శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
వేదాంతదేశికులు, తిరువల్లిక్కేణి (ట్రిప్లికేన్)
శ్రీమాన్ వేంకటనాథార్య కవితార్కిక కేసరీ |
వేదాంతాచార్య వర్యోమే సన్నిధత్తాం సదా హృది ||
ఎవరైతే కవులకి (వ్యతిరేఖులకు) ప్రతివాదులకు సింహము వంటి వారో, ఙ్ఞాన భక్తి , వైరాగ్యములకు ఆవాసమైన శ్రీ వేంకటనాథార్యులు (వేదాంతదేశికులు) సదా నా హృదయములో నివసింతురు గాక.
అవతార వివరములు
జన్మించినప్పుడు నామము | వేంకటనాథులు |
అవతార సంవత్సరం | కలియుగ ఆరంభం నుండి 4370 (1268 AD)సంవత్సరములు |
మాసం మరియు తిరునక్షత్రం | ఆశ్వీజ మాస శ్రవణా నక్షత్రం (తిరువేంగడ ముడయాన్ వలె) |
అవతార స్థలం | తిరుతంగా,కాంచీపురం |
గోత్రం | విశ్వామిత్ర |
అవతారం | తిరువేంగడ ముడయాన్ యొక్క దివ్య ఘంట(తమ సంకల్ప సూర్యోదయం అను గ్రంథంలో ప్రస్తావించారు) |
జననీజనకులు | తోతాంరంబ మరియు అనంతసూరి |
అవతార సమాప్తికి వీరు వయస్సు | శత సంవత్సరములు. శ్రీరంగం నుండి ఈ విభూతి యందు అవతార సమాప్తి-కలియుగ సంవత్సరం 4470 (1368 AD) |
వీరికి శ్రీ రంగనాథుడు “వేదాందాచార్యులు”అని, “కవితార్కిక కేసరి” మరియు శ్రీ రంగనాయకి” సర్వతంత్ర స్వతంత్రులు” అని బిరుదులను అనుగ్రహించారు.
వీరి కుమారులు ‘వరదాచార్యులు’. వరదాచార్యుల శిష్యులు ‘బ్రహ్మతంత్ర స్వతంత్ర జీయర్’.
కిడాంబి ఆచ్చాన్ యొక్క మనుమడగు కిడాంబి అప్పులార్, శ్రీ నడాదూర్ అమ్మాళ్ యొక్క శిష్యుల్లో ఒకరు.
“అప్పుళ్” అను పదం ‘తిరువిరుత్తం’లో మూడు సార్లు గరుడ గురించి సూచించబడినది. గరుడకి ఉన్న లక్షణాలు వీరి యందు ఉన్నవి కాన వీరికి ‘అప్పులార్’ అను పేరు ఆపాదించబడింది. ఇంకొక పేరు కూడ ఉన్నది అది – ‘వాదిహంసాబువాహర్’ అనగా ప్రతివాదిని పరాజయం పొందించువారు – ఈ నామం శ్రీ రామానుజులు అనుగ్రహించారు.
ఈ కిడాంబి అప్పులార్ యొక్క మేనల్లుడే ప్రసిద్ధిగాంచిన వేదాందాచార్యులు .
పిన్న వయస్సులో వేదాందాచార్యులు తన మేనమామతో (కిడాంబి అప్పులార్) తో కలసి నడాదూర్ అమ్మాళ్ యొక్క కాలక్షేప గోష్ఠికి వెళ్ళేవారు. ఆ సమయమున వేదాందాచార్యులను ఉద్ధేశిస్తూ నడాదూర్ అమ్మాళ్ ‘విశిష్ఠాద్వైత శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి ఉన్న అన్నీ ప్రతికూలతలను నిర్మూలించి గొప్ప సిద్ధాంతమును స్థాపిస్తారు’ అని మంగళాశాసనం అనుగ్రహించారు.
గ్రంథములు
నడాదూర్ అమ్మాళ్ యొక్క ఆశ్వీరాద బలం వల్ల వేదాందాచార్యులు అసంఖ్యాక గ్రంథములను రచించారు మరియు విశిష్ఠాద్వైత సిద్ధాంతానికి వ్యతిరిక్తతో ఉన్న ప్రతివాదులను మరియు తత్త్వవేత్తలను వాదంలో జయించారు.
శ్రీ వేదాందాచార్యులు శతాధిక గ్రంథ కర్త. ఇవి సంస్కృతములో, ద్రావిడములో మరియు మణిప్రవాళ (సంస్కృత తమిళ మిళితం) భాషలలో ఉన్నవి.
కొన్ని అతి ముఖ్య గ్రంథములు
- తాత్పర్య చంద్రిక – గీతా భాష్య వ్యాఖ్యానం
- తత్త్వటీక – శ్రీ భాష్యమునకు వ్యాఖ్యానం
- న్యాయ సిద్ధాంజనం – సాంప్రదాయ తత్త్వ విశ్లేషణా గ్రంథం
- శత దూషణి – అద్వైత సిద్ధాంత ఖండనా వాదన గ్రంథం
- అధికర్ణ సారావళి – శ్రీ భాష్యంపై ఒక వ్యాఖ్యాన గ్రంథం
- తత్త్వ ముక్తాకఫలం – తత్త్వనిరూపణ – సర్వార్థ సిద్ధి వ్యాఖ్యానం
- గద్యత్రయం మరియు స్తోత్ర చతుశ్లోకిలపై సంస్కృత భాష్యం
- సంకల్ప సూర్యోదయం – నాటకం
- దయాశతకం, పాదుకా సహస్రం, యాదావాభ్యుదయం, హంస సందేశం
- రహస్యత్రయ సారం, సాంప్రదాయ పరిశుద్ధి, అభయ ప్రధాన సారం, పరమత భంగం
- మునివాహన భోగం – అమలనాదిపిరాన్పై వ్యాఖ్యానం
- ఆహార నియమం – ఆహార నియమాలు సూచించ బడ్డాయి – తమిళంలో
- స్తోత్రాలు – దశావతార స్తోత్రం, గోదాస్తుతి, శ్రీస్తుతి, యతిరాజ సప్తతి, హయగ్రీవ స్తోత్రం మొదలైనవి
- ద్రమిడోపనిషత్ తాత్పర్య రత్నావళి, ద్రమిడోపనిషత్ సారం- తిరువాయ్మొళి అర్థ సంగ్రహం
పుత్తూర్ స్వామి యొక్క ప్రచురణ అయిన ‘మాలర్’ నుండి అధిక మొత్తంలో విషయ సంగ్రహం చేయబడింది.
కాంచీపురమునకు సమీపాన ఉన్న తూప్పిల్లోని అవతార ఉత్సవ చిత్రం
వేదాందాచార్యులు మరియు ఇతర ఆచార్యులు
వేదాందాచార్యులు, పిళ్ళై లోకాచార్యులను కీర్తిస్తు ఒక విశేషమైన గ్రంథమును రచించారు దాని పేరు “లోకాచార్య పంచాశత్”.
వేదాన్తాచార్యులు, పిళ్ళై లోకాచార్యుల కన్నా కనీసం 50 సంవత్సరములు పిన్న వయస్కులు. పిళ్ళై లోకాచార్యుల యందు వేదాందాచార్యులకు చాలా అభిమానం ఈ విషయం మనకు ఈ గ్రంథ పరిశీలనలో సులభంగా తెలుస్తుంది. ఈ గ్రంథం ఈ నాటికి నిత్యము తిరునారాయణ పురం (మేల్కోటే) లో పఠింప బడుతుంది.
లోకాచార్య పంచాశత్ గ్రంథమును శ్రీ. ఉ. వే. T. C. A. వేంకటేశన్ స్వామివారు సంక్షిప్తంగా ఆంగ్ల భాషలో అనువదించారు. దీనిని ఈ సైట్లో చూడవచ్చు: http://acharya.org/books/eBooks/vyakhyanam/LokacharyaPanchasatVyakhyanaSaram-English.pdf.
- వాదికేసరి అళిగియ మణవాళ జీయర్ తమ ‘తత్త్వదీప’అను గ్రంథమున మరియు ఇతరులు వేదాందాచార్యుల గ్రంథములను ప్రస్తావించారు.2.
- శ్రీ మణవాళ మాముణులు తత్త్వ త్రయం మరియు ముముక్షుపడి (పిళ్ళై లోకాచార్య ప్రణీతం) వ్యాఖ్యానము లందు వేదాందాచార్యులను ప్రస్తావించారు. మణవాళ మాముణులు తాము వేదాందాచార్యులను ‘అభియుక్తర్’ అని అభిమానంగా ప్రస్తావించారు.3.
- శ్రీ మణవాళ మాముణుల అష్ఠ దిగ్గజములలోని ఒకరైన శ్రీ ఎరుంబియప్ప తమ ‘విలక్షణ మోక్షాధికారి నిర్ణయం’ లో వేదాందాచార్యుల ‘న్యాయ వింశతి’ గ్రంథమును ప్రస్తావించి దీనికి సారాంశమును అనుగ్రహించారు.3.
- చోళ సింహపుర (ఘటికాచలం/షోళింగర్) స్వామి దొడ్డయాచార్యులు, వేదాందాచార్యుల ‘శతదూషణి’ కి ‘చందామృతం’ అను వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. దీనిలో తాము ‘చందామృతం దొడ్డయాచార్యులు’ అని పేర్కొన్నారు, అలాగే తమ తర్వాత వచ్చిన ఆచార్యులు కూడ దీనిని ప్రస్తావించారు.
- ప్రతివాది భయంకర అణ్ణా మరియు వారి శిష్యులు వేదాందాచార్యుల యందు భక్తి భావమును కలిగే ఉండేవారు. వీరు వంశస్థులు తిరువిందళూర్ మరియు దక్షిణ మధ్య ప్రాంతమున నివసించేవారు. వేదాందాచార్యుల కుమారుడైన నాయనాచార్యుల యందు భక్తిని కల్గి ఉండేవారు.
- చాలా మంది విద్వాంసులు మరియు ఆచార్యులు వేదాందాచార్యుల గ్రంథములను అక్కడక్కడ ఉట్టంకించారు.
దొడ్డయాచార్యుల శిష్యుడైన నరసింహ రాజాచార్యులు, వేదాందాచార్యుల ‘న్యాయ పరిశుద్ధి’ పై వ్యాఖ్యాన్నాన్ని రచించారు.
19 వ శాతాబ్ధానికి చెందిన మైసూర్ (మాండ్య) అనంతాళ్వాన్ చాలా చోట్ల వేదాందాచార్యుల గ్రంథములను తమ రచనలలో ప్రస్తావించారు.
19 వ శతాబ్ధానికి చెందిన కాంచీపుర వాసులు కున్ఱప్పకం స్వామి తమ రచన అయిన ‘తత్త్వ రత్నావళి’ లో వేదాందాచార్యుల మీద ఉన్న భక్తి అభిమానంతో వారిని “జయతి భగవాన్ వేదాంత రహస్య తార్కిక కేసరి” అని సంబోధించారు.
- వేదాందాచార్యులు పూర్వాచార్యుల మరియు సమకాలీన ఆచార్యుల యందు అధికమైన ప్రీతిని కలిగి ఉండేవారు. ఈ విషయం మనకు వారి “అభీతి స్తవం”లో ‘క్వచన రంగముఖే విభో! పరస్పర హితైషిణమ్ పరిసరేషు మామ్ వర్తయ” (హే ! శ్రీ రంగనాథ! నన్ను పరస్పర శ్రేయోభిలాషులగు శ్రీరంగనివాసుల పాదాల వద్ద ఉంచు)
- ‘భగవద్ – ధ్యాన సోపానమ్’లోని చివరి శ్లోకమున వేదాంతచార్యులు – శ్రీ రంగములోని శాస్త్ర పాండిత్యం కలవారికి మరియు కళా నైపుణ్యులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు, కారణం ఎవరైతో తమ స్పష్ఠమైన ఆలోచనలు, తమ సులువైన ఆలోచనలను సుందరముగా తయారుచేశారో.
- వేదాంతచార్యులు తాము శ్రీ భగవద్రామానుజుల యందు అత్యంత భక్తిని కలిగి ఉండేవారు. వారి ‘న్యాస తిలకం’ లో ‘యుక్త ధనంజయ’ అను శ్లోకమున వారు పెరుమాళ్ళతో విన్నపం చేస్తున్నారు ‘మీరిక మోక్షమును ఇచ్చే అవసరం లేదు కారణం ఆ మోక్షం మాకు శ్రీరామానుజుల తిరువడి సంబధమున వలన కచ్చితము అనుగ్రహింపబడును’.
ఈ విషయాల వల్ల వేదాంతచార్యులు తాను ఇతర ఆచార్యుల మరియు పండితుల యందు ఉన్న మర్యాద, గౌరవం, ప్రీతి మరియు భక్తి తెలుస్తుంది. శ్రీ వైష్ణవులపై శ్రావ్యంగా చర్చించి ఇలా చక్కని బాటను వేసారు.
ఆచార్య- చంపు
“A critical appreciation of Sri Vedanta Desika Vis-à-vis the Srivaishnavite World”, లో 1967 శ్రీ . S. సత్యమూర్తి అయ్యంగార్, గ్వాలియర్, ఇలా పేర్కొన్నారు. మరియు ఇతర ఆధార సమాచారములతో వేదాంతచార్యుల విషయం మరికొంత తెలుసుకోవచ్చును.
గొప్ప పండితుడు మరియు కవిగా ప్రసిద్ధి కెందిన S. సత్యమూర్తి అయ్యంగార్, వీరి ‘ఆచార్య చంపు’ గా ప్రసిద్ధికెక్కిన ‘వేదాంతచార్య విజయ’ అను పద్య గద్య రూపాన ఉన్న సంస్కృత కావ్యములో ‘కౌశిక కవితార్కిక సింహ వేదాంతాచార్యులు’ గా కీర్తించారు వీరిని, వీరు సుమారు 1717 AD ప్రాంతము వారు. వేదాంతచార్యుల జీవిత చరిత్రపై ఉన్న ఈ రచన చారిత్రాత్మకంగా అత్యంత పురాతనమైన మరియు అత్యంత ప్రామాణికమైన రచనగా పరిగణింపబడుతుంది .
వీరి రచనారంభం మొదటి స్తబకం (అధ్యాయం లేదా విభాగం) కవి యొక్క కాంచీపుర కుటుంబ విషయాలు మరియు వేదాంతచార్యుల పితామహులైన ‘పుండరీక యజ్వ’ తో ప్రారంభమగును.
రెండవ స్తబకం అనంతరసూరి (వేదాంతచార్యుల తండ్రి) జననం మరియు వివాహం ఇంకా వీరి భార్య గర్భమున దివ్య ఘంటా (శ్రీ వేంకటేశుని ఘంట) ప్రవేశంతో ఆరంభమగును.
మూడవ స్తబకంలో వేదాంతచార్యుల జననం, బాల్యం, తమ మేనమామ అయిన శ్రీ వాత్స వరదాచార్యులతో సహవాసం మరియు వారి దివ్య ఆశీస్సులు, ఉపనయనం, విద్యారంభం, వేదాభ్యాసం మొదలైనవి, వివాహం మరియు హయగ్రీవుని దయవల్ల విజయ ప్రాప్తి, ‘న్యాయ సిద్ధాంజనం’ ఆది రచనలు మరియు ‘కవితార్కిక సింహ’ అను బిరుదును పొందుట మొదలైనవి చర్చించబడ్డాయి.
నాల్గవ స్తబకంలో కాంచీపుర ఉత్సవములు, ‘వరద రాజ పంచాశత్’ రచన, అద్వైత పండితులగు విద్యారణ్యపై విజయం మరియు వేంకటాద్రి యాత్ర మొదలైనవి చర్చించ బడ్డాయి.
ఐదవ స్తబకంలో దివ్య దేశ యాత్ర, దయా శతక రచన, వైరాగ్య పంచకం – రాజ న్యాయ స్థానంలో విద్యారణ్యులచే జరిగిన వాదన, ఉత్తర దేశ తీర్థ యాత్ర, కాంచీ పునరాగమనం, అద్వైత పండితుడైన విద్యారణ్య మరియు ద్వైత పండితుడైన అక్షోభ్యలతో వాదనలో తమ తీర్పును స్థాపించుట, దక్షిణ దేశ తీర్థయాత్ర, కొంత కాలం తిరువహీంద్ర పురమున నివాసం, అనేక రచనలు, శ్రీముష్ణపు తీర్థయాత్ర, శ్రీ రంగము నుండి ఆహ్వానమును అందుకొనుట మొదలైనవి చర్చించ బడ్డాయి.
చివరి మరియు ఆరవ స్తబకంలో ఆచార్య చంపులోని విశేషములు – వేదాంతచార్యుల శ్రీ రంగ యాత్ర, శ్రీ రంగనాథుని దర్శనం, ‘భగవద్ధ్యాన సోపానం’ మొ||, అద్వైత పండితుడైన కృష్ణ మిశ్రునితో 18 రోజులు వాదించి జయమును పొంది “వేదాంతచార్య” “సర్వతంత్ర – స్వతంత్ర” అనే బిరుదులను కైవసం చేసుకొనుట, ఒక కవి స్పర్థతో ‘పాదుకాసహస్ర’ రచన, శ్రీ రంగమును తురుష్కుల దండ యాత్ర నుండి రక్షించుట, మిగిలిన క్షేత్రముల దర్శనం, పాములనాడించే వాడితో స్పర్థ వలన ‘గరుడ దండకం’ రచన, పుత్ర జననం మరియు ‘రహస్య త్రయం’ రచనలు మొదలైనవి చర్చించ బడ్డాయి.
ఈ ‘ఆచార్య చంపు’ బాగా ప్రచారం పొందినది, సంస్కృత పండితులచే ఆదరింపబడినది, ఈ విలువైన గ్రంథం ఎక్కువగా పునర్ ప్రచురణ జరగలేదు.
ఆధారములు:
- పుత్తూర్ స్వామి పొన్ విళ మలర్
- శ్రీ సత్యమూర్తి అయ్యంగార్, గ్వాళియర్ వారి “A critical appreciation of Sri Vedanta Desika Vis-à-vis the Srivaishnavite World”; 1967.
- శ్రీ. ప్ర. భ. అణ్ణంగరాచార్యస్వామి వారి – తమిళర్ తొజు వేదానన్తావాసిరియన్ (తమిళం)
- శ్రీ. ఉ. వే. V. V.రామానుజం స్వామి వారి కార్యముపై శ్రీ.ఉ.వే.. T. C. A. వేంకటేశన్ స్వామి ఆగ్లములో రచించిన “లోకాచార్య పంచాశత్” http://acharya.org/books/eBooks/vyakhyanam/LokacharyaPanchasatVyakhyanaSaram-English.pdf taken on Sep 25, 2012.
- చిత్రం తిరువళ్ళిక్కేణి వాస్త్యవులు కోయిళ్ అనంతన్ కస్తూరిరంగన్ స్వామి వారి ఇమెయిల్ సౌజన్యముతో
- చిత్రములు గ్రహించినది https://picasaweb.google.com/113539681523551495306/ – నుండి, Sep 25, 2012న.
అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస
Source: https://acharyas.koyil.org/index.php/2015/06/05/vedhanthacharyar-english/ (originally from http://acharyar.wordpress.com/2012/09/25/sri-vedanthachariar-vaibhavam/)
archived in https://acharyas.koyil.org/index.php
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/index.php
srIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org
2 thoughts on “వేదాంతాచార్యులు”
Comments are closed.