తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్

 

    శ్రీ:

    శ్రీమతే శఠకోపాయ నమ:

    శ్రీమతే రామానుజాయ నమ:

    శ్రీమద్ వరవరమునయే నమ:

    శ్రీ వానాచల మహామునయే నమ:

    తిరునక్షత్రము: మిథున మాసము (ఆని)

    అవతార  స్థలము: తిరుక్కణ్ణమంగై  

    ఆచార్యులు: నాథమునులు

    పరమపదము పొందిన స్థలము: తిరుక్కణ్ణమంగై

    రచనలు: నాచ్కియార్ తిరుమొళి తనియన్ అల్లి నాళ్ తామరై మేల్

Thirukkannamangai_bhakthavatsalan

భక్తవత్సలన్ ఎమ్పెరుమాన్ మరియు తాయార్ – తిరుక్కణ్ణమంగై

thirukkannamangai-andan-thiruvarasu

తిరుక్కణ్ణమంగై ఆణ్డాన్ – తిరుక్కణ్ణమన్గై

తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్, తిరుక్కణ్ణమంగై దివ్య దేశములో అవతరించారు. నాథమునుల శిష్యులు. భగవానుని  రక్షకత్వము మీద వీరికున్న విశ్వాసాన్ని పూర్వాచార్యులు ఎంతగానో ప్రశంసించారు.

 పిళ్ళై లోకాచార్యులు అనుగ్రహించింన శ్రీ వచన భూషణమనే దివ్య శాస్త్రములో వీరు ప్రస్తుతింపబడ్డారు. ఉపాయమునకు, ఉపేయమునకు ఉండవలసిన లక్షణములను 80వ సూత్రములో  ఉపాయత్తుక్కు పిరాట్టియైయుం, ద్రౌపతియైయుం, తిరుక్కణ్ణమంగై ఆణ్దానైయుం పోలే ఇరుక్కవేణుం; ఉపేయత్తుక్కు ఇళైయ పెరుమాళైయుం, పెరియ ఉడైయారైయుం, పిళ్ళై తిరునరైయూర్ అరైయరైయుం, చింతయంతియైయుం పోలే ఇరుక్కవేణుంఅన్నారు. అనగా “ఉపాయమునకు పిరాట్టిలాగా, ద్రౌపతిలాగా, తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్లాగా, ఉపేయమునకు లక్ష్మణస్వామిలాగ, పెరియ ఉడైయార్లాగ, పిళ్ళై తిరునరైయూర్ అరైయర్లాగ చింతయంతిలాగ ఉండాలి అని అర్థము. ఉపాయమనగా గమనము, ఉపేయమనగా గమ్యము. భగవంతుడే ఉత్తమ ఉపాయము. శ్రీమహాలక్ష్మితో కూడిన శ్రీ మన్నారాయణుడు ఉపేయము.

ఉపాయం

  • పిరాట్టి అనగా సీతా పిరాట్టి (శ్రీ మహాలక్ష్మి) రావణుని చెరలో ఉన్నప్పుడు తన శక్తిని ఉపయోగించలేదు. లేకుంటే రావణుని తన శక్తిచే నాశనము చేయుట ఆమెకు అసాధ్యమేమి కాదు.దానికి తార్కాణము హనుమ తోకకు రాక్షసులు నిప్పు అంటించినప్పుడు సీతాదేవి హనుమకు ఎమీ కాకూడదని భావించి “శీతో భవ” (చల్లబడుగాక) అని దీవించింది. అదే శక్తినుపయోగించి రావణుని నాశనము చేయగలిగి వుండి కూడా తన స్వతంత్ర్యమును ప్రకటించకుండా శ్రీరాముని ఉపాయముగా భావించి ఆయన రాక కోసము ఎదురుచూస్తూ తన దాసత్వమును చాటుకుంది.
  • ద్రౌపతి నిండు సభలో కౌరవులచే అవమానింపబడినప్పుదు స్త్రీ సహజమైన లజ్జను విడిచి రెండుచేతులెత్తి  కృష్ణుడే రక్షకుడన్న విశ్వాసముతో ఆయనను ప్రార్థించింది.
  •  తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్ తన ప్రయత్నములన్నీ వదిలివేసి భక్తవత్సలుడైన  తిరుక్కణ్ణమంగై దివ్య దేశములోని పెరుమాళ్ళపై విశ్వాసమునుంచి శరణాగతి చేశారు.

  ఆణ్డాన్ నిష్ఠను మామునులు ఈ సూత్రములో బాగా వ్యాఖ్యానము చేశారు.

ఒక సారి ఆణ్డాన్ ఒక కుక్క తనపై దాడి చేసిన వ్యక్తి మీద కోపముతో మొరగటము చూశారు. అంతలో ఆ కుక్క యజమాని కోపముతో ఆవ్యక్తి మీదికి వచ్చాడు. మాట మాట పెరిగింది ఆఖరికి కత్తి దూసేదాక విషయము వెళ్ళింది. అది చూసిన ఆణ్దాన్ కు గొప్ప ఙ్ఞానోదయమైంది. ఒక కుక్క యజమాని తన కుక్కను రక్షించుకోవటానికి సాటి వ్యక్తిని చంపటానికి కూడా సిద్ద పడ్డాడే, మరి  సర్వాధికారిసర్వశక్తుడు అయిన శ్రీమన్నారాయణుడు తన వారైన చేతనులను వదిలేస్తాడా? అని భావించి తిరుక్కణ్ణమంగై దివ్య దేశములోని పెరుమాళ్ళైన  భక్తవత్సలుని శ్రీపాదములపై సాష్ఠాంగపడ్డారు.    

స్వరక్షణ హేతువాన స్వవ్యాపారంగళై విట్టాన్ ఎంగిన్ఱపడి” (స్వరక్షణ హేతువైన స్వవ్యాపారములను వదిలాడు) అని మామునులు వ్యాఖ్యానము చేశారు. ఆయ్ జనన్యాచార్యులు కూడా తన తిరువాయ్మొళి 9.2.1 వ్యాఖ్యానములో ఈ విషయమును ప్రత్యేకముగా చెప్పారు.

  ఉపేయము (కైంకర్యము)

  • శ్రీవచన భూషణ దివ్యశాస్త్రములోని 80వ సూత్రము, తరువాతి సూత్రములలో దీనికి చక్కని వ్యాఖానము చేయబడినది.
  •  ఇళయ పెరుమాళ్- (లక్ష్మణస్వామి)  శ్రీ రాముడికి ఎప్పుడు ఏ కైంకర్యము కావాలంటే అది చేయటములో సిద్దహస్తుడు.
  •  పెరియ ఉడైయార్ – ( జటాయు మహారాజు) రావణాసురుడు సీతా పిరాట్టిని అపహరించుకు పోయేటప్పుడు తన ప్రాణాలకు తెగించి పోరాడాడు.
  •  పిళ్ళై తిరునరైయూర్ అరైయర్ – శ్రీరంగము దగ్గరలోని తొత్తియం తిరునారాయణపురం అనే క్షేత్రములో ఒకసారి పిళ్ళై తిరునరైయూర్ అరైయర్ సకుటుంబముగా సేవించుకోవటానికి వెళ్ళినపుడు కొందరు దుండగులు కోవెలకు నిప్పు పెట్టారు. అర్చావిగ్రహమును రక్షించుకోవటము కోసము అరయర్ కుటుంబముతో సహా అర్చా విగ్రహమును ఆలింగనము చేసుకొని ఆ ప్రయత్నములోనే పరమపదము చేరుకున్నారు. పరమాత్మ పట్ల వీరికున్న అంకితభావమును పూర్వాచార్యులు ఎంతగానో కొనియాడి నారు.
  •  చింతయంతి వ్రజ భూమిలో ఉండే ఒక గోపిక. కృష్ణుని పట్ల అపారమైన ప్రేమకలది. ఒక రోజు కృష్ణుని వేణుగానము విని ఆనందముతో ఆయనను చూడాలని తహ తహలడింది. ఇంట్లోని వాళ్ళు వెళ్ళనివ్వ లేదు. దుఃఖముతో కూలిపోయి ప్రాణాలను విడిచింది. ఆనందముతో పుణ్య కర్మము, దుఃఖముతో పాప కర్మము తొలగి పోయి  పరమపదం చేరుకున్నది. మన పాపపుణ్యములే మనలను ఈ సంసారములో (భూలోకములో) కట్టి పడవేసేవి.

ఆణ్దాన్ జీవితకాలమంతా తిరుక్కణ్ణమంగైలోని స్వామికి కైంకర్యము చేసి పరమపదమునకు వేంచేసి అక్కడ పరమపద నాథునికి కైంకర్యము కొనసాగించారు.

పూర్వాచార్య గ్రంథములలో ఆణ్దాన్ గొప్పతనమును తెలియజేసే వ్యాఖ్యానములు కొన్నిటిని చూద్దాము.

  • నాచ్చియార్ తిరుమొళి 1.1 – వ్యాఖ్యానము – “తరై విళక్కి” (నేలను ఊడ్చి) అని ఆండాళ్ అన్న మాటకు తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్ చెడును ఊడుస్తున్నారు అని పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానంలో రాశారు.
  • తిరుమాలై 38 –  వ్యాఖ్యానము – “ఉన్ కడైత్తలై ఇరుంతు వాళుం సోంబర్” (“నీ తలవాకిటనే ఉండి ఉజ్జేవించే సోమరులు” అని అర్థము) దీనికి పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములో తిరుక్కణ్ణమంగై ఆండాన్ ను ఉదాహరణగా  చూపించారు. ఎందు కంటే పరమాత్మనే నమ్ముకొని ఇతర తాపత్రయములు లేకుండా జీవించారు. 
  • తిరువాయ్మొళి 9.2.1 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము – నమ్మాళ్వార్  తిరువాయ్మొళి 10.2.7 చెప్పిన విదముగా కడైత్తలై చీయ్క్కప్పెత్తాల్ కడువినై కళైయలామే” (తల వాకిలి ఊడిస్తే పాపాలన్నీ తరిగిపోతాయి) అనే  పాశురానికి నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానములో చక్కగావివరించారు. ఈ పాశుర అర్థము ఏవిటంటే నమ్మాళ్వార్ స్వామితో ‘మేము తరతరాలుగా కోవెలను శుభ్రము చేసే కైంకర్యము చేస్తున్నాము’.ప్రపన్నులైనవారు కైంకర్యము ఉపాయముగా ఎందుకు స్వేకరించాలి? వారికి పరమాత్మ ఉపాయము కదా? “అన్న ప్రశ్న వస్తుంది. నంపిళ్ళై తిరువాయ్మొళి 9.2.1 పాశురము యొక్క ఈడు వ్యాఖ్యానములో దీనికి తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్ అనుభవములోని విషయాన్ని ఉదాహరణగా చెప్పారు. ఆణ్దానుకు నాస్తికుడైన మిత్రుడు ఒకడు వుండేవాడు. ఆణ్దాన్ రోజు కోవెలలోని సన్నిధిని శుభ్రము చేయటము చూసి ప్రపన్నులైన మీరు కోరికలే లేని వారు కదా మరి ఎందుకు ఇంత కష్టపడి రోజూ శుభ్రము చేస్తున్నావు? అని అడిగారు. దానికి ఆండాన్ శుభ్రము చేసిన స్థలము,చేయని స్థలము చూపించి తేడా చూడమన్నారు.దాసభూతులైన వారికి కైంకర్యము చేయటము సహజసిద్దము అంతేకాని ఉపాయము కాదు అని చెప్పారని నంపిళ్ళైతన వ్యాఖ్యానములో వివరించారు.
  •  శ్రీవచన భూషణము సూత్రం 88 లో పిళ్ళై లోకాచార్యులు సామాన్యులు చేసే కైంకర్యానికి,    ప్రపన్నులు చేసే కైంకర్యానికి బేధమును చక్కగా తెలిపారు.
  •  చరమోపాయ నిర్ణయం నాథమునులు నాలాయిర దివ్య ప్రబంధమును నమ్మాళ్వార్ వద్ద ఆళ్వార్ తిరునగరిలో నేర్చుకున్నారు. అక్కడ నుండి వీర నారాయణ పురం (కాట్టు మన్నార్ కోయిల్) చేరుకొని, దివ్య ప్రబంధమును అక్కడి పెరుమాళ్ళు, మన్ననార్ ముందు నివేదించారు. కోవెలలో మర్యాదలు అందుకున్న తరువాత తిరుమాళిగకు వెళ్ళగానే, తన మేనళ్ళులను కీళై అగత్తాళ్వాన్, మేలై అగత్తాళ్వాన్లను (కింది ఇంటి ఆళ్వాన్, మీది ఇంటి ఆళ్వాన్) పిలిచితను నమ్మాళ్వార్ల అనుగ్రహము పొందిన విధానమును వివరించారు. తనకు కలలో భవిష్యదాచార్యులు (రామానుజులు) దర్శనము ఇచ్చిన విషయము చెప్పగా విని, వారిరువురు ఆశ్చర్యచకితులైయ్యారు. తరవాత వారికి ద్వయ మంత్రార్థమును తిరువాయ్మొళి పరముగా వివరించారు. ప్రియ శిష్యులైన తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్ కు కూడా చెప్పారు. పొలిగ పొలిగ పొలిగ” (తిరువాయ్మొళి 5.2.1) పాశురమును వివరిస్తున్న సందర్భములో, స్వప్న వృత్తాంతము (భవిష్యదాచార్యులు) ను నాథమునులు తెలపగా విన్న ఆండాన్ నాయనారాచ్చాన్ పిళ్ళై (పెరియ వాచ్చాన్ పిళ్ళై కుమారులు) రచించిన “చరమోపాయ నిర్ణయమును” లోని విషయము చక్కగా భోద పడుతున్నదని తమలాంటి పెద్దల సాంగత్యము నా పూర్వజన్మ సుకృతమని పొంగిపోయారు. 
  •  వార్తా మాలై 109 – పిన్బళగియ పెరుమాళ్ జీయర్ కూడ తన వార్తామాలలో పిరాట్టి, ద్రౌపతి, తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్లను గురించి శ్రీ వచన భూషణములో చెప్పిన విధముగానే చెప్పారు.
  •  వార్తా మాలై 234 – ఇందులో విశేష శాస్త్రము (భాగవత ధర్మము) సామాన్య శాస్త్రం (వర్ణాశ్రమ ధర్మం) కంటే ఎలా గొప్పదో తెలియజేసారు. అలాంటి నిష్ఠ అందరికీ సాధ్యము కాదు. ఎంతో ప్రపన్నులైన అధికారులు ఆది భరతన్, తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్ లాంటి వారికి మాత్రమే సాధ్యము.

 తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్ దివ్య తిరువడిని మనసులో నిలుపుకొని మనలోను పరమాత్మ మీద చెదరని విశ్వాసము వుండాలని ప్రార్థించుదాము.

ఆధారము:  చరమోపాయ నిర్ణయం, వార్తామాలై వ్యాఖ్యానములు.

 అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://acharyas.koyil.org/index.php/2014/07/13/thirukkannamangai-andan-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

   

4 thoughts on “తిరుక్కణ్ణమంగై ఆణ్దాన్”

  1. Thank you for above Devine massage about “upayamu” and ” upeyamu” with eg drowpadhi, jattayuvu, laksman swamy etc. Happy to read and know the above Devine massage on the day of the THIRUKKANGANNADAN Thirunakshthram. ……..adiyen chiranjeevulu ramanuja dasaha

Comments are closed.