పెరియాళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: ఆషాడ మాసము (ఆని), స్వాతి నక్షత్రం అవతార స్థలము: శ్రీవిల్లిపుత్తూర్ ఆచార్యులు: విష్వక్సేనులు శ్రీ సూక్తులు: తిరుప్పల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి పరమపదము చేరిన ప్రదేశము: తిరుమాలిరుంశోలై పెరియ వాచ్చాన్ పిళ్ళై  తిరుపల్లాండు అవతారికలో పెరియాళ్వార్ వైభవాన్ని కీర్తించారు. ఈ సంసార దుఃఖములను అనుభవిస్తున్న జీవాత్మలను ఉజ్జీవింపచేయడమే వీరి అవతార ఉద్దేశ్యము. పెరుమాళ్ళ కృపతో, పెరియాళ్వార్లు సహజముగానే భగవత్ కైంకర్యంతో అలంకృతులై ఉండిరి. కైంకర్యం చేస్తూ తమ … Read more

తిరుమంగై ఆళ్వార్

శ్రీః శ్రీమతేరామానుజాయనమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మునయే నమః తిరునక్షత్రం : కార్తీక మాస కృత్తికా నక్షత్రం అవతార స్థలం  : తిరుక్కురయలూర్ ఆచార్యులు : విశ్వక్సేనులు, తిరునరయూర్ నంబి,  తిరుకణ్ణపురం శౌరిరాజ పెరుమాళ్ శిష్య గణం:  తమ బావమరిది ఇళయాళ్వార్, పరకాల శిష్యులు, నీర్మేళ్ నడప్పాన్ (నీటి పైన నడిచే వాడు), తాళూదువాన్ (తాలములను నోటితో ఊది తెరిచేవాడు), తోళావళక్కన్ (జగడములు చేసి ధనమును రాబట్టే వాడు), నిలలిళ్ ఒదుంగువాన్ (నీడలో ఒదిగి పోయేవాడు), … Read more

మధురకవి ఆళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వవరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: చిత్తా నక్షత్రము మాసము: చైత్ర మాసము (చిత్తిరై / మేష) అవతార స్థలము: తిరుక్కోళూర్ (ఆళ్వార్ తిరునగరి నవ తిరుపతులలో ఒకటి) ఆచార్యులు: నమ్మాళ్వార్ శ్రీ సూక్తులు: కణ్ణినుణ్ శిరుత్తాంబు పరమపదము చేరిన ప్రదేశము: ఆళ్వార్ తిరునగరి నంపిళ్ళై తమ అవతారికా వ్యాఖ్యానంలో మధురకవి ఆళ్వార్ల కీర్తిని అతి వైభవంగా వివరించారు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాము. మహాఋషులందరు తమ దృష్టిని సామాన్య … Read more

ఆండాళ్ (గోదా దేవి)

 శ్రీః శ్రీమతేరామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచలమునయే నమః తిరునక్షత్రం – ఆషాడ, పూర్వఫల్గుణి (ఆడి, పూరం) అవతార స్థలం – శ్రీవిల్లిపుత్తూర్ ఆచార్యులు – పెరియాళ్వార్ అనుగ్రహించిన గ్రంథములు – తిరుప్పావై మరియు నాచ్చియార్ తిరుమొళి. పెరియ వాచ్చాన్ పిళ్ళై తన తిరుప్పావై ఆరాయిరప్పడి వాఖ్యానములో మిగితా ఆళ్వారుల కన్నా అధికంగా ఆండాళ్ గొప్ప తనమును స్థాపించినారు. వివిధ స్తరములలో జీవాత్మ యొక్క వివిధ గుణములను వర్ణిస్తూ వాటి మధ్యన ఉన్న వ్యత్యాసాన్నివర్ణించారు.  సంసారులకు (దేహాత్మ … Read more

కులశేఖర ఆళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: మాఘ మాసము (మాశి), పునర్వసు నక్షత్రం అవతార స్తలము: తిరువంజిక్కళమ్ ఆచార్యులు: విష్వక్సేనులు శ్రీ సూక్తులు: ముకుంద మాల, పెరుమాళ్ తిరుమొళి పరమపదము చేరిన ప్రదేశము: మన్నార్ కోయిల్ (తిరునన్వెల్లి దగ్గర) కులశేఖరాళ్వార్లు క్షత్రియ కులములో జన్మించినప్పటికి భగవానుని యెడల, భాగవతుల యెడల చాలా విధేయుడై ఉండెడివారు. వీరికి రాముడి పట్ల ఉన్న అనన్య భక్తి వలన ఈ ఆళ్వార్ ‘కులశేఖర పెరుమాళ్’ (పెరుమాళ్ అనేది … Read more

తిరుమళిశై ఆళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః తిరునక్షత్రము: మాఘ మాసము (తై), మఖా నక్షత్రం అవతార స్థలము: తిరుమళిశై (మహీసారపురం) ఆచార్యులు: విష్వక్సేనులు, పేయాళ్వార్ శిష్యులు: కణి కణ్ణన్, ధ్రుడ వ్రతన్ శ్రీ సూక్తులు: నాన్ముగన్ తిరువందాది, తిరుచంద విరుత్తమ్ పరమపదము చేరిన ప్రదేశము: తిరుక్కుడందై (కుంభకోణం) శాస్త్ర సంపూర్ణ ఙ్ఞాన సారమును ఈ ఆళ్వారు కలిగి ఉన్నారని మాముణులు కీర్తించెను (ఈ ఆళ్వార్ వివిధ మత సిద్ధాంత … Read more

ముదలాళ్వార్లు

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః ముదలాళ్వార్లు గత సంచికలో మనము పొన్నడిక్కాల్ జీయర్ వారి వైభవమును అనుభవించాము ఇప్పుడు ఆళ్వారుల మరియు ఆచార్యుల  వైభవమును అనుభవిద్దాం. దీనిలో విశేషంగా ముదలాళ్వార్ల (పొయిగై ఆళ్వార్, భూదత్తాళ్వార్ మరియు పేయాళ్వార్) వైభవమును అనుభవిద్దాము. పొయిగై ఆళ్వార్లు తిరునక్షత్రము: ఆశ్వీజ మాసము (ఐప్పసి), శ్రవణా నక్షత్రం (తిరువోణమ్) అవతార స్థలము: కాంచీపురము ఆచార్యులు: విశ్వక్సేనులు (భగవంతుని సర్వ సైన్యాధికారి) శ్రీ సూక్తులు: ముదల్ తిరువందాది … Read more

నమ్మాళ్వార్

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వవరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః గత సంచికలో మనం విష్వక్సేనుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నమ్మాళ్వార్ల గురించి చూద్దాం. తిరునక్షత్రం: వైశాఖ మాసము, విశాఖా నక్షత్రం. అవతారస్థలం: ఆళ్వార్తిరునగరి ఆచార్యులు: విష్వక్సేనులు శిష్యులు: మధురకవి ఆళ్వార్, నాథమునులు తదితరులు నమ్మాళ్వార్లకి మాఱన్, శఠగోపులు, పరాంకుశులు, వకుళాభరణులు, వకుళాభిరాములు, మఘిళ్ మాఱన్, శఠజిత్, క్కురుగూర్ నంబి అను నామధేయములు ఉన్నవి. కారి, ఉడయనంగై అను పుణ్య దంపతులకు తిరుక్కురుగూర్ (ఆళ్వార్తిరునగరి) … Read more