శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
ఎంగళాళ్వాన్ శ్రీ చరణములందు నడాతూర్ అమ్మాళ్
తిరు నక్షత్రము : చైత్ర మాసము, రోహిణి
అవతార స్థలము : తిరువెళ్ళరై
ఆచార్యులు : ఎమ్పెరుమానార్, తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్
శిష్యులు : నడాదూర్ అమ్మాళ్
పరమపదము చేరిన ప్రదేశము : కొల్లన్ కొండాన్ (మధురై దగ్గర)
శ్రీ సూక్తులు : సారార్త చతుష్టయము (వార్తామాలైలో భాగము), విష్ణు చిత్తీయము (విష్ణు పురాణమునకు వ్యాఖ్యానము)
తిరువెళ్ళరైలో జన్మించిరి, వారి తల్లితండ్రులు శ్రీ విష్ణుచిత్తర్ అను పేరును పెట్టిరి. వీరు ఎమ్పెరుమానార్లకు శిష్యులై భగవత్ విశయము మరియు శ్రీ భాష్యమును తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్ళాన్ వద్ద సేవించిరి. ఎమ్పెరుమానార్ స్వయముగా ఎంగళాళ్వాన్ అను పేరును అనుగ్రహించి నట్టుగా చెప్పబడును (కారణము వీరు కూరత్తాళ్వాన్ వలె ఙ్ఞానము, భక్తి, ఆచార్య నిష్ఠ మొదలగు గుణములను కలిగి ఉండడము చేత,).
నడాదూర్ అమ్మాళ్ (వాత్స్య వరదాచార్యర్) వీరికి ముఖ్యమైన శిష్యులు మరియు నడాదూర్ ఆళ్వాన్లకు మనుమడు (వీరు ఎమ్పెరుమానార్ శిష్యులు). నడాదూర్ అమ్మాళ్ శ్రీభాష్యము అధ్యాపనమునకు పితామహులు అయిన నడాదూర్ ఆళ్వాన్ను ఆశ్రయించగా, వారు వయో భారము చేత ఎంగళాల్వాన్నుఅశ్రయించమనిరి. అమ్మాళ్ ఎంగళాల్వాన్ తిరుమాళిగను చేరి, ద్వారమును తట్టగా, ఎంగళాల్వాన్ “వచ్చినది ఎవరు” అని అడుగగా, అమ్మాళ్ “నేను వరదన్” అని సమాధానము ఇచ్చారు. అప్పుడు ఎంగళాల్వాన్ అమ్మాళ్ను” ‘నేను’ అనేది నశించిన తరువాత రమ్మ” ని అన్నారు. అమ్మాళ్ పితా మహులను చేరి జరిగిన వృత్తాంతము తెలియజేయగా, వారు “నేను” అని స్వపరిచయము చేసుకొనుట అహంకార పూరితము కావున, “అడియేన్” అని వినమ్రముగా అహంకార రహితముగ చేయవలెను అని ఆదేశించిరి. అమ్మాళ్ మరల ఎంగళాల్వాన్ తిరుమాళిగను చేరి, ద్వారమును తట్టగా, వారు “వచ్చినది ఎవరు” అని అడుగగా, అమ్మాళ్ “అడియేన్ వరదన్ దాసన్” అని సమాధానము ఇచ్చిరి. ఈ సమాధానముతో తృప్తి చెందిన ఎంగళాల్వాన్, అమ్మాళ్ను స్వాగతించి, శిష్యునిగా స్వీకరించి, వారికి సాంప్రదాయ రహస్యములను విశదీకరించిరి. అమ్మాళ్ శ్రీవైష్ణవ సాంప్రదాయ విశిష్ఠులుగా ప్రసిద్ది చెందడముతో, వారి అచార్యులు అయిన ఎంగళాల్వాన్ “అమ్మాళాచార్యులు” గా కొనియాడబడిరి.
ఎమ్పెరుమానార్ పరమపదమునకు చేరు చివరి దశలో, ఎంగళ్ ఆళ్వాన్లను తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ వద్దకు వెళ్ళమని ఆఙ్ఞాపించిరి.
మన వ్యాఖ్యానములలో, ఎంగళ్ ఆళ్వాన్ లకు సంభందించిన కొన్ని ముఖ్యమైన విషయములను ఇక్కడ చూద్దాము.
మన వ్యాఖ్యానములలో, ఎంగళ్ ఆళ్వాన్లకు సంభందించిన కొన్ని ముఖ్యమైన విషయములను ఇక్కడ చూద్దాము.
- పెరియాళ్వార్ తిరుమొళి 2.9.10 – తిరువాయ్మొళి పిళ్ళై వ్యాఖ్యానము – ఈ పాశురములో పెరియాళ్వార్ కణ్ణన్ ఎమ్పెరుమాన్ కి నేరేడు పండు అంటే ఇష్టము అని విశదపరిచిరి . ఈ సంభందముతో, ఎన్గళాళ్వాన్ లకు కలిగిన ఒక సంఘటనను నంజీయర్ తెలియపరిచిరి. ఎన్గళాళ్వాన్ లకు నిద్రకు ఉపక్రమించే సమయములో ఒక కల వచ్చినది. ఆ కలలో ఒక బాలుడు ఎన్గళాళ్వాన్ లను ఒక నేరేడు పండు ఇవ్వమని అడిగిరి. అప్పుడు ఎన్గళాళ్వాన్ ఆ బాలుడిని మీరు ఎవరు అని అడుగగా “నేను ఆయర్ దేవు – నంజీయర్ కూమారుడు” (ఆయర్ దేవు నంజీయరుల తిరువారాదన మూర్తి పేరు ) అని చెప్పిరి. ఎన్గళాళ్వాన్ నంజీయర్ వద్దకి వెళ్ళి మీ యొక్క తిరువారాదన పెరుమాళ్ మాకు నిద్ర లేకుండ చేస్తున్నారని చెప్పగ, నంజీయర్ వారి తిరువారాదన గది వద్దకి వెళ్ళి వారి ఎమ్పెరుమానులని నిద్రకి ఆటంకము కలిగించవద్దని చెప్పెరి.
- ముదల్ తిరువందాది 44 – నంపిళ్ళై / పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములు – ఈ పాశురములో, పొయిగైయాళ్వార్ ఎమ్పెరుమాన్ వారి ప్రియమైన భక్తులకు నచ్చు విధముగా వివిద నామములను మరియు రూపములను దరించునని తెలిపిరి. అటువంటి సంఘటనని ఇక్కడ వివరించిరి. ఎమ్పెరుమాన్ స్వయముగా ఎన్గళాళ్వానులకు నంజీయర్ ( ఆయర్ దేవు) పెట్టిన పేరుని చెప్పిరి. ఆ సంఘటనని విన్న ఎన్గళాళ్వాన్, నంజీయర్ ఇద్దరూ పారవశ్యముని చెందిరి.
వార్తా మాలైలో, ఎన్గళాళ్వానులకు సంభందించిన కొన్ని ఐదిహ్యములను ఇక్కడ చూద్దాము:
- 17 – అమ్మంగి అమ్మాళ్ ఎన్గళాళ్వాన్ వద్దకి వెళ్ళి సాంప్రదాయముని గురించి పూర్తిగా తెలుపని అడుగగా, ఎన్గళాళ్వాన్ వారికి సారార్త చతుష్టయము (4 ముఖ్యమైన మరియు తప్పనిసరియైన సూత్రములని) వివరించిరి. అవి:
- స్వరూప ఙ్ఞ్యానము
- స్వరూప యాతాత్మ్య ఙ్ఞానము
- విరోది ఙ్ఞానము
- విరోది యాతాత్మ్య ఙ్ఞానము
- పల ఙ్ఞానము
- పల యాతాత్మ్య ఙ్ఞానము
- ఉపాయ ఙ్ఞానము
- ఉపాయ యాతాత్మ్య ఙ్ఞానము
- 118 – ఎన్గళాళ్వాన్ నడాతూరమ్మాళ్ కూ చరమ శ్లోకములోని “సర్వ ధర్మాన్ పరిత్యజ్య” అర్థమును అనుగ్రహించుచండగా – నడాతూర్ అమ్మాళ్ ఆశ్చర్యముతో ఎందుకు ఎమ్పెరుమాన్ శాస్త్రములో చెప్పిన అన్ని దర్మములను (ఉపాయములను) ప్రక్కకి పెట్టి తన స్వాతన్త్రియమును గురించి చెప్పుచున్నాడని అడిగెను. అప్పుడు ఎన్గళాళ్వాన్ అది భగవాన్ యొక్క నిజమైన స్వభావము అని చెప్పిరి – వారు సర్వ స్వతంత్రులు – అందువలన అది వారికి అలా చెప్పుటకు యుక్తమైనది. అదికాకుండా, ఎమ్పెరుమాన్ జీవాత్మకు స్వభావ విరుద్దమైన ఉపాయములమునుండి ఉపశనమును కలిగించును – కారణము జీవాత్మ పుర్తిగా భగవంతుడిపై ఆదారపడిఉండును ,ఆందువలన జీవాత్మ భగవానుడిని ఉపాయముగా స్వీకరించవలెను. ఆ విధముగా, ఎన్గళాళ్వాన్ భగవానుడి వివిదములైన ఉపదేశములను ఇక్కడ వివరించెను.
- 153 – ఇందులో ఎన్గళాళ్వాన్ చాలా అందముగా ఆచార్యుల యొక్క గుణములను వెలికితీసెను. ఆచార్యులు అనగా ఎవరైతే శరీరము ఆత్మను వదిలి, ఎమ్పెరుమాన్ కి పూర్తి దాసుడిగా తలిచి, ఇతర దేవతా సంభదమును వదిలివేసి, అలానే ఎమ్పెరుమాన్ సర్వాంతర్యామిగా గుర్తించి, ఈ ప్రపంచములో తన యొక్క సమయమును అర్చావతార ఎమ్పెరుమానును ఆరాదిస్తూ చివరగా పరమపదమును చేరవలెను.
- ఒక సారి పిన్భళగియ పెరుమాళ్ జీయర్ అనారోగ్యము పాలైనారు. అప్పుడు వారు తన శిష్యులను చూసి తను త్వరగా కోలు కోవాలని పెరుమాళ్ళను ప్రార్థించమని అడిగారు. శ్రీవైష్ణవులేవరూ అలా కోరుకోరు. ఇది తెలిసి నంపిళ్ళై శిష్యులను పంపి విషయమేమిటో తెలుసుకోవాలనున్నారు. నంపిళ్ళై మొదట సకల శాస్త్ర పారంగతులైన ఎంగళాళ్వాను యొక్క అభిప్రాయమును తెలుసుకోవాలని శిష్యులను వారి దగ్గరికి పంపారు. ఎంగళాళ్వాన్ దానికి “వారు బహుశా శ్రీరంగముతో ఉన్న సంభందము వలన అలా అన్నరేమో” అని తన అభిప్రాయాన్ని తెలియజేసారు. నంపిళ్ళై శిష్యులను తిరునారాయణపురతు అరయర్ దగ్గరికి పంపారు. దానికి – అరయర్ “పూర్తి కావలసిన పనులేవైనా మిగిలిపోయాయేమో! అందుకనే వారు ఈ లోకములో ఇంకా కొంతకాలము ఉండాలనుకుంటున్నారేమో” అన్నారు. నంపిళ్ళై ఈ సారి అమ్మంగి అమ్మాళ్ దగ్గరికి శిష్యులను పంపారు. వారు “నంపిళ్ళై కాలక్షేప గోష్టిని వదల లేక అలా అన్నారేమో” అని బదులిచ్చారు. నంపిళ్ళై, పెరియ ముదలియార్ దగ్గరికి శిష్యులను వెళ్ళమన్నారు. నంపెరుమాళ్ళతో ఉన్న అనుబంధము వలన వారిని వీడి వెళ్ళటానికి ఇష్టపడటం లేదేమో” అన్నారు . నంపిళ్ళై చివరగా జీయరునే కారణమడగగా, “పైవేవీ కారణాలు కావు. తమరికే తెలుసు. అయినా కృపతో అడుగుతున్నారు. తమరు ప్రతి రోజు స్నానము చేసిన తరువాత తమ దివ్య దర్శనము చేసుకొని వీవెన వీయటము ఇత్యాది కైంకర్యములను చేస్తూ వుంటాను కదా? పరమ పదము కోసము వాటిని ఎలా వదులు కోగలను?” అన్నారు. పిన్భళగియ పెరుమాళ్ జీయర్ ఉత్తమ శిష్యులు తమ ఆచార్యుల పట్ల చూపవలసిన అభిమానమును ఈ విధముగా ఆచరించి చూపారు. ఇది విన్న వారందరూ జీయరుకున్న ఆచార్య భక్తికి మురిసి పోయారు. ఈ సూత్రమును పిళ్ళై లోకాచార్యులు తమ శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రములో (సూత్రము 333) మరియు మణవాళ మాముణులు ఉపదేశ రత్తిన మాలై (పాశురము 65 అన్డ్ 66) లో చెప్పిరి. ఈ విధముగా కొన్ని దివ్యమైన సంఘటనలను ఇక్కడ ఎన్గళాళ్వాన్ జీవితములోనివి తెలుసు కొంటిమి. వీరు పూర్తిగా భాగవత నిష్ఠ యందు ఉండి ఎమ్పెరుమానార్ ఇష్టులుగా ఉండిరి. మనమూ వారి శ్రీ చరణములను అటువంటి భాగవత నిష్ఠ కలిగేలా అనుగ్రహించమని ప్రార్దిస్తాము.
ఎన్గళాళ్వాన్ తనియన్
శ్రీవిష్ణుచిత్త పద పంకజ సమాశ్రయాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ
నోచేన్ మమాపి యతిశేకరభారతీనామ్ భావః కతమ్ భవితుమర్హతి వాగ్విదేయః
అడియేన్ రఘు వంశీ రామానుజదాసన్
మూలము : http://acharyas.koyil.org/index.php/2013/04/04/engalazhwan-english/
పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org