శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
తిరునక్షత్రం: ఆశ్వీజ (తులామాసం) పూర్వ ఫల్గుణి నక్షత్రం.
అవతార స్థలం: తిరునారాయణ పురం.
ఆచార్యులు: తమ తండ్రిగారు లక్ష్మణాచార్యులు (పంచ సంస్కారములు) మరియు నాలూరాచ్చాన్ పిళ్ళై (గ్రంథ కాలక్షేప గురువులు)
పరమపదించిన స్థలం: తిరునారాయణ పురం
గ్రంథరచనలు: తిరుప్పావై వ్యాఖ్యానం (ఇరండా ఆరాయిరప్పడి) మరియు స్వాపదేశం, తిరుమాలై ప్రబంధమునకు వ్యాఖ్యానం, ఆచార్య హృదయమునకు, శ్రీ వచన భూషణమునకు మరియు మాముణులను కీర్తించు తమిళ పాశురములకు వ్యాఖ్యానం.
తల్లి దండ్రులు ఇతనికి పిన్న వయస్సులో దేవరాజర్ అని పేరుంచిరి. దేవ పెరుమాళ్, ఆసూరిదేవరాజర్, తిరుత్తాళ్వరై దాసర్, శ్రీశానుదాసర్, మాతృ గురు, దేవరాజ మునిధర్ మరియు ఆయ్ జనన్యాచార్యులు అని నామాంతరములు కలవు.
ఆయ్ అనగా అమ్మ అని అర్థం. తాను తిరునారయణ పెరుమాళ్ కి పాలను కాచి సమర్పించే కైంకర్యమును చేసేవారు. ఒకనాడు వీరు కైంకర్యమునకు కొద్దిగా ఆలస్యం అయినది, అప్పుడు తిరునారయణ పెరుమాళ్ ” మా ఆయ్ (అమ్మ) ఎక్కడ? అని వారిపై మాతృ వాత్సల్యమును చూపిరి. ఆనాటి నుండి వీరిని ఆయ్ అని లేదా జనన్యాచార్యులని వ్యవహరించేవారు. ఇది దేవరాజ పెరుమాళ్ళకి నడాదూర్ అమ్మాళ్ మధ్య ఉన్న సంబంధమును పోలి ఉండును.
వీరు గొప్ప పండితులు మరియు ఉభయ వేదాంతములో అనగా ద్రావిడ మరియు సంస్కృత వేదాంతములలో బహు నిష్ణాతులు.
తిరువాయ్మొళి పిళ్ళై మరియు తిరువాయ్మొళి ఆచ్చాన్ (ఇళం పిళ్ళిచెయ్ పిళ్ళై) తో కలసి తాను నంపిళ్ళై గారి ఈడు వ్యాఖ్యానాన్ని నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై ద్వారా సేవించారు. ఈడు యొక్క వివరణ ఇక్కడ చూడవచ్చు (https://acharyas.koyil.org/index.php/2015/04/13/eeyunni-madhava-perumal-telugu/).
ఆచార్య హృదయం (అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ – పెఱ్రార్ పెఱ్రార్ అని ఆయ్ జనన్యా చార్యులు – మణవాళ మాముని) పరంపరలో వీరు కూడా కీర్తింపబడ్డారు.
మామునులు ఆచార్య హృదయానికి వ్యాఖ్యానాన్ని వ్రాసేటప్పుడు 22 వ చూర్ణికా వ్యాఖ్యానం దగ్గర వారు స్పష్ఠీకరణ చేయాలనుకున్నారు. ప్రత్యేకించి ఈ చూర్ణిక వ్యాఖ్యానం దగ్గర వీరు తిరువాయ్మొళి పిళ్ళైకి సహ అధ్యాయి అయిన ఆయ్ జనన్యాచార్యుల గురించి చర్చించాలను కొని ‘ఆయ్’ తమ ఆచార్యుల భావించారు. మాముణులు ఆళ్వార్ తిరునగరి నుండి తిరు నారాయణపురం వెళ్ళడానికి నమ్మాళ్వార్ దగ్గర ఆఙ్ఞను తీసుకుని బయలుదేరారు.
అదే సమయాన మామునుల గొప్పవైభవమును విన్న ఆయ్ జనన్యాచార్యులు తాము మాముణులను దర్శించాలని ఆళ్వార్ తిరునగరికి బయలుదేరారు. వీరిద్దరు ఆళ్వార్ తిరునగరి వెలుపల కలుసుకున్నారు. పరస్పరం నమస్కరించుకొని మర్యాదలతో పలకరించుకొని ఆలింగనం చేసుకున్నారు. మాముణుల శిష్యులు వీరిద్దరి కలయికను పెరియ నంబి మరియు ఎంపెరుమానార్ ల కలయిక వలె జరిగినదని భావించి పారవశ్యముచే ఆనందాన్ని అనుభవించారు.
ఇద్దరు కలసి ఆళ్వార్ తిరునగరికి చేరుకున్నారు. మాముణులు ఆచార్యహృదయాన్ని ఒక సారి సంపూర్ణంగా ఆయ్ జనన్యాచార్యుల వద్ద సేవించారు. ఉపన్యాసం చివరి రోజున మామునులు, ఆయ్ జనన్యాచార్యుల మీద ఒక అందమైన తనియన్ ను వ్రాసి వారికి సమర్పించారు. ఆయ్ జనన్యాచార్యులు దానికి తగిన వాడిని కాదని భావించి ప్రతిగా వారు మాముణులను కీర్తిస్తు ఈ తమిళ పాశురాన్ని అనుగ్రహించారు.
పూత్తురిల్ వన్దుదిత్త పుణ్ణియనో?
పూంగకమళుం తాతారుంఅళిగియమార్బన్ తానివనో?
తూత్తూర వన్ద నెడుమాలో ?
మణవాళ మామునివన్ ఎన్దైయివర్ మూవరిలమ్ యార్?
సంక్షిప్త అనువాదం:
వీరు శ్రీ పెరుంబుదూర్లో దర్శనమిచ్చు సద్గుణ సంపన్నులగు ఎంపెరుమానారా?
వీరు వకుళ పుష్పమాలచే అలంకరింప బడ్డ నమ్మాళ్వారా? కృష్ణునిగా తనకు తాను పాండవులను రక్షించడానికి వచ్చిన దూతయా? – సౌలభ్య ప్రదర్శనపైన చెప్పిన ముగ్గురి కన్నా నాయందు తండ్రి ఆప్యాతను ప్రదర్శించిన మాముణులు వీరు.
ఆయ్ జనన్యాచార్యులు కొంత కాలం ఆళ్వార్ తిరునగరిలో నివసించి చివరకు తిరునారాయణ పురమునకు చేరుకొనిరి. కాని వీరు లేని సమయాన వీరి పట్ల అసూయ గలవారు ఆయ్ జనన్యాచార్యులు పరమపదమును చేరుకున్నారని ప్రచారం చేసి సంపదనంతా స్వాధీన పరచుకొని దేవాలయ ఆధీనంలోకి చేర్చారు.
దీని చూసిన జనన్యాచార్యులు చాలా ఆనందించి ఇలా అన్నారు “భగవానుడు తన ఆప్తుల దగ్గరనుండి సంపదనంతటిని తీసుకొనేస్తారు కావున ఇది గొప్పచర్యే”. సాధారణ జీవితాన్ని గడపినారు. ఆచార్యుని ద్వారా అనుగ్రహించిబడిన తమ తిరువారాధన పెరుమాళ్ (ఙ్ఞాన పిరాన్) తో కైంకర్యము కొనసాగాలని ప్రార్థన చేశారు. అంతిమ దశలో సన్యా సాశ్రమాన్ని స్వీకరించి పరమపదమునకేగి అక్కడ ఎంపెరుమాన్ కు నిత్య కైంకర్యము చేయసాగిరి.
ఇంతవరకు మనం ఆయ్ జనన్యాచార్యుల విశేషమైన జీవిత ఘట్టములను చూశాము. వీరు బహుముఖ ప్రఙ్ఞాశాలి, తన ఆచార్యులకు మరియు మాముణులకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. లేశమాత్ర భాగవత కైంకర్యము మనకు అబ్బాలని ఆయ్ జనన్యాచార్యుల పాద పద్మముల యందు ప్రార్థన చేద్దాం.
ఆయ్ జనన్యాచార్యుల తనియన్:
ఆచార్య హృదయస్యార్త్తాః సకలా యేన దర్శితాః |
శ్రీశానుదాసమ్ అమలం దేవరాజం తమాశ్రయే ||
ఆచార్య హృదయమునకు దివ్యార్థములను అనుగ్రహించిన, అమలులై (ఎలాంటి అఙ్ఞానము లేక) ఉన్న శ్రీశానుదాసులు అను నామాంతరము కలిగిన దేవ రాజాచార్యులను ఆశ్రయిస్తున్నాను.
అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస
మూలము: http://acharyas.koyil.org/index.php/2013/04/24/thirunarayanapurathu-ay-english/
పొందుపరిచిన స్థానము – https://acharyas.koyil.org/index.php/2012/08/17/introduction-contd-english/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org/index.php
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org
2 thoughts on “తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యులు”
Comments are closed.