వంగి పురత్తు నంబి

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

sriramanuja-vangi-purathu-nambi-art

తిరునక్షత్రము : తెలియదు

అవతార స్థలము : తెలియదు (వంగి పురము వారి తండ్రిగారి గ్రామము లేదా శ్రీరంగము వారి తండ్రిగారైన వంగి పురత్తు ఆచ్చి మణక్కాల్ నంబి గారి శిష్యులైన పిదప ఇక్కడే నివశించారు)

ఆచార్యులు : ఎమ్పెరుమానార్

శిశ్యులు : శిరియాతాన్

గ్రంథములు : విరోధి పరిహారము

వంగి పురత్తు ఆచి మణక్కాల్ నంబి శిష్యులు. వంగి పురత్తు నంబి వన్గి పురత్తు ఆచి కూమారులు మరియు ఎమ్పెరుమానార్లకి శిష్యులైరి.

వీరు విరోధి పరిహారము బయటకు రావడములో ఒక సాదనముగా ఉండిరి – మన సంప్రాదాయములో ఒక ఉత్తమ గ్రంథము.ఒకసారి వంగి పురత్తు నంబి ఎమ్పెరుమానార్ వద్దకి వెళ్ళి ఒక ప్రపన్నుడు సంసారములో ఎటువంటి కష్టములను ఎదుర్కొనునని అడుగగా, ఎమ్పెరుమానార్ 83 అవరోధములను కలిగిన ఒక చిట్టీ ఇచ్చెను. వంగి పురత్తు నంబి ఆ 83 అవరోదములను ఒక గ్రంథరూపములో వివరణాత్మకముగా వ్రాసిరి. ఈ గ్రంథములో, మన జీవితములో వచ్చు ప్రతీ అంశములను ఏ విధముగా నిర్వహించవలెనో పూర్తి మార్గ దర్శకములతో వ్రాసిరి.

వంగి పురత్తు నంబి గారి కుమారులకు వంగి పురత్తు ఆచి అను నాదేయమును పెట్టిరి, వారు కొన్ని ఐదిహ్యములను తెలియబరచిరి.

మన వ్యాఖ్యానములలో,వంగి పురత్తు నంబి గారికి సంబందిచిన కొన్ని ఐదిహ్యములను ఇక్కడ చుద్దాము.

 • నాచ్చియార్ తిరుమొళి 9.6 – పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – ఆండాళ్ ఎమ్పెరుమానుని శ్రీ మహాలక్ష్మి  అను గొప్ప సంపదని కలిగిఉండెనని కీర్తించినది. ఈ సంభదముతో, వంగి పురత్తు నంబి తమ శిష్యులైన సిరియాతాన్ కు “అన్నీ తత్వాలు ఒక గొప్ప శక్తి ఉన్నదని అంగీకరించును, కాని మనము (శ్రీవైష్ణవులు) శాస్త్రములో చెప్పబడిన విదముగా – శ్రీమాన్ నారాయణుడే అదిదేవత అని మరియు ప్రతీ ఒక్కరు వారిని శరణు వేడవలెనని చెప్పిరి”.
 • పెరియ తిరుమొళి 6.7.4 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – ఈ పాశురములో, తిరుమంగై ఆళ్వార్ కణ్ణన్ ఎమ్పెరుమాన్ (తానే ఆదిదేవత అయిననూ) వెన్న దొంగలించిన సమయమున యశోదమ్మకు పట్టుబడిన వెంటనే ఏడవడము మొదలుపెట్టెను. ఈ సంభదము ద్వారా, ఒక అందమైన సంఘటనను వివరించెను. వంగి పురత్తు నంబి ఎమ్పెరుమానారులని తిరువారాధన క్రమమును (గృహ తిరువారాధన) తెలుపని అభ్యర్తించిరి. ఎమ్పెరుమానార్ సమయము చిక్కపోవడముచే వారికి చెప్పలేదు. కాని ఒకసారి నంబి గారు లేనప్పుడు, ఎమ్పెరుమానార్ తిరువారాధన క్రమమును ఆళ్వాన్ మరియు మారుతి సిరియాండాన్ (హనుమత్ దాసర్)లకు చెప్పసాగిరి. ఆ సమయమున వంగి పురత్తు నంబి ఆ గదిలోకి రావడముచూసి ఎమ్పెరుమానార్ గొప్ప అనుభూతిని చెందెను. అప్పుడు వారు ఈ విదముగా చెప్పిరి “చాలా కాలము నుండి నాకు ఈ సందెహము ఉండేది. ఇప్పుడు నాకు ఎందుకు ఎమ్పెరుమాన్ (తానే ఆదిదేవత అయిననూ) వెన్న దొంగిలించు సమయమున ఎందుకు  బయపడెనో తెలిసినది. నేను అటువంటి అనుభూతిని ఈ సమయమున పొందితిని – మీరు నన్ను అభ్యర్తించినప్పుడు,నేను మీకు ఉపదేశించలేదు కాని ఎలాగో ఈ రోజు అది వీరికి ఉపదేశించుచున్నాను. నేను ఆచార్యుడిని అయినప్పడికినీ మీరు నాకు శిష్యులైన కారణముచే నేను మీకు భయపడనవసరము లేదు, నా యొక్క పని ద్వారా మిమ్మల్ని చూచిన వెంటనే భయముకలిగెను”. అదీ మన ఎమ్పెరుమానార్ యొక్క గొప్పతనము. ఎప్పుడైనా వారు తప్పుచెసినచో, బాహాటముగానె ఒప్పుకొని దాని ద్వారా ఒక గొప్ప సూత్రముని వివరించెడివారు.
 • తిరువిరుత్తము – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము అవతారిక – నంపిళ్ళై ఇక్కడ మొదటగా నమ్మాళ్వార్ సంసారిగా ఉండెననీ ఎమ్పెరుమాన్ దివ్య కృపా కటాక్షముచే తదుపరి ఆళ్వార్ అయ్యెనని నిర్ణయించెను. కాని ఆళ్వార్ అళోచనల గొప్పతనము ఆచార్యుల ద్వారా చూసినప్పుడూ వేరుగా ఉండును – ఒక వైపు నుండి చూస్తే వారు ముక్తులు (సంసారము నుండి బయట పడినవారు);  అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ శిష్యులు ఒకరు వారు ముక్తులు కాకున్ననూ మంచి వారిలో ఒకరు అనెను; ఇంకొకరు వారు నిత్య సూరి అనెను; వంగి పురత్తు నంబి వారు స్వయముగా ఎమ్పెరుమాన్ అని చెప్పెను.
 • తిరువాయ్మొళి 7.2.7 –  నంపిళ్ళై  ఈడు వ్యాఖ్యానము – ఈ పదిగములో (కంగులుమ్ పగలుమ్), నమ్మాళ్వార్ అమ్మ భావముతో పాడెను, కాని అక్కడ ఆళ్వారులు వారి అమ్మగారు వివరిస్తున్నారని చెప్పెను. ప్రతి పాశురములో, ఆళ్వార్ (అమ్మ) ఎమ్పెరుమాన్ కొరకు వారిని తిరువరంగత్తాయ్ అని పిలుచును. కాని ఈ పాశురములో, ఆమె ఆ విదముగా చేయడము లేదు. వంగి పురత్తు నంబి ఇక్కడ ఒక రోగి చివరి సమయమున ఉన్నప్పడి సంఘటన ద్వారా వివరించెను, ఆ సమయములో వైద్యుడు నేరుగా రోగి బందువుల కళ్ళలోనికి చూడకుండా వేరే వైపునకు తిరిగి ఆ రోగి పరిస్తిని వారి బందువులకు వివరిస్తాడో. అదే విధముగా, ఆళ్వార్ ఎమ్పెరుమాన్ నుండి వేరుగా ఉండడముచే వారి పరిస్తితిని చెప్పుటకు, ఆళ్వార్ (అమ్మ) ఎమ్పెరుమానుని ఈ పాశురములో నేరుగా పిలువక ఆమె యొక్క పరిస్తితిని ఆక్రోశము ద్వారా తెలిపెను.
 • తిరువాయ్మొళి 9.2.8 – నంపిళ్ళై  ఈడు వ్యాఖ్యానము – శ్రీ రంగములో శ్రీ జయంతి పురప్పాడు సమయమున, వంగీ పురత్తు నంబి ఎమ్పెరుమాను ని సేవించుటకై గొల్ల పిల్లల సమూహమున చేరిరి.  ఆణ్డాన్ అక్కడ ఉన్నారేమిటని అడుగగా, నంబి ఈ విధముగా చెప్పెను “నేను విజయస్వ అని చెప్పితిని”. ఆణ్డాన్ అందుకు సమాదానముగా మీరు వారి మద్యన ఉండి, వారి యొక్క భాషను మాట్లాడక కష్టమైన సంస్కృతమును ఎందుకు మాట్లాడుతున్నారని అడిగిరి.

వార్తామాలైలో, కొన్ని ఐదిహ్యములు వంగి పురత్తు నంబి (మరియు వారి కుమారుల) కీర్తిని తెలుపును. వాటిని ఇక్కడ చూద్దాము.

 • 71 – వంగి పురత్తు నంబి యతివర చూడామణి దాసర్ కి ఉపదేశించిరి – ఒక జీవాత్మ (ఎవరైతే అచేతనుడో) ఎమ్పెరుమాన్ (గొప్ప వాడు మరియు సర్వ శక్తిమంతుడు) ని పొందినప్పుడు, అక్కడ జీవాత్మ యొక్క కృషిగాని మరెవరి కష్టము కాని లేదు. జీవాత్మకు రెండు దారులు కలవు – ఆచార్యుల కృపచే, ద్వయ మహా మంత్రమును ద్యానము చేసి బయటకు రావడమో లేక నిత్య సంసారిలా ఎప్పుడూ సంసారములో ఉండడము.
 • 110 – వంగి పురత్తు ఆచి కిడామ్బి ఆచ్చాన్కి ఉపదేశించిరి – అనాదియైన ఈ కాలములో ఒక జీవాత్మ ఈ యొక్క సంసారములో ఉన్నప్పుడూ, ఎల్లప్పుడూ పెరియ పిరాట్టి మనలను ఎమ్పెరుమాన్ దగ్గరికి చేర్చునని దృడ నిశ్చయముతో ఉండవలెను.
 • 212 – ఇది ఒక అందమైన సంఘటన. ఒక శ్రీవైష్ణవి పేరు త్రైలోక్యాళ్ వంగి పురత్తు ఆచికి శిష్యురాలు. ఒకసారి అనంతాళ్వాన్ శ్రీరంగమునకు వచ్చినప్పుడు, ఆమె వెళ్ళి వారికి 6 నెలలు శుశ్రూష చేసెను. అనంతాళ్వాన్ తిరి వెళ్ళిన పిదప, ఆమె ఆచి వద్దకు వచ్చెను. ఆచి ఆమె ఇన్ని రోజులు రాకపోవడము గురించి కారణము అడుగగా ఆమె అనంతాళ్వాన్ కి సపర్యలు చేసెనని చెప్పినది. ఆచి ఆమెను వారు ఎమైనా ఉపదేశించారా అని అడుగగా ఆమే ఈ విధముగా చెప్పినది “నేను మీకు ఎన్నో సంవత్సరములు సేవలను చేస్తే – మీరు నాకు ఎమ్పెరుమాన్  యొక్క శ్రీ చరణములను ఆశ్రయించమనిరి. ఈ 6 నెలలలో వారు నాకు మీ యొక్క శ్రీ చరణములకు దాసురాలని చూపిరి”. అనంతాళ్వాన్ ఆమెకు ఆచార్యుల శ్రీ చరణములే మనకు సర్వము అని చెప్పడము ఈ సంఘటన ద్వారా తెలియబరచిరినది.

పిళ్ళై లోకాచార్యులు  తమ ముముక్షుపడిలో వంగి పురత్తు నంబి గారి చరమ శ్లోకము యొక్క ముగింపును గుర్తించింరి. చరమ శ్లోక ప్రకరణము చివరన, చరమ శ్లోకము యొక్క కీర్తిని తెలిపెను. 265 సూత్రములో, “వంగి పురత్తు నంబి  కణ్ణన్ ఎమ్పెరుమాన్  అర్జునుడికి తన గొప్పతనమును ఎన్నో వివిదములైన సంఘటనల ద్వారా చూపి చివరన చరమ శ్లోకమును అనుగ్రహించిరనిరి. అందువలన సులభముగా అర్జునుడు ఆ సూత్రమును గ్రహించెను”. వ్యాఖ్యానములో, మాముణులు వంగి పురత్తు నంబిని “ఆప్త తమర్”అని  చెప్పెను – మన ఆధ్యాతిక భావనములో నేర్పరులు.

వంగి పురత్తు నంబి గారి జీవితములోని కొన్ని ముఖ్య సంఘటనలను ఇక్కడ చూసాము. వీరు పుర్తిగా భాగవత నిష్ఠతో ఉండి ఎమ్పెరుమానారుకి ప్రియ శిష్యులైరి.మనకూ అటువంటి ఆచార్య నిష్ఠ కలిగేలా వారి శ్రీ చరణములను ఆశ్రయించుదాము.

వంగి పురత్తు నంబి తనియన్ 

భారద్వాజ కులోత్భూతమ్ లక్ష్మణార్య పదాశ్రితమ్
వందే వంగిపురాధీశమ్ సంపూర్ణాయమ్ కృపానిధిమ్

అడియేన్ రఘు వంశీ రామానుజ దాసన్

మూలము: https://acharyas.koyil.org/index.php/2013/04/10/vangi-purathu-nambi-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

3 thoughts on “వంగి పురత్తు నంబి”

 1. Excellent. No words. I am thirsty for to know the devotees life style and how perumal with ALWARS.

  Please do sending srivaishnava devotee stories.

  Adiyen,

  POODATHU SRINIVAS

Comments are closed.