
- ‘పాలేయ్ తమిళర్’ (1.5.11) – నంపిళ్ళై ఇక్కడ ఆళవందార్ల నిర్వాహమును (ముగింపు/వివరణ) ఉట్టంకించిరి. నమ్మాళ్వార్లు ఇలా వివరించెను, భగవానుని వైభవమును ముదలాళ్వార్లు మొట్ట మొదట మధురమైన తమిళ భాషలో కీర్తించిరనిరి.
- ‘ఇన్కవి పాడుమ్ పరమ కవిగళ్’ (7.9.6) – ఇక్కడ నంపిళ్ళై ముదలాళ్వార్లను “చెందమిళ్ పాడువార్” అని కూడా వ్యవహరించుదురని వివరించిరి. అలానే ఆళ్వార్లు తమిళములో నిష్ణాతులని కూడా వివరించిరి. పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్లు, పెరుమాళ్ళను కీర్తించమని భూదత్తాళ్వార్లని అడుగగా – ఎలాగైతే ఆడ ఏనుగు తేనెను కోరిన వెంటనే మగ ఏనుగు తెచ్చునో అలా వారు వెంటనే భగవానుని కీర్తిని పాడిరి (ఈ ఏనుగుల సంఘటనను భూదత్తాళ్వార్ తన ఇరండామ్ తిరువందాది – 75 వ పాశురము “పెరుగు మదవేళమ్” లో వివరించిరి).
- ‘పలరడియార్ మున్బరుళియ’ (7.10.5) పాశురము నందు నంపిళ్ళై అందముగా నమ్మాళ్వార్ల తిరువుళ్ళమును వెలికి తీసిరి. ఈ పాశురములో నమ్మాళ్వార్లు ఈ విధముగా చెప్పుచున్నారు – భగవానుడు మహాఋషులైన శ్రీవేదవ్యాసులు, శ్రీవాల్మీకి, శ్రీపరాశరులు సంస్కృతమున, ముదలాళ్వార్లు తమిళములో మహానిష్ణాతులైనప్పటికి వారికి తిరువాయ్మొళిని పాడుటకు అనుగ్రహించకుండా తమకు మాత్రమే ఆ కైంకర్యమును అనుగ్రహించారని ఆనంద పడిపోయారు.
- ‘చెన్చొర్కవికాళ్’ (10.7.1) అనే పాశురములో – నంపిళ్ళై ముదలాళ్వార్లని గూర్చి “ఇన్కవి పాడుమ్ పరమ కవిగళ్”, “చెందమిళ్ పాడువార్” మొదలగు పాశురముల ప్రమాణమును అనుసరించి వారిని అనన్య ప్రయోజనులు (ఎటువంటి ప్రయోజనము ఆశించకుండా భగవానుని కీర్తించేవారు) అని గుర్తించిరి.
మాముణులు ‘ముదలాళ్వార్లు’ అనే సంబోధన ఎలా వచ్చినదో తన ఉపదేశ రత్న మాలలో 7వ పాశురమున ఇలా వివరించిరి.
మఱ్ఱుళ్ళ ఆళ్వార్గళుక్కు మున్నే వందుదిత్తు
నల్ తమిళాల్ నూల్ శెయ్దు నాట్టై ఉయ్ త్త – పెఱ్ఱిమైయోర్
ఎన్ఱు ముదలాళ్వార్గళ్ ఎన్నుమ్ పేరివర్ క్కు
నిన్ఱతులగత్తే నిగలళ్ందు|
సాధారణ అనువాదము: ఈ ముగ్గురు ఆళ్వార్లు మిగిలిన ఏడుగురు ఆళ్వారుల కన్నా ముందే దివ్యమైన తమిళ పాశురములతో ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించిరి. ఈ కారణముచే వీరు ముదలాళ్వార్లుగా విఖ్యాతిగాంచిరి.
పిళ్ళైలోకమ్ జీయర్ వ్యాఖ్యానములో కొన్ని మధురమైన విషయాలు:
- ప్రణవము ఎల్లప్పుడూ ఆరంభమును సూచించడం వల్ల ముదలాళ్వార్లలను ప్రణవముగా భావించిరి .
- ముదలాళ్వార్లు ద్వాపర – కలియుగ సంధిలో అవతరించిరని, తిరుమళిశై ఆళ్వార్ కూడా ఇదే సమయములో అవతరించిరని, కలియుగం ఆరంభమైన తరువాత మిగలిన ఆళ్వార్లు ఒకరి తరువాత మరొకరు అవతరించిరని చెప్పిరి.
- వీరు దివ్య ప్రబంధమునకు ద్రావిడ భాషలో ఆరంభ పునాదిని వేసిరి.
మాముణులు ఐప్పసి – తిరువోణమ్ (శ్రవణం), అవిట్టమ్ (ధనిష్ట), శదయమ్ (శతభిషం) ఈ మూడు నక్షత్రాలకు ప్రాధాన్యత ముదలాళ్వార్లు అవతరించిన తరువాతనే కలిగినదని చెప్పిరి.
పెరియ వాచ్చాన్ పిళ్ళై తిరునెడుంతాండగము అవతారికా వ్యాఖ్యానములో ముదలాళ్వార్లకు భగవానుడు తమ పరత్వమును చూపిరి అని చెప్పెను. అందువలన వారు మాటి మాటికి త్రివిక్రమావతారమును కీర్తించిరి. వీరికి సహజముగానే అర్చావతారముతో గొప్ప అనుబంధము కలిగి ఉండడం చేత అర్చావతార కీర్తిని పాడిరి. వీరి అర్చావతార అనుభవమును ఇది వరకే ఇక్కడ వివరించ బడినది. http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-azhwars-1.html.
యుగ సంధి: ‘యతీంద్ర మత దీపిక’ అను గ్రంథము సంప్రదాయములోని ఎన్నో సాంకేతికపరమైన అంశములను వివరించినది. దీనిని మన సిద్ధాంతమునుకు పరమ ప్రామాణికమైన గ్రంథముగా పరిగణిస్తారు.
ఇందులో కాల తత్త్వము, వివిధ యుగములు, వాటి సంధికాలముల గురించి వివరముగా చెప్పబడినది.
- దేవతల 1 రోజు (స్వర్గములో) మానవుల (భూమి) 1 సంవత్సరంమునకు సమానము .
- 1 చతుర్యుగము 12000 దేవసంవత్సరములతో కూడినది – (కృత – 4000, త్రేతా – 3000, ద్వాపర – 2000, కలి – 1000).
- బ్రహ్మకు ఒక రోజు 1000 చతుర్యుగములకు సమానము. వారి రాత్రి సమయము కూడా ఉదయమునకు సమానమే కాని అప్పుడు సృష్టి ఉండదు. ఇలా 360 రోజులు ఒక బ్రహ్మ సంవత్సరము. బ్రహ్మదేవుడు 100 బ్రహ్మ సంవత్సరము జీవించును.
- ఒక్కొక్క యుగములో సంధికాలము దీర్ఘముగా ఉండును. ఇక్కడ ప్రతి యుగములోని సంధి కాలమును చూద్దాము :
- కృత, త్రేతా యుగములకు సంధి కాలము 700 దేవ సంవత్సరములు.
- త్రేతా, ద్వాపర యుగములకు సంధి కాలము 500 దేవ సంవత్సరములు.
- ద్వాపర, కలియుగములకు సంధి కాలము 300 దేవ సంవత్సరములు.
- కలి తరువాత మళ్ళీ వచ్చు కృతయుగమునకు సంధి కాలము 500 దేవ సంవత్సరములు.
అదే విధముగా బ్రహ్మ ఒక రోజులో 14 మనువులు, 4 ఇంద్రులు, 14 సప్త ఋషులు ఆయా పదవుల యందు పునరావృతం అవుతారు (వారి కర్మానుసారం ఇలా ఆయా జీవాత్మలు ఈ పదవిలను పొందుతారు)
అడియేన్ రఘు వంశీ రామానుజ దాస
మూలము: https://acharyas.koyil.org/index.php/2012/10/22/mudhalazhwargal-english/
పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org
10 thoughts on “ముదలాళ్వార్లు”
Comments are closed.