దివ్య దంపతులు

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత సంచికలో మనం గురుపరంపర గురించి తెలుసుకున్నాము.

దివ్య దంపతులు

ఇప్పుడు ఓరాణ్ వళి ఆచార్య పరంపర గురించి తెలుసుకుందాము. ‘ఓరాణ్ వళి’ అనగా పరంపరాగత జ్ఞాన ప్రసరణ ఒక ఆచార్యుని నుండి శిష్యునకు, మరల ఆ శిష్యుని నుంచి తరువాతి శిష్యునకు అందించే ఒక క్రమం. రహస్య త్రయమే స్వరూప జ్ఞానము. దానిని ఓరాణ్ వళి గురుపరంపర క్రమంలో జాగ్రత్తగా నిక్షేపం చేసి ఉంచి, క్రమంగా మనవరకు అందించబడింది.

  • పెరియ పెరుమాళ్

పెరియ పెరుమాళ్

తిరునక్షత్రం: శ్రావణ మాసము, రోహిణీ నక్షత్రము
శ్రీసూక్తులు: భగవద్గీత, శ్రీశైలేశ దయాపాత్రమ్ తనియన్  మొదలగునవి.

మన ఓరాణ్ వళి గురుపరంపర, పెరియ పెరుమాళ్ళ అపారమైన నిర్హేతుక కృప వలన అతనితోనే ఆరంభవుతుందన్న విషయము క్రిత సంచికలలో చూశాము. భగవంతుడు తాను ప్రథమాచార్యుడి స్ధానమును స్వీకరించి శిష్యురాలిగా పెరియ పిరాట్టికి విష్ణు లోకము నందు రహస్య త్రయాన్ని ఉపదేశించాడు.

భగావానుడు మాత్రమే సర్వతంత్ర స్వతంత్రుడు, శేషి (యజమాని). మిగిలిన అందరు అతనికి పరతంత్రులు (భగవంతుని అధీనులు), శేషులు (దాసులు). పరమాత్మ తమ స్వతంత్ర ఇచ్ఛతో ప్రథమాచార్యుని స్థానాన్ని స్వీకరించాడు. తాను సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, సర్వవ్యాపకుడు. తమ సామర్థ్యము చేత ముముక్షువులకు, అనగా మోక్షార్థులకు మోక్షమును ప్రసాదించగలడు.

పెరియ పెరుమాళ్ (నారాయణుడు) పరమపదము నుండి శ్రీరంగ విమానమున సత్యలోకమునకు వేంచేసి బ్రహ్మ దేవుడిచే ఆరాధింపబడెను. అనంతరం ఇక్ష్వాకు ప్రార్ధన వల్ల అయోధ్య నందు రఘువంశీయులచే ఆరాధింపబడెను. అనంతరము శ్రీరాముడు తమ కులధనమైన పెరియ పెరుమాళ్ళను విభీషణుడికి బహూకరించగా, లంకకు తిరిగి వెళుతూ దారిలో పెరియ పెరుమాళ్ళను శ్రీరంగములో దింపెను.  శ్రీరంగ సౌందర్యాన్ని చూచిన పెరుమాళ్ళు ఆ శ్రీరంగధామము నందు దక్షిణ ముఖముగా పవళించడానికి నిశ్చయించుకున్నాడు.

పెరియ పెరుమాళ్ళ తనియన్: 

శ్రీ స్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే ।
చింతామణి మివోద్భన్తం ఉత్సంగే అనంతభోగినః ॥

  • పెరియ పిరాట్టి

shri ranganaayaki

తిరునక్షత్రం:  ఫాల్గుణ మాసము, ఉత్తరఫాల్గుణి నక్షత్రము

విష్ణులోకంలో భగవానుడు పెరియ పిరాట్టికి ద్వయ మంత్ర ఉపదేశం చేసెను. ఆచార్య గుణాలకు స్వరూపిని పెరియ పిరాట్టి. 

పారతంత్ర్యము (భగవానుడిపైన ఆధారపడి ఉండుట), కృప (సంసారము నందు చిక్కుకొని బాధపడుతున్న వారి యందు దయ), అనన్యార్హత్వము (తాను భగవానునకే చెంది ఉండుట). ఈ మూడు లక్షణములు ఆచార్యునకు తప్పక ఉండవలసినవి. ఈ మూడు గుణములు పిరాట్టిలో పూర్ణముగా ఉండడం వలన  ఓరాణ్ వళి గురుపరంపరలో ద్వితీయ స్థానమును అలంకరించి ఆ తరువాతి ఆచార్యులకు స్ఫూర్తిగా నిలచినది.

పెరియ పిరాట్టి సీతా దేవిగా అవతరించి ఈ మూడు గుణాలను ప్రదర్శించెనని శ్రీవచనభూషణ దివ్య శాస్త్ర గ్రంథంలో పిళ్ళై లోకాచార్యులు అనుగ్రహించారు.

మొదటి సారి – తనను రావణుడు లంకకు కొనిపోవున సమయమున పరమకృపతో అనుమతించెను. ఈ కారణంగా తాను లంక చేరితే దేవతా స్త్రీలకు ముక్తి లభించును. జగన్మాతయగు ఆ తల్లి రావణుని యందు కూడా మాతృవాత్సల్యమును చూపి వాని తప్పులను భరించినది.

రెండోసారి –  తాను గర్భిణిగా ఉన్నప్పటికి శ్రీ రాముడు ప్రజల విమర్శలు విని సీతమ్మను అరణ్యమునకు వెల్లమనగా, శ్రీరామునిపైనే ఆధారపడివున్న (పారతంత్ర్యం) సీతమ్మ, శ్రీరాముని మాటకు ఎదురు చెప్పక అంగీకరించెను. 

మూడవ సారి –  వనవాసమనంతరం శ్రీరాముడిని వదిలి పరమపదమునకు వెళ్ళునప్పుడు  తాను భగవానుడికే చెందిన దానిగా నిరూపించు కొనెను. (అనన్యార్హత్వం).

ఈ విధముగా ఆచార్యునిలో ఉండవలసిన లక్షణములను ఈ రీతిన పెరియ పిరాట్టి ప్రదర్శించేను.

పెరియ పిరాట్టి తనియన్

నమః శ్రీరంగ నాయక్యై యద్భ్రూ విభ్రమ భేదతః ।
ఈశేశితవ్య వైషమ్య నిమ్నోన్నత మిదం జగత్ ॥

ఎంపెరుమానార్ తిరువడిగళే శరణమ్

మూలము: http://acharyas.koyil.org/index.php/2012/08/17/divya-dhampathi-english/

పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

 

42 thoughts on “దివ్య దంపతులు”

  1. Adiyen, Guruparampara in telugu language is really very fantastic. Being a telugu srivaishnava I feel very happy and I need hard copy of GURUPARAMPARA in telugu language which mentioned about all acharyas.
    Adiyen
    Srinivas
    RAMANUJA dasan.

Comments are closed.